ఉత్తర ప్రదేశ్

భారతీయ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia

ఉత్తర ప్రదేశ్
Remove ads

ఉత్తర ప్రదేశ్ (హిందీ: उत्तर प्रदेश, ఉర్దూ: اتر پردیش) భారతదేశంలో అత్యధిక జనాభా గల అతి పెద్ద రాష్ట్రం. వైశాల్యం ప్రకారం 4 వ పెద్ద రాష్ట్రం. ఉత్తర ప్రదేశ్ కు పరిపాలనా కేంద్రం లక్నో నగరం. కాని రాష్ట్ర ప్రధాన న్యాయస్థానం మాత్రం అలహాబాదులో ఉంది. ఇంకా ఆగ్రా, అలీగఢ్, అయోధ్య, వారాణసి, గోరఖపూర్, కాన్పూర్ ముఖ్యమైన నగరాలు. ఉత్తరప్రదేశ్ పొరుగున ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాలు ఉన్నాయి. ఉత్తరాన నేపాల్తో అంతర్జాతీయ సరిహద్దు ఉంది.

త్వరిత వాస్తవాలు ఉత్తరప్రదేశ్ उत्तर प्रदेशاتر پردیش, దేశం ...

ఉత్తరప్రదేశ్ ప్రధానంగా గంగా యమునా మైదానప్రాంతంలో విస్తరించి ఉంది. ఇది బాగా జన సాంద్రత ఎక్కువైన ప్రాంతము. 2000 సంవత్సరంలో పార్లమెంట్ చట్టం ప్రకారం అప్పటి మరింత విస్తారమైన ఉత్తరప్రదేశ్ లోని ఉత్తర పర్వతప్రాంతం ఉత్తరాఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. అయినా గాని ఉత్తరప్రదేశ్ దాదాపు 18కోట్ల జనాభా కలిగి ఉంది. ఇది భారతదేశంలో పెద్దరాష్ట్రము మాత్రమే కాదు. ప్రపంచంలోనే జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ కంటే పెద్ద దేశాలు 5 మాత్రమే ఉన్నాయి. అవి - చైనా, భారత్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, ఇండొనేషియా, బ్రెజిల్. సమకాలీన భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ పాత్ర చాలా కీలకమైనది కావడానికి ఇది కూడా ఒక ముఖ్య కారణం.

భారతదేశంలో ఆర్థిక అభివృద్ధిపరంగా ఉత్తరప్రదేశ్ వెనుకబడిన రాష్ట్రాలలో ఒకటి. మొత్తం రాష్ట్రంలో అక్షరాస్యత బాగా తక్కువ. అందునా మహిళలలో అక్షరాస్యత మరీ తక్కువ (భారతదేశంలో దాదాపు అన్ని రాష్ట్రాలలోనూ ఇదే పరిస్థితి ఉన్నది)

Remove ads

ప్రాచీన చరిత్ర

గంగా యమునా పరీవాహక ప్రాంతం పురాతన నాగరికతకు నిలయమైనందున పురాణకాలం నుండి ఉత్తరప్రదేశ్, బీహార్, దాని పరిసర ప్రాంతాలు (ఢిల్లీతో సహా) భారతదేశ చరిత్రలో ప్రముఖంగా కనిపిస్తాయి. ఎన్నో రాజవంశాలు, రాజ్యాలు ఈ ప్రాతంలో విలసిల్లాయి, అంతరించాయి.

ఇటీవలి చరిత్ర

అవధ్ (ఓధ్) రాజ్య సంస్థానమూ, బ్రిటిష్ రాజ్యభాగమైన ఆగ్రా కలిపి 1902 నుండి సంయుక్త పరగణాలు (యునైటెడ్ ప్రావిన్సెస్) అని పిలువబడ్డాయి. తరువాత రాంపూర్, తెహ్రి సంస్థానాలు కూడా అందులో విలీనం చేయబడ్డాయి. 1947లో భారతస్వతంత్రము తరువాత దీనినే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పరచారు. ఇలా చేయడం వల్ల యు.పి. అనే సంక్షిప్తనామం కొనసాగింది. 2000 సం.లో దీనిలో కొంత వాయవ్యభాగాన్ని ఉత్తరాఖండ్ అనే ప్రత్యేక రాష్ట్రంగా విభజించారు.

Remove ads

ప్రాంతాలు

  • వాయవ్య ప్రాంతం - రోహిల్ ఖండ్
  • నైఋతి ప్రాంతం - డోఅబ్, బ్రిజ్ (వ్రజభూమి)
  • మధ్య ప్రాంతం - అవధ్ (ఓధ్)
  • ఉత్తర భాగం - బాగల్ ఖండ్, బుందేల్ ఖండ్
  • తూర్పు భాగం - పూర్వాంఛల్ (భోజపురి ప్రాంతం)

ఉత్తర ప్రదేశ్ లోని 70 జిల్లాలు 17 విభాగాలుగా పరిగణించ బడుతాయి. అవి ఆగ్రా, అజంగడ్, అలహాబాదు, కాన్పూర్, గోరఖ్‌పూర్, చిత్రకూట్, ఝాన్సీ, దేవీపటణ్, ఫైజాబాద్, బాహ్రూచ్, బరేలీ, బస్తీ, మీర్జాపూర్, మొరాదాబాద్, మీరట్, లక్నో, వారాణసి, సహరాన్పూర్.

భాషలు

హిందీ, ఉర్దూ - రెండు భాషలూ రాష్ట్రంలో అధికార భాషలుగా గుర్తింపబడ్డాయి. పశ్చిమప్రాంతంలో మాట్లాడే "ఖరీబోలీ" (కడీబోలీ) భాష హిందీ, ఉర్దూ భాషలకు మాతృక వంటిది. 19వ శతాబ్దంలో హిందీ భాష ఇప్పుడున్న స్థితికి రూపు దిద్దుకొంది. లక్నోలో మాట్లాడే భాష "లక్నొవీ ఉర్దూ" ప్రధానంగా స్వచ్ఛమైన ఉర్దూగా పరిగణిస్తారు. ఈ భాషనే కవిత్వంలో విరివిగా వాడుతారు. ఇంకా కోషాలి, బ్రజ్ (2000 సంవత్సరాలు పురాతనమైన భాష), బాఘేలి, బుందేలి, భోజపురి భాషలు వేరువేరు ప్రాతాలలో మాట్లాడుతారు. భోజపురి భాష మాట్లాడేవారు ఉత్తరప్రదేశ్, బీహారు, నేపాల్ లలో విస్తరించి ఉన్నారు.

Remove ads

రాజకీయాలు

భారత రాజకీయాలలో ఉత్తరప్రదేశ్ చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. జవహర్ లాల్ నెహ్రూ, లాల్ బహాదుర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, చరణ్ సింగ్, వి.పి.సింగ్ ఇలా ఎందరో భారత ప్రధానమంత్రులు ఉత్తర ప్రదేశ్ నుండి దేశానికి నాయకులయ్యారు. అటల్ బిహారీ వాజపేయి కూడా లక్నో నుండి ఎన్నికయ్యారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీకి చెందిన యోగి ఆదిత్యనాద్ .

విద్యా వ్యవస్థ

ఉత్తరప్రదేశ్ రాష్ట్రం విద్యపై గణనీయమైన పెట్టుబడి పెట్టింది. ఫలితాలు ఒక మాదిరిగా ఉన్నాయి. ముఖ్యంగా ఆడువారు విద్యలో బాగా వెనుకబడి ఉన్నారు. 1991 గణాంకాల ప్రకారం 7 సంవత్సరములు పైబడిన బాలికలలో 25 % మాత్రం అక్షరాస్యులు. ఇదే సంఖ్య గ్రామీణ ప్రాంతాలలో 19%, వెనుకబడిన జాతులలో 8 నుండి 11% ఉండగా, వెనుకబడిన జిల్లాలలో మొత్తం అక్షరాస్యత 8% మించలేదు.

అలాగని ఉన్నత విద్యకు అవకాశాలు గణనీయంగానే ఉన్నాయి. రాష్ట్రంలో 16 విశ్వ విద్యాలయాలు, 3 సాంకేతిక విశ్వ విద్యాలయాలు, ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కాన్పూరు), ఒక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ (లక్నో), చాలా ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కాలీజీలు ఉన్నాయి.

Remove ads

పర్యాటక ప్రాంతాలు

Thumb
తాజ్ మహల్

తాజ్ మహల్ ( "తాజ్") మొఘల్ భవన నిర్మాణ శాస్త్రానికి ఒక గొప్ప ఉదాహరణగా గుర్తించబడింది.ఇది పర్షియా, భారతీయ, ఇస్లాం భవన నిర్మాణ అంశాల శైలితో నిర్మించబడింది.[2][3]

1983వ సంవత్సరంలో తాజ్ మహల్‌ను యునెస్కో ప్రపంచ పూర్వ సంస్కృతి ప్రదేశంగా మార్చింది., "భారత దేశంలో ఉన్న ముస్లిం కళ ఆభరణంగా ఉదాహరించింది.

అంతేగాక విశ్వవ్యాప్తంగా మెచ్చుకొనబడిన వాటిలో ఒక దివ్యమైన ప్రపంచ పూర్వ సంస్కృతిగా అభివర్ణించింది."

Remove ads

రాష్ట్రానికి చెందిన ప్రముఖులు

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads