ఢిల్లీ

భారతదేశపు మహానగరం, రాజధాని న్యూఢిల్లీతో కలిపి From Wikipedia, the free encyclopedia

ఢిల్లీmap
Remove ads

ఢిల్లీ వ్యాసం ఆరంభంలో మూడు వేరు వేరు పదాలగురించి తెలుసుకోవాలి. జాతీయ రాజధాని ప్రదేశం (నేషనల్ కేపిటల్ టెర్రిటరీ). ఇది చట్టపరంగా ఏర్పాటు చేయబడిన ప్రదేశం. ఇందులో ప్రధాన విభాగాలు. జాతీయ రాజధాని ప్రదేశం ఒక కేంద్రపాలిత ప్రాంతంగా 1956 నవంబరు 1న ఏర్పాటు చేయబడింది. దేశం నలుమూలలనుండి రాజధాని నగరానికి ప్రజలు వలస వస్తుండడంవల్ల అక్కడ జనం వత్తిడి విపరీతంగా పెరుగుతుంది. అందువలన చుట్టుప్రక్కల నగరాలను స్వతంత్రంగా అభివృద్ధి చేయాలనే అభిప్రాయంతో జాతీయ రాజధాని ప్రదేశాన్ని ఏర్పరచారు.

  • భారతదేశం రాజధాని: క్రొత్త ఢిల్లీ నగరం క్రొత్త ఢిల్లీ (ఆంగ్లం:New Delhi) (హిందీ: नई दिल्ली (నయీ దిల్లీ) ఇది భారతదేశపు రాజధాని. దీని విస్తీర్ణం 42.7 చదరపు కి.మీ. క్రొత్త ఢిల్లీ, ఢిల్లీ మెట్రోపాలిత ప్రాంతంలో ఉంది. ఇది భారత ప్రభుత్వ కేంద్రపాలిత ప్రాంతం పరిధిలో ఉంది.ఈ నగరాన్ని 20వ శతాబ్దంలో యునైటెడ్ కింగ్ డంకు చెందిన ఎడ్విన్ లుట్‌యెన్స్ నిర్మాణ నమూనా తయారుచేశాడు. ఈ నగరం తన విశాల మార్గాలు, వృక్ష-వరుసలు, అనేక సౌధాల కొరకు ప్రసిద్ధి.
  • పాత ఢిల్లీ :ఇది ఢిల్లీ నగరం లోని ఒక భాగం.దీనిని 1639 లో షాజహానాబాద్  పేరుతో షాజహాన్ దీనిని తన రాజధానిని ఆగ్రా నుండి మార్చుటకు దీనిని నిర్మించాడు. దీని నిర్మాణం 1639 లో ప్రారంభమై 1648 లో పూర్తయింది. అప్పటి నుండి 1857 లో మొగలు సామ్రాజ్యం పతనమయ్యే వరకూ ఇది వారికి రాజధానిగా ఉంది.[9]
  • ఢిల్లీ కంటోన్మెంటు :దీనిని ఢిల్లీ కాంట్ అని కూడా పిలుస్తారు.ఇది 1914 లో స్థాపించబడింది.1938 ఫిబ్రవరి వరకు, కంటోన్మెంట్ బోర్డు ఢిల్లీని, కాంట్ అథారిటీ అని పిలుస్తారు.కంటోన్మెంట్ వైశాల్యం సుమారు 4,258 హెక్టార్లు (10,521 ఎకరాలు) లలో విస్తరించి ఉంది. 2011 భారత జనాభా గణాంకాల ప్రకారం దీని పరిధిలో 59 పట్టణాలు, 165 గ్రామాలు ఉన్నాయి.2006 భారత కంటోన్మెంట్సు చట్టంప్రకారం, కంటోన్మెంట్ బోర్డుచే నిర్వహించబడుతుంది.[10]
(ఈ వ్యాసం భారత జాతీయ రాజధాని ఉన్న ఢిల్లీ మహానగరాన్ని గురించి తెలియజేస్తుంది) భారతదేశపు రాజధాని గురించిన వ్యాసం కోసం క్రొత్త ఢిల్లీ చూడండి.
త్వరిత వాస్తవాలు Delhi, Country ...
Remove ads

సమీప పట్టణాలు

  1. హర్యానా లోని ఫరీదాబాద్, గుర్‌గావ్‌ పట్టణాలు
  2. ఉత్తర ప్రదేశ్‌ లోని ఘజియాబాద్, నోయిడా (న్యూ ఒక్లహా ఇండస్ట్రియల్ డెవెలెప్మెంట్ అధారిటీ - నోయిడా) ప్రాంతాలు

చరిత్ర

ఢిల్లీ కేంద్రంగా ఎన్నో వేల సంవత్సరాల చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాలు వెలిసినాయి, పతనమైనాయి. మహాభారతంలో పాండవుల రాజధాని ఇంద్రప్రస్థం అని ఈ నగరాన్ని ప్రస్తావించారు. 19వ శతాబ్దారంభం వరకు "ఇందర్‌పాత్" అనే గ్రామం ఇక్కడ ఉండేది. బ్రిటిష్‌వారి క్రొత్త రాజధాని నిర్మాణంలో ఆ గ్రామం కనుమరుగయ్యింది. క్రీ.పూ. 1000 సంవత్సరాల నాటి రంగువేసిన కూజాలు త్రవ్వకాలలో బయటపడినాయి. పురావస్తు పరిశోధనా సంస్థ (ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా) వారి అంచనాల ప్రకారం వేల సంవత్సరాలలో నిర్మించిన చారిత్రిక కట్టడాలు 60,000 పైగా ఢిల్లీలో ఉన్నాయి. ఇటీవలి చరిత్రలోనే "ఏడు సామ్రాజ్యాల రాజధాని"గా ఢిల్లీని వర్ణిస్తారు.

ఒక ప్రక్క గంగా-యమునా మైదానానికి, మరొక ప్రక్క ఆరావళీ-వింధ్య పర్వత శ్రేణులకు మధ్య ప్రాంతంలో ఉన్నందున పురాతన కాలం నుండి ఢిల్లీ ప్రధాన వర్తక మార్గాలకు కూడలిగా ఉంది. ఆ కారణంగానే అక్కడ రాజ్యాధికారాలు, విద్య, సంస్కృతి వర్ధిల్లాయి.

మౌర్యసామ్రాజ్యం కాలం నాటి (క్రీ.పూ. 300) ఆధారాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. అప్పటినుండి ఢిల్లీ అవిచ్ఛిన్నంగా జనావాసంగా వర్ధిల్లింది. శ్రీనివాసపురి ప్రాంతంలో అశోకుని కాలంనాటి శాసనం 1966లో కనుగొన్నారు. ఫిరోజ్‌షా తుగ్లక్ రెండు అశోకుని కాలంనాటి శాసన స్తంభాలను ఢిల్లీకి తెచ్చాడు. కుతుబ్ మినార్ వద్ద ప్రసిద్ధి చెందిన ఉక్కు స్తంభం గుప్తవంశము, కుమారగుప్తుడు సా.శ. 320-540 మధ్యకాలంలో తయారు చేయించబడింది. దానిని 10వ శతాబ్దంలో ఢిల్లీకి తెచ్చారు.

ఢిల్లీ ప్రాంతంలో 8 ప్రధాన నగరాలు వర్ధిల్లాయి. వాటిలో 4 ఇప్పటి ఢిల్లీకి దక్షిణాన ఉన్నాయి.

మధ్యకాలపు చరిత్రనుండి చూస్తే ఢిల్లీలో 7 నగరాలను గుర్తించవచ్చును. కొన్నింటి అవశేషాలు ఇప్పటికీ ఉన్నాయి.

  1. కిలా రాయి పితోడా- పృథ్వీరాజ్ చౌహాన్ చే నిర్మితం - లాల్‌కోట వద్ద పాత రాజపుత్ సెటిల్‌మెంటు వద్ద;
  2. సిరి - 1303లో అల్లావుద్దీన్ ఖిల్జీ నిర్మించినది;
  3. తుగ్లకాబాద్ - 1321-1325 మధ్య ఘియాజుద్దీన్ తుగ్లక్ నిర్మించింది;
  4. జహానపనా - 1325-1351 మధ్య ముహమ్మద్ బిన్ తుగ్లక్ నిర్మించింది;
  5. కోట్లా ఫిరోజ్ షా - 1351-1388 మధ్య ఫిరోజ్‌షా తుగ్లక్ నిర్మించింది;
  6. పురానా కిలా - 1538-1545 మధ్య షేర్ షా సూరి నిర్మించింది, అదే ప్రాంతంలో హుమాయూన్ నిర్మించిన దిన్‌పనా (ఇదే ఇంద్రప్రస్థం అని అంటారు);
  7. షాజహానాబాద్ - 1638-1649 మధ్య షాజహాన్ నిర్మించింది. ఆగ్రా కోట, ఎఱ్ఱకోట, చాందినీచౌక్ ఇందులోనివే.

1857 నుండి, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత, ఢిల్లీ బ్రిటిష్‌వారి అధీనంలోకి వచ్చింది. అప్పుడు బ్రిటిషువారు కలకత్తానుండి రాజ్యం చేస్తున్నందువలన ఢిల్లీ రాజధాని నగరం హోదాను కోల్పోయింది. మళ్ళీ 1911 లో కలకత్తానుండి రాజధాని ఢిల్లీకి మార్చారు. ఎడ్విన్ లుట్యెన్స్ అనే భవననిర్మాణశిల్పి పాతనగరంలో కొంతభాగాన్ని పూర్తిగా కూలద్రోయించి క్రొత్త ఢిల్లీలోని ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని చేయించాడు.

Remove ads

భౌగోళికం

ఢిల్లీ జాతీయ రాజధాని ప్రదేశం 1483 చ.కి.మీ. వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ప్రదేశం అత్యధిక పొడవు 51.9 కి.మీ., అత్యధిక వెడల్పు 48.48 కి.మీ. మొత్తం 1483 చ.కి.మీ.లలో 783 చ.కి.మీ. గ్రామీణ ప్రాంతం, 700 చ.కి.మీ. పట్టణ ప్రాంతం. మూడు స్థానిక నగర పాలనా సంస్థలున్నాయి. అవి

  • ఢిల్లీ నగర మునిసిపల్ కార్పొరేషన్ - 1397.9 చ.కి.మీ.
  • క్రొత్తఢిల్లీ నగర మునిసిపల్ కార్పొరేషన్ - 42.78 చ.కి.మీ.
  • ఢిల్లీ కంటోన్మెంట్ బోర్డు - 43 చ.కి.మీ.

పెద్ద పట్టణాలు

మరింత సమాచారం పట్టణం, జనాభా (2001) ...

ఆధారం: 2001 జనాభా లెక్కలు Archived 2007-06-07 at the Wayback Machine

Remove ads

పాలన, విభాగాలు

జాతీయ రాజధాని ప్రదేశం ఒక కేంద్రపాలిత ప్రాంతంగా 1956 నవంబరు 1న ఏర్పాటు చేయబడింది. 1991లో జాతీయ రాజధాని ప్రదేశానికి (ఢిల్లీకి) ఒక అసెంబ్లీ (విధాన సభ), ఒక ముఖ్యమంత్రి ఏర్పాటు ఆమోదింపబడింది. ఈ విధమైన విధానం ఢిల్లీకి, పుదుచ్చేరికి మాత్రమే ఉంది. కనుక ఢిల్లీ పూర్తిగా కేంద్రపాలిత ప్రాంతమనిగాని, పూర్తిగా రాష్ట్రమనిగాని అనడం కుదరదు.కాలక్రమంగా ఢిల్లీ ఒక పూర్తి రాష్ట్రం కావాలని ప్రణాళిక

జాతీయ రాజధాని ప్రదేశం ప్రత్యేకత ఏమంటే - పోలీసు, పాలన వంటి కొన్ని ప్రధాన బాధ్యతలు ప్రధానంగా కేంద్రప్రభుత్వం అధీనంలో ఉంటాయి. మునిసిపల్ వ్యవహారాలు స్థానికంగా ఎన్నుకొనబడిన ప్రభుత్వం చూస్తుంది.

ఢిల్లీని 9 జిల్లాలుగా విభజించారు. ఢిల్లీనుండి పార్లమెంటు లోక్‌సభకు 7గురు సభ్యులు, రాజ్యసభకు ముగ్గురు సభ్యులు ఎన్నుకొనబడుతారు.

Remove ads

ఆర్ధిక రంగం

ఢిల్లీ స్థూల రాష్ట్రోత్పత్తి (మార్కెట్ ధరల ప్రకారం) క్రిది పట్టికలో ఇవ్వబడింది (మిలియన్ రూపాయలలో).భారత ప్రభుత్వం గణాంక విభాగం అంచనా.

మరింత సమాచారం సంవత్సరం, స్థూల ఆర్థిక ఉత్పత్తి ...

వాణిజ్య సంస్థలలో 12% సంస్థలకు ప్రధాన కార్యాలయాలు ఢిల్లీలో ఉన్నాయి.[11] ఆర్థికంగా బాగా సంపన్నమైన నగర ప్రదేశాలలో ఢిల్లీ ఒకటి. ఉదాహరణకు, మిగిలిన 4 మహానగరాలు (బెంగళూరు, కొలకత్తా, చెన్నై, ముంబై) అన్నింటి మొత్తంకంటే ఢిల్లీలో ఎక్కువ కార్లున్నాయని అంచనా. ఇటీవలికాలంలో బహుళజాతి వాణిజ్య సంస్థలకు ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాలు ఆకర్క్షణీయమైన ప్రారంభ స్థలాలయ్యాయి. దేశంలో కార్లు, వార్తాసాధనాలు, గృహోపకరణాలు అందించే కంపెనీలు ఢిల్లీ పరిసరాలలో బాగా ఉన్నాయి. ఇక్కడి మంచి విద్యావకాశాలవలన విజ్ఞానం ప్రధానవనరుగా ఉండే పారిశ్రామిక,వాణిజ్య వ్యవస్థలు కూడా ఢిల్లీలో బాగా వృద్ధి చెందుతున్నాయి.

విస్తారమైన పాలనా వ్యవస్థ, ప్రభుత్వోద్యోగులు, అన్నిప్రాంతాలనుండివచ్చిన జనులు, 160 పైగా రాయబార కార్యాలయాలు - ఇవన్నీ ఢిల్లీలో వ్యాపారానికి మంచి ఊపునిస్తున్నాయి. ప్రజల కొనుగోలు శక్తి భారీగా ఉన్నందున దేశంలో ముఖ్యమైన మార్కెట్లలో ఢిల్లీ ఒకటి.

Remove ads

వాతావరణం

ఢిల్లీ వాతావరణం చలీ, వేడి కూడా ఎక్కువ. ఉష్ణోగ్రతలు −2 నుండి 47 డిగ్రీలు సెంటీగ్రేడు మధ్యలో ఉంటాయి.

రవాణా సౌకర్యాలు

Thumb
నిర్మాణంలో ఉన్న ఢిల్లీ మెట్రోరైలు ప్రాజెక్టు.

ఢిల్లీలో అన్ని విధాలైన రవాణా సౌకర్యాలు ముమ్మరంగా ఉపయోగింపబడుతున్నాయి. ప్రైవేటు, ప్రభుత్వ రవాణా సౌకర్యాలు- గుఱ్ఱపు బండ్లు, రిక్షాలు, ఆటో రిక్షాలు, మోటర్ సైకిళ్ళు, కార్లు, బస్సులు, లోకల్ రైళ్ళు - అన్ని విధాలైన వాహనాలు విస్తృతంగా వినియోగిస్తారు.

విద్యా సంస్థలు

అక్షరాస్యత: పురుషులు 87.3%, స్త్రీలు 74.7%, మొత్తం మీద 81.7%[12] జాతీయ రాజధాని ప్రదేశం విద్యా డైరెక్టరేటు (డైరెక్ట్ర్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ ) అధీనంలో ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలలు నడుస్థాయి.[13].రాజధాని, మహానగరం, వాణిజ్య, వ్యాపార కేంద్రం అయినందున ఢిల్లీలో అన్నివిధాలైన విద్యావకాశాలు, మంచి ప్రమాణాలు గల విద్యాలయాలు - అన్ని రంగాలలోనూ - మెండుగా ఉన్నాయి.

విశ్వ విద్యాలయాలు

స్కూళ్ళు

  • ఎయిర్ ఫోర్స్ బాల్ భారతి స్కూల్
  • అపీజే పబ్లిక్ స్కూల్
  • ఆర్మీ పబ్లిక్ స్కూల్
  • బాల భారతి పబ్లిక్ స్కూల్
  • బ్లూబెల్స్ స్కూల్
  • జీసస్ అండ్ మేరీ కాన్వెంట్
  • డి.ఎ.వి పబ్లిక్ స్కూల్
  • ఢిల్లీ పబ్లిక్ స్కూల్
  • డి.టి.ఇ.ఏ సీనియర్ సెకండరీ స్కూల్ (లు)
  • ఫెయిత్ అకాడమీ
  • గురు హర్కిషన్ పబ్లిక్ స్కూల్
  • కేంద్రీయ విద్యాలయ
  • కులాచి హన్స్రాజ్ మోడల్ స్కూల్
  • లేడీ ఇర్విన్ సీనియర్ సెకండరీ స్కూల్
  • మానవ్ స్థాలి స్కూల్
  • మోడరన్ స్కూల్ (బారకంబా)
  • మౌంట్ సెయింట్ మేరీ స్కూల్
  • మదర్స్ అంతర్జాతీయ స్కూల్
  • సెయింట్ కొలంబస్ స్కూల్
  • సెయింట్ జేవియర్స్ స్కూల్
  • సర్దార్ పటేల్ విద్యాలయ
  • స్ప్రింగ్ డాల్స్ స్కూల్
  • వసంత్ వ్యాలీ స్కూల్

చూడదగిన స్థలాలు

Thumb
కుతుబ్ మినార్
Remove ads

ప్రముఖులు

ఢిల్లీ వార్తాపత్రికలు

  • ఏషియన్ ఏజ్
  • బిజినెస్ లైన్
  • బిజినెస్ స్టాండర్డ్
  • ది ఎకనామిక్ టైమ్స్
  • ఫైనాన్సియల్ ఎక్స్ ప్రెస్
  • ది హిందూ
  • ది హిందూస్థాన్ టైమ్స్
  • ఇండియన్ ఎక్స్ ప్రెస్
  • నవభారత్ టైమ్స్
  • పయోనీర్
  • సంధ్య టైమ్స్
  • ది స్టేట్స్ మన్
  • ది టైమ్స్ ఆఫ్ ఇండియా

ఢిల్లీ మార్కెట్లు

Thumb
పాతఢిల్లీలో ఒక బజారు (2004 చిత్రం)
  • చాందినీ చౌక్
  • చావలా
  • దిల్లీహాట్
  • కన్నాట్ ప్లేస్
  • గ్రేటర్ కైలాష్
  • జనపథ్
  • జనక్‌పురి
  • జ్వాలాహెది
  • కరోల్‌బాగ్
  • కమలానగర్
  • ఖాన్‌మార్కెట్
  • లజపత్‌నగర్ సెంట్రల్ మార్కెట్
  • నజఫ్‌గర్
  • నెహ్రూప్లేస్
  • పాలికాబజార్
  • రాజోరి గార్డెన్
  • సదర్‌బజార్
  • సాకేత్
  • సరోజినీ నగర్
  • దక్షిణ ఎక్స్టెన్షన్
  • తిలక్‌నగర్
  • వసంతకుంజ్
  • వసంతవిహార్
  • ఆజాద్‌పురి, ఓఖ్లామండీ - కూరగాయల టోకు మార్కెట్లు
  • మెహ్రౌలీ - ధాన్యాల టోకు మార్కెట్టు

ఇవి కూడా చూడండి

వనరులు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads