ఊపిరి (సినిమా)
From Wikipedia, the free encyclopedia
Remove ads
ఊపిరి 2016లో విడుదలైన తెలుగు సినిమా. దీనికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించారు. ఇది ఫ్రెంచి సినిమా "ది ఇన్‌టచబుల్స్" (The Intouchables, 2011) ఆధారంగా పొట్లూరి వి. ప్రసాద్ నిర్మించారు. ఇది తమిళంలో కూడా ఒకే సమయంలో విడుదల చేయబడినది. ఇందులో అక్కినేని నాగార్జున, కార్తీ ప్రధాన పాత్రలు పోషించారు.
Remove ads
తారాగణం
- అక్కినేని నాగార్జున - విక్రమాదిత్య
- కార్తీ - శ్రీను
- తమన్నా - కీర్తి
- ప్రకాష్ రాజ్ - ప్రసాదరావు
- జయసుధ - శ్రీను తల్లి
- ఆలీ - లాయర్ లింగం
- తనికెళ్ల భరణి - కాళిదాసు
- కల్పన - లక్ష్మి
- భరత్ రెడ్డి - వైద్యుడు
- సత్య కృష్ణన్ - ఫిజియోథిరపిస్టు
- ఉమా పద్మనాభన్
- తాగుబోతు రమేష్
- శ్రీనివాస్ సాయి - శ్రీను తమ్ముడు
- హర్షవర్ధన్ - పోలీస్ ఇనస్పెక్టర్
- ప్రవీణ్
కథ
కాళ్ళూ చేతులూ చచ్చుబడి చక్రాల కుర్చీకే పరిమితమైన ఓ కోటీశ్వరుడు. జైలు నుండి పెరోల్‌పై బయటకొచ్చి, ఇంట్లోవాళ్ళ చేత తిరస్కరించబడి, తప్పని పరిస్థితుల్లో ఆ కోటీశ్వరుడి దగ్గర పనిలో చేరే ఓ యువకుడు. కోట్ల మధ్య ఊపిరి సలపకుండా ఉండే ఆ కోటీశ్వరుడు, ఈ కుర్రాడి కారణంగా తాజా శ్వాసను ఎలా వీల్చుకున్నాడు? డబ్బుంటే చాలు సమస్యలుండవని భావించిన ఈ కుర్రాడు, ఆ కోటీశ్వరుడిని దగ్గరగా చూసి జీవితం గురించి ఏం తెలుసుకున్నాడు? అనేది కథా సారాంశం.[3]
Remove ads
పాటలు
ఈ సినిమాకి గోపీ సుందర్ సంగీతాన్ని అందించారు.
పురస్కారాలు
సైమా అవార్డులు
2016 సైమా అవార్డులు (తెలుగు)
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads