అక్కినేని నాగార్జున
ప్రముఖ సినీ నటుడు, నిర్మాత From Wikipedia, the free encyclopedia
Remove ads
అక్కినేని నాగార్జున (ఆగష్టు 29, 1959న చెన్నైలో జన్మించిన) ప్రసిద్ధ తెలుగు సినిమా నటుడు, నిర్మాత, టెలివిజన్ వ్యాఖ్యాత, ఔత్సాహిక వ్యాపారవేత్త. ఇతను అక్కినేని నాగేశ్వర రావు కుమారుడు. నాగార్జున సుమారు 100 పైగా చిత్రాల్లో నటించాడు. వీటిలో ఎక్కువ భాగం తెలుగు సినిమాలు కాగా కొన్ని తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించాడు. నాగార్జున నటుడిగా, నిర్మాతగా కలిపి తొమ్మిది నంది పురస్కారాలు, మూడు దక్షిణాది ఫిల్మ్ ఫేర్ పురస్కారాలు, రెండు జాతీయ చలనచిత్ర పురస్కారాలు అందుకున్నాడు.
1989 లో మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన గీతాంజలి సినిమా అత్యధిక ప్రజాదరణ పొందిన చిత్రంగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. 1990 లో రాం గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన శివ సినిమా 13 వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శించబడింది. అదే సంవత్సరంలోనే శివ సినిమా హిందీ పునర్నిర్మాణంతో బాలీవుడ్ లోకి ప్రవేశించాడు. నాగార్జున పలు జీవిత చరిత్ర ఆధారిత సినిమాల్లో నటించాడు. అన్నమయ్య, శ్రీరామదాసు, శిరిడీ సాయి, హథీరాం బావాజీ మొదలైన వారి జీవిత చరిత్ర సినిమాల్లో నటించాడు. 1995 నుంచి ఈయన సినిమా నిర్మాణంలోకి అడుగుపెట్టాడు. అన్నపూర్ణా స్టూడియోస్ అనే సినీ నిర్మాణ సంస్థకు అధినేత. హైదరాబాదులో అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా అనే లాభాపేక్షలేని సంస్థను కూడా నడిపిస్తున్నాడు.[1][2][3]
Remove ads
వ్యక్తిగతం
నాగార్జున సుప్రసిద్ధ సినీ నటులైన అక్కినేని నాగేశ్వర రావు, అక్కినేని అన్నపూర్ణ దంపతుల రెండవ కుమారుడు. నాగార్జున హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను, లిటిల్ ప్లవర్ స్కూల్‌లో ఇంటెర్మీడియట్ విద్యను అభ్యసించారు. తరువాత మద్రాస్‌లో మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఇతని ప్రథమ వివాహం ఫిబ్రవరి 18, 1984 [4] నాడు లక్ష్మితో [5] జరిగింది. ఈమె ప్రసిద్ధ నటుడు వెంకటేష్ కు సోదరి.[6] వీరిరువురు విడాకులు తీసుకున్నారు.[7] తరువాత 1992 జూన్ నెలలో నాగార్జున శివ చిత్రంలో సహనటి అయిన అమలను వివాహమాడారు. నాగార్జునకు ఇద్దరు కుమారులున్నారు. మొదటి కుమారుడు నాగ చైతన్య (పుట్టిన తేదీ నవంబర్ 23, 1986)[4] మొదటి భార్య కొడుకు. అఖిల్ (పుట్టిన తేదీ ఏప్రిల్ 8 1994)[4] రెండవ భార్య కొడుకు.
Remove ads
సినిమా జీవితము
నాగార్జున మొదటి చిత్రం విక్రం, 1986 మే 23లో విడుదల అయింది. ఈ చిత్రం హిందీ చిత్రం హీరోకి అనువాద రూపము. తరువాత నాలుగు చిత్రాలలో నటించిన పిమ్మట, ఈయన మజ్ను సినిమాలో విషాద కథానాయకుడి పాత్ర పోషించారు. విషాద పాత్రలు పోషించటంలో నాగార్జున తండ్రి, నాగేశ్వరరావు సుప్రసిద్ధులు. నాగార్జున, తన తండ్రితో కలసి మొదటిసారిగా కలెక్టర్ గారి అబ్బాయి చిత్రంలో నటించారు. సినీనటి శ్రీదేవితో నటించిన ఆఖరి పోరాటం సినిమా నాగార్జునకు విజయాన్ని అందించిన మొదటి చిత్రం. ఈ చిత్రం 12 కేంద్రాలలో 100 రోజులు ఆడింది. తరువాత మణిరత్నం దర్శకత్వం వహించిన ప్రేమకథా చిత్రం గీతాంజలి భారీ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సంగీతం, మంచి కథతో వచ్చిన ఈ చిత్రం నాగార్జునను ప్రేమ కథా చిత్రాల నాయకుడిగా నిలబెట్టింది. ఇది మణిరత్నం నేరుగా తెలుగులో దర్శకత్వం వహించిన ఏకైక చిత్రం., రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన యాక్షన్ చిత్రం శివ, ఈ రెండు చిత్రములు పెద్ద విజయం సాధించి ఇతనిని విజయవంతమైన తెలుగు కథానాయకుల సరసన నిలబెట్టాయి. నాగార్జున నూతన దర్శకులను ప్రోత్సహించి తాను నిర్మించే సినిమాలకు దర్శకత్వము వహించే అవకాశము ఇస్తాడన్న పేరు ఉంది. ఈ చిత్రానికి గాను నాగార్జున ఫిలింఫేర్ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నారు. శివ చిత్రాన్ని హిందీలో శివ అనే పేరుతోనే పునర్నిర్మించి బాలీవుడ్లో కూడా అడుగుపెట్టారు. ఈ చిత్రం హిందిలో కూడా భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రెసిడెంటు గారి పెళ్ళాం, హలో బ్రదర్ వంటి చిత్రాలు ఈయనకు మాస్ హీరో అన్న పేరును తెచిపెట్టాయి. ఆ తరువాత కృష్ణ వంశీ దర్శకత్వములో విడుదలైన నిన్నే పెళ్ళాడతా భారీగా విజయవంతమయ్యింది. ఆ తరువాత అన్నమయ్య చిత్రములో వాగ్గేయకారుడు అన్నమయ్య పాత్రను పోషించే సవాలును స్వీకరించి విజయం సాధించాడు. ఈ సినిమా 42 కేంద్రాలలో 100 రోజులు పైగా నడిచింది. ఈ చిత్రానికి గాను నాగార్జున మొదటి సారిగా రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ నటుడిగా నంది అవార్డు అందుకున్నాడు. ఈ చిత్రంలో నాగార్జున కనపర్చిన అద్భుత నటనకు ప్రేక్షకుల నుండే కాకుండా విమర్శకుల నుండి కూడా అనేక ప్రశంసలు లభించాయి. అన్నమయ్య చిత్రానికి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు.
2006లో నాగార్జున శ్రీ రామదాసులో ముఖ్య పాత్రైన రామదాసును పోషించి విమర్శకుల ప్రశంశలందుకున్నాడు. ఈ చిత్రానికి కె.రాఘవేంద్రరావు దర్శకత్వము వహించాడు. ఈ చిత్రంలో నటనకు గాను నాగార్జున రాష్ట్ర ప్రభుత్వం నుండి మూడవ సారి ఉత్తమ నటుడి అవార్దు అందుకున్నారు. 2008వ సంవత్సరంలో వచ్చిన కింగ్ సినిమాలో నాగార్జున చేసిన అద్భుత నటనకు విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి. 2021లో వైల్డ్ డాగ్ సినిమాలో నటించాడు.[8]

Remove ads
పురస్కారములు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
- జాతీయ చిత్ర పురస్కారాలు
- 1997 - నిన్నే పెళ్ళాడతా సినిమా నిర్మించినందుకు గాను తెలుగులో ఉత్తమ చిత్రంగా జాతీయ చలనచిత్ర పురస్కారం
- 1998 - అన్నమయ్య సినిమాలో నటించినందుకు జాతీయ స్థాయి ప్రత్యేక జ్యూరీ పురస్కారం
- నంది పురస్కారాలు
- నటుడిగా
- 2011 - రాజన్న సినిమాకి గాను నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం
- 2006 - శ్రీరామదాసులో నంది ఉత్తమ నటుడు
- 2002 - సంతోషంలో నంది ఉత్తమ నటుడు[9]
- 1997 - అన్నమయ్యలో నంది ఉత్తమ నటుడు;[9] నిర్మాతగా:
- 1996 - నిన్నే పెళ్ళాడుతా కుటుంబ సమేతంగా చూడదగ్గ నంది చిత్రం (అక్కినేని పురస్కారం)
- 1999 - ప్రేమకథ నంది మూడో అత్యుత్తమ చిత్రం
- 2000 - యువకుడు నంది ప్రత్యేక జ్యూరీ పురస్కారం[10]
- 2002 - మన్మధుడు నంది ఉత్తమ చిత్రం
- 2011 - రాజన్న నంది ద్వితీయ ఉత్తమ చిత్రం;[11] ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలు
- 1990 - శివ సినిమాలో ఉత్తమ నటుడు.
- 1996 - నిన్నే పెళ్ళాడుతా ఉత్తమ చిత్ర పురస్కారం
- 1997 - అన్నమయ్య సినిమాలో ఉత్తమ నటుడు.
- దక్షిణ భారతదేశ అంతర్జాతీయ చలనచిత్ర పురస్కారం
- 2012 - రాజన్న సినిమాకు ప్రత్యేక ప్రశంసలు;[12] సినీ'మా' పురస్కారాలు
- 2012 - రాజన్న సినిమాలో ఉత్తమ నటుడిగా ప్రత్యేక ప్రశంసలు[13]
- 2013 - శిర్డీసాయి ఉత్తమ నటుడిగా ప్రత్యేక జ్యూరీ పురస్కారం [14]
- ఇతర పురస్కారాలు
- 1990 - శివ సినిమా ఎక్స్‌ప్రెస్ పురస్కారం
- 1996 - నిన్నే పెళ్ళాడుతా ఆకృతి చిత్ర పురస్కారం
- 1997 - అన్నమయ్య సినిమాకి స్క్రీన్ వీడియోకాన్ పురస్కారం
- 2000 - ఆజాద్ సినిమాకి ఆంధ్రప్రదేశ్ సినీ జర్నలిస్టు పురస్కారం
- 2011- టీ. సుబ్బరామిరెడ్డి కళారత్న పురస్కారం
- భరతముని పురస్కారాలప
- వంశీ బర్కిలీ పురస్కారాలు
- ఏపీ సినీ గోయర్స్ పురస్కారం
- 1989 - గీతాంజలి సినిమాలో ఉత్తమ నటుడు.
అవీ-ఇవీ
- ఈయన తన తండ్రి యొక్క నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్ని పునరుద్ధరించి తెలుగు సినిమా పరిశ్రమలో ఇటీవల కాలములో ఒక విజయవంతమైన నిర్మాతగా పేరు తెచ్చుకొన్నారు.
నటించిన చిత్రాలు
Remove ads
అక్కినేని వంశ వృక్షం
మూలాలు
ఇవి కూడా చూడండి
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads