ఐసిసి ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్
From Wikipedia, the free encyclopedia
Remove ads
ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్, ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి), టెస్టు క్రికెట్ కోసం నిర్వహించే లీగ్ పోటీ. [1] [2] 2019 ఆగస్టు 1 న ప్రారంభమైన ఈ టోర్నమెంటును టెస్టు వరల్డ్ కప్ అని కూడా అంటారు. టెస్టు క్రికెట్‌కు ఇది ముఖ్యమైన ఛాంపియన్‌షిప్. అంతర్జాతీయ క్రికెట్‌లోని మూడు ఫార్మాట్‌లలోనూ ఒక్కో అత్యున్నత టోర్నమెంటు ఉండాలనే లక్ష్యానికి అనుగుణంగా ఐసిసి, దీన్ని రూపొందించింది. [3]
2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో ఈ పోటీని నిర్వహించాలనే తొలి ప్రణాళిక రద్దైంది. దాన్ని 2017 జూన్‌కి రీషెడ్యూల్ చేసారు. రెండవ టెస్టు ఛాంపియన్‌షిప్, 2021 ఫిబ్రవరి-మార్చిలో భారతదేశంలో జరపాలని తలపెట్టారు.[4] [5] ఐసిసి నిర్ణయించిన కటాఫ్ తేదీ 2016 డిసెంబరు 31 నాటికి మొదటి నాలుగు ర్యాంకులు పొందిన టెస్టు జట్లు, మూడు మ్యాచ్‌ల టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడతాయి. రెండు సెమీ-ఫైనల్‌ల లోని విజేతలు ఫైనల్ ఆడతారు. [6] అయితే, 2014 జనవరిలో ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను రద్దు చేసి, 2017 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని పునరుద్ధరించారు. [7]
2017 అక్టోబరులో ఐసిసి, టెస్టు లీగ్‌కు సభ్యుల అంగీకారం పొందిందని ప్రకటించింది. ఇందులో రెండు సంవత్సరాల పాటు సిరీస్‌లు ఆడే టాప్ 9 జట్ల లోంచి మొదటి రెండు జట్లు ప్రపంచ టెస్టు లీగ్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ ఫైనల్‌ను ఐసిసి టోర్నమెంటుగా పరిగణిస్తారు.[8] WTC లోని లీగ్ గేమ్‌లను ఐసిసి ఈవెంట్‌గా పరిగణించరు. వాటి ప్రసార హక్కులు ఆతిథ్య దేశపు క్రికెట్ బోర్డుకే ఉంటాయి, ఐసిసికి కాదు. కానీ లీగ్ దశ మ్యాచ్‌ల మాదిరిగా కాకుండా, WTC ఫైనల్స్ మాత్రం ఐసిసి ఈవెంట్‌గా పరిగణించారు. మొదటి ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2019 యాషెస్ సిరీస్‌తో ప్రారంభమైంది. 2021 జూన్లో జరిగిన ఫైనల్‌లో భారత్‌ను ఓడించి న్యూజిలాండ్ ట్రోఫీని అందుకోవడంతో అది ముగిసింది. రెండవ ఐసిసి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఆగస్టు 4న పటౌడీ ట్రోఫీ సిరీస్‌తో ప్రారంభమైంది.[9] 2023 జూన్లో జరిగిన ఫైనల్‌లో ఆస్ట్రేలియా, భారత్‌ను ఓడించి ట్రోఫీని అందుకుంది.
Remove ads
చరిత్ర
2013 టోర్నమెంటును రద్దు చేసారు
ఈ ఛాంపియన్‌షిప్‌ను మొదటిసారిగా, 1996లో మాజీ క్రికెటరు, వెస్టిండీస్ జట్టు మేనేజరూ అయిన క్లైవ్ లాయిడ్ ప్రతిపాదించాడు. [10] తరువాత, 2009లో, ఐసిసి ప్రతిపాదిత టెస్టు మ్యాచ్ ఛాంపియన్‌షిప్ గురించి MCC తో చర్చించింది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ మార్టిన్ క్రో ఈ ప్రతిపాదన వెనుక ఉన్నాడు.[11]
2010 జూలైలో ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్ హారూన్ లోర్గాట్, క్రీడ సుదీర్ఘమైన రూపంపై ఆసక్తిని పెంచే ప్రయత్నంలో భాగంగా, నాలుగు ఉత్తమ ర్యాంకు దేశాలు సెమీ-ఫైనల్స్‌లోను, ఆపై ఫైనల్‌లోనూ పోటీపడేలా నాలుగేళ్ళ టోర్నమెంటు పద్ధతిని సూచించాడు. ఇంగ్లాండ్, వేల్స్‌లలో జరిగిన 2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో ఈ మొదటి టోర్నమెంటు జరపాలని ఉద్దేశించాడు. [12] [13]
2010 సెప్టెంబరు మధ్యలో దుబాయ్‌లోని తమ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్స్ కమిటీ, టెస్టు ఛాంపియన్‌షిప్ ఆలోచనను పరిశీలించింది. ఐసిసి అధికార ప్రతినిధి కోలిన్ గిబ్సన్ మాట్లాడుతూ, సమావేశం తర్వాత మరిన్ని విషయాలు వెల్లడిస్తానని, ఒకవేళ ఛాంపియన్‌షిప్‌ను ఇంగ్లాండ్‌లో నిర్వహిస్తే, ఆఖరి వేదికగా లార్డ్స్ ఉంటుందని అన్నాడు. [14] అనుకున్నట్లుగానే ఐసీసీ ఈ ప్లాన్‌కు ఆమోదం తెలిపి, 2013లో ఇంగ్లండ్, వేల్స్‌లో తొలి టోర్నీని నిర్వహించనున్నట్లు తెలిపింది. టోర్నీ ఫార్మాట్‌ను కూడా ప్రకటించారు. ఇది ప్రారంభ లీగ్ దశను కలిగి ఉంటుంది, నాలుగు సంవత్సరాల వ్యవధిలో ఆడతారు. మొత్తం పది టెస్టు క్రికెట్ దేశాలు (ఆస్ట్రేలియా, ఇండియా, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, శ్రీలంక, న్యూజిలాండ్, వెస్టిండీస్, జింబాబ్వే, బంగ్లాదేశ్) పాల్గొంటాయి. లీగ్ దశ తర్వాత మొదటి నాలుగు జట్లు ప్లే-ఆఫ్స్‌లో పాల్గొంటాయి. ఫైనల్‌లో టెస్టు క్రికెట్ ఛాంపియన్‌ను నిర్ణయిస్తారు. [15]
మొదటి 8 జట్ల మధ్య ప్లే-ఆఫ్ జరుగుతుందా లేదా మొదటి నాలుగు జట్ల మధ్య జరుగుతుందా అనే చర్చ జరిగాక, రెండో పద్ధతినే బోర్డు ఏకగ్రీవంగా ఎంచుకుంది. ఈ టోర్నమెంటు ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ స్థానంలో ఉంటుందని కూడా ప్రకటించారు. [15] నాకౌట్‌లో డ్రా అయిన మ్యాచ్‌ల ఫలితాలను ఎలా నిర్ణయించాలనే దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే, 2011లో, 2017 వరకు టెస్టు ఛాంపియన్‌షిప్ జరగదనీ, బోర్డులోని ఆర్థిక సమస్యలు, దాని స్పాన్సర్‌లు, ప్రసారకర్తలకు కట్టుబడి ఉన్నందున 2013 టోర్నమెంటును రద్దు చేస్తున్నామనీ ఐసిసి ప్రకటించింది. రద్దు చేసిన టోర్నమెంటును నిర్వహించాల్సిన ఇంగ్లండ్, వేల్స్‌కు 2013 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని నిర్వహిస్తాయి.[16] దీనిపై విస్తృతంగా విమర్శలు వచ్చాయి; గ్రెగ్ చాపెల్, గ్రేమ్ స్మిత్ ఇద్దరూ ఐసిసిని విమర్శించారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌ను వాయిదా వేయడం తప్పు, అన్యాయం అని అన్నారు. [17] [18] ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుందని భావించిన లార్డ్స్‌కు ఈ వాయిదా దెబ్బ అని గార్డియన్ రాసింది. [19]
2017 టోర్నమెంటూ రద్దైంది
2012 ఏప్రిల్లో జరిగిన ఐసిసి చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో, ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని చివరిగా, 2013లో నిర్వహించాలని నిర్ధారించారు. ప్రారంభ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్లే-ఆఫ్‌లు 2017 జూన్‌లో జరపాలని అనుకున్నారు.[5] ఆట ప్రతి ఫార్మాట్‌కు ఒక ట్రోఫీ మాత్రమే ఉంటుందని ఐసిసి తెలిపింది. 50 ఓవర్ల క్రికెట్‌లో క్రికెట్ ప్రపంచ కప్ ప్రీమియర్ ఈవెంట్ కాబట్టి, ఇకపై ఛాంపియన్స్ ట్రోఫీ జరగదు అని దాని అర్థం.
ఫైనల్ బహుశా చారిత్రక టైమ్‌లెస్ టెస్టు ఫార్మాట్‌ను అనుసరించి ఉండవచ్చు. [20] ఛాంపియన్‌షిప్ నిర్మాణంలో మరిన్ని మెరుగుదలల గురించి కూడా చర్చించారు.
అయితే 2014 జనవరిలో, 2017 ఐసిసి వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌ను రద్దు చేసి, 2017 ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీని పునరుద్ధరించారు. [7]
2019–21 టోర్నమెంటు
మొదటి టోర్నమెంటు 2019 యాషెస్ సిరీస్‌తో ప్రారంభమైంది. 2020 మార్చిలో, కోవిడ్-19 మహమ్మారి కారణంగా మ్యాచ్‌లను నిలిపివేసారు. 2020 జూలై కంటే ముందు తిరిగి ప్రారంభించలేదు. అనేక రౌండ్ల మ్యాచ్‌లను వాయిదా వేయడమో, లేదా చివరికి రద్దు చేయడమో జరిగింది. దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియాల మధ్య సిరీస్ కొనసాగదని నిర్ధారించబడినప్పుడు, న్యూజిలాండ్ ఫైనల్‌కు అర్హత సాధించిన మొదటి జట్టుగా అవతరించింది, [21] తర్వాత భారతదేశం ఉంది. తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ 2021 జూన్ 18 నుండి 23 వరకు ఇంగ్లాండ్, సౌతాంప్టన్‌లోని రోజ్ బౌల్‌లో భారత, న్యూజిలాండ్‌ల మధ్య జరిగింది. [22] ఫైనల్ తొలిరోజున, నాల్గవ రోజున వర్షం కారణంగా ఆడనప్పటికీ, [23] రిజర్వ్ డే చివరి సెషన్‌లో న్యూజిలాండ్ విజయం సాధించి మొదటి ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ట్రోఫీని కైవసం చేసుకుంది. [24]
2021–23 టోర్నమెంటు
WTC 2021–23 చక్రం 2021 ఆగస్టులో పటౌడీ ట్రోఫీ (భారత, ఇంగ్లండ్‌ల మధ్య 5 మ్యాచ్‌ల సిరీస్)తో ప్రారంభమైంది. [25] అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ కొత్త పాయింట్ల విధానంతో పూర్తి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రకటించింది. [26] 2022–23 బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో 3వ టెస్టు మ్యాచ్‌లో విజయం సాధించి, ఆస్ట్రేలియా ఫైనల్‌కు అర్హత సాధించింది. [27] న్యూజిలాండ్‌లో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక విజయం సాధించకపోవడంతో భారత్ అర్హత సాధించింది. [28] 2023 జూన్ 7 నుండి జూన్ 11 వరకు లండన్ లోని ది ఓవల్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్‌ను 209 పరుగుల తేడాతో ఓడించి, ఆస్ట్రేలియా ఛాంపియన్‌గా అవతరించింది. [29]
2023–25 టోర్నమెంటు
WTC 2023–25 చక్రం 2023 జూన్ 16న 1వ యాషెస్ టెస్ట్‌తో ప్రారంభమైంది.[25] WTC ఫైనల్ 2025 వేసవిలో లార్డ్స్‌లో జరుగుతుందని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అధికారికంగా ప్రకటించింది [30]
Remove ads
ఫలితాలు
Remove ads
జట్టు ప్రదర్శనలు
టెస్టు ఆడే దేశాలన్నిటి ప్రదర్శనల అవలోకనం:
కీ:
W | విజేత |
RU | రన్నర్స్-అప్ |
3వ | 3వ స్థానం |
ప్ర | అర్హత ఉంది, ఇంకా వివాదంలో ఉంది |
— | ఆడలేదు |
టోర్నమెంటు రికార్డులు
Remove ads
ఇవి కూడా చూడండి
- ఆసియా టెస్టు ఛాంపియన్‌షిప్
- 2005 ఐసిసి సూపర్ సిరీస్
- 2025 ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads