కృతి సనన్
From Wikipedia, the free encyclopedia
Remove ads
కృతి సనన్ (జననం1990 జులై 27) భారతీయ నటి, మోడల్. ఎన్నో పెద్ద కంపెనీల కమర్షియల్సులో నటించిన కృతి తెలుగులో మహేష్ బాబు సరసన 1 - నేనొక్కడినే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. అటు హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ సరసన హీరోపంతి సినిమాతో తెరంగేట్రం చేస్తోంది. ఆది పురుష్ హిందీ చిత్రంలో కృతి సనన్ నటించింది.
![]() | ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
2021లో వచ్చిన మిమీ సినిమాలో తన నటనకు అనేక అవార్డులను అందుకుంది, అందులో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు, ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర అవార్డు గంగూబాయి కతియావాడి చిత్రానికి అలియా భట్‌తో కలసి గెలుచుకుంది.[1][2]
2019 ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో ఆమె పేరు దక్కించుకుంది.
Remove ads
సినీ జీవితం
హిందీలో ఎన్నో కమర్షియల్సులో నటించిన కృతి సనన్ మహేష్ బాబు నటించిన 1 - నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీపరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలుత ప్రముఖ నటి కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో కథానాయికగా ఎన్నుకోబడ్డా డేట్స్ ఖాళీ లేక, ఉన్నవి సద్దుబాటు చెయ్యలేకపోయింది.[3] ఈ సినిమాలో నటించడానికి మొగ్గుచూపినా ఎలాంటి గొడవ లేకుండా సినిమా నుంచి తప్పుకుంది. ఆ సమయంలో దర్శకుడు సుకుమార్ ఈమెని కథానాయికగా ఎంచుకున్నారు.[4] ఈ సినిమాలో కృతి ఒక జర్నలిస్ట్ పాత్రను పోషించింది. సంక్రాంతి కానుకగా 2014లో విడుదలైన ఈ సినిమా విమర్శకుల నుంచి మిశ్రమ స్పందనను రాబట్టినా కృతి మాత్రం సానుకూల స్పందనను రాబట్టగలిగింది. సాక్షి దినపత్రిక తమ సమీక్షలో "కృతి సనన్ జర్నలిస్ట్‌గా, గౌతమ్ ప్రేయసి సమీరగా పర్వాలేదనిపించింది. ఈ చిత్రంలో కొంత ప్రాధాన్యం ఉన్న పాత్ర కృతి సనన్‌కు దక్కింది. కొత్త నటి అనే ఫీలింగ్‌ను కలిగించకుండా కృతి బాగానే జాగ్రత్త పడింది" అని వ్యాఖ్యానించారు.[5]
ఆపై హిందీలో జాకీ ష్రోఫ్ కొడుకు టైగర్ ష్రోఫ్ తొలి చిత్రమైన హీరోపంతి సినిమా ద్వారా హిందీలో కథానాయికగా అడుగుపెట్టింది. ఈ సినిమా జాకీ ష్రోఫ్ నటించిన హీరో సినిమా రీమేక్ అయినప్పటికీ అల్లు అర్జున్ నటించిన పరుగు సినిమా ఛాయలు కూడా ఇందులో కనపడటం ఆశ్చర్యం ఎందరికో కలిగించింది.[6][7] ఆ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుంటోంది. ఇంతలోనే అల్లు అర్జున్ కథానాయకుడిగా త్రివిక్రం దర్శకత్వం వహిస్తున్న సినిమాలో సమంతతో పాటు నటిస్తున్న మరో ఇద్దరు కథానాయికల్లో ఒకరిగా కృతి ఎన్నుకోబడింది.[8]
Remove ads
నటించిన చిత్రాలు
Remove ads
మ్యూజిక్ వీడియోస్
దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

2022 ఫిబ్రవరి 20న ముంబైలో నిర్వహించిన దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డ్స్ - 2022 లో మిమీ సినిమాలో నటించిన కృతి సనన్కు ఉత్తమ నటి అవార్డు దక్కింది.
మూలాలు
ఇతర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads