గడియారం రామకృష్ణ శర్మ

తెలుగు రచయిత From Wikipedia, the free encyclopedia

గడియారం రామకృష్ణ శర్మ
Remove ads

మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన సాహితీవేత్తలలో గడియారం రామకృష్ణ శర్మ ముఖ్యులు. అతను 1919, మార్చి 6న అనంతపురంలో జన్మించాడు. [1] మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్లో స్థిరపడి రచయితగా మంచి పేరు సంపాదించాడు. ఆలంపూర్‌కు సంబంధించిన చరిత్రను తెలిపే పలు పుస్తకాలు అతని చేతి నుంచి వెలువడినాయి. మాధవిద్యారణ్య అనే పుస్తకం అతను రచించిన పుస్తకాలన్నింటిలో ప్రామాణికమైనది. వీరు 2006, జూలై 25వ తేదీన మరణించారు. ఆయన సాహితీ సేవలకు గుర్తింపుగా 2007 కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (తెలుగు భాషలో) మరణానంతరం ప్రకటించారు [2]. అతను సాహితీవేత్తగానే కాకుండా స్వాతంత్ర్య సమరయోధుడుగానూ పేరొందాడు. స్వాతంత్ర్య సమరంలో చురుగ్గా పాల్గొన్నాడు. రామకృష్ణ శర్మ సంఘ సంస్కరణ అభిలాషి, రంగస్థల నటుడు కూడా.

త్వరిత వాస్తవాలు గడియారం రామకృష్ణ శర్మ, జననం ...
Remove ads

ప్రముఖ రచనలు

బాల సాహిత్యం
  • వీర గాథలు
క్షేత్ర చరిత్రలు
  • అలంపూరు శిథిలములు
  • అలంపూరు చరిత్ర
  • దక్షిణ వారణాసి
  • అలంపూరు మహాత్యం
  • అలంపూరు
  • బీచుపల్లి క్షేత్ర చరిత్ర
  • ఉమామహేశ్వర క్షేత్ర చరిత్ర
  • అనిమెల సంగమేశ్వర చరిత్ర ( కడప)
  • శ్రీ జోగులాంబా మహాశక్తి
దేశ చరిత్రలు
  • భారత దేశ చరిత్ర
  • ప్రపంచ రాజ్యాలు
జీవిత చరిత్రలు
  • శ్రీ నిత్యానంద స్వామి చరిత్ర
  • శ్రీ మాధవి విద్యారణ్యస్వామి చరిత్ర
  • శతపత్రములు (ఆత్మకథ) : మరణానంతరము ( 1919 మార్చి 6 - 2006 జూలై 25) కేంద్ర సాహిత్య ఆకాడేమి పురస్కారం (2007.)
సాహిత్యం
  • పాంచ జన్యం (ఖండ కావ్య సంపుటి)
  • తెలుగు సిరి (వ్యాసాలు)
  • దశరూపక సారం ( రూపక లక్షణ గ్రంథం)
  • కన్నడ సాహిత్య చరిత్ర (దక్షిణ భారత సాహిత్యాలు )
  • పంజాబు సాహిత్యం ( ఉత్తర భారత సాహిత్యాలు )
  • కన్నడ సాహిత్య సౌరభం
వాస్తు శిల్పం
  • మన వాస్తు సంపద
  • భారతీయ వాస్తు విజ్జానం
శాసన పరిశోధన
అనువాదాలు
  • గదా యుద్ధ నాటక ( కన్నడం నుంచి )
  • కన్నడ సణ్ణ కథెగళు
ప్రాచీన గ్రంథ పరిష్కరణలు
  • మంచన - కేయూర బాహు చరిత్ర
  • కొరవి గోపరాజు - సింహాసన ద్వాత్రింశిక
  • శ్రీ మదలంపూరీ క్షేత్ర మహాత్మ్యం ( సంసృతం)
ధార్మిక గ్రంథాలు
  • హిందూ ధర్మం
  • లఘునిత్య కర్మానుష్ఠానం
  • స్త్రీల పూజా విధులు
  • చటక పద్ధతి సంకల్ప శ్రాద్ధం
  • తుంగభద్రా పుష్కరాలు
Remove ads

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads