పొట్టేలు
From Wikipedia, the free encyclopedia
Remove ads
పొట్టేలు అంటే మగ గొర్రె .ఏట, పొట్లి అనికూడా ఆంటారు. మాంసాలలో లేతపొట్టేలు మాంసానికి మంచి గిరాకీ ఉంటుంది. గొర్రెలు నాలుగు కాళ్ళు కలిగిన క్షీరదాలు (పాలిచ్చే జంతువులు). వీటిని చాలా దేశాల్లో జీవనాధారం (బతుకు తెరువు) కోసం పెంచుతారు. వీటి ద్వారా లభించే ఉన్ని, మాంసం మొదలైన ఉత్పత్తుల ద్వారా ఆదాయాన్ని సంపాదిస్తారు. ఆస్ట్రేలియా దేశం గొర్రె మాంసానికి, ఉన్నికి ప్రసిద్ధి. మన దేశంలో యాదవులు (గొల్లలు) కులవృత్తిగా వీటిని పెంచుతారు.ఇవి క్షీరదాలు. వీటిని గ్రామాల్లో (పల్లెల్లో) ఎక్కువగా పెంచుతారు. వీటిని మాంసం కొరకు ఎక్కువగా పెంచుతారు. వీటి నుండి అరుదుగా పాలు కూడా తీస్తారు. వీటిలో కిన్ని ఉన్ని గొఱ్ఱె లుంటాయి. వీటిని ఉన్ని కొరకు పెంచుతారు. ఈ ఉన్నితో కంబళ్ళు నేస్తారు. మగ గొఱ్ఱెను పొట్టేలు అంటారు. దీనికి కొమ్ములుంటాయి. ఆడ గొఱ్ఱెలకు కొమ్ములుండవు. కాని అరుదుగా కొన్ని గొఱ్ఱెలకు కొమ్ములుంటాయి. అలాంటి ఒక గొఱ్ఱెను చిత్రంలో చూడ వచ్చు. వీటిని గొల్లలు ఎక్కువగా పెంచుతారు.
Remove ads
బలి పశువు
ఆహారం కోసము, మొక్కుల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ప్రతిరోజూ వేల పొట్టేళ్లు బలి అవుతున్నాయి. సహజంగా కోడి, మేక, గొర్రె, పొట్టెల్లను అమ్మవారి గుడి ముందు మొక్కు తీర్చుకోవటానికి బలి ఇస్తారు.
సంకరజాతి పొట్టేళ్లు
ప్రపంచం లోనే మొదటిసారిగా డాలీ అనే పొట్టేలను జన్యు పరివర్తన పద్ధతిద్వారా శాస్త్రవేత్తలు సృష్టించారు. డాలి అనే పేరు గల గొర్రె పిల్లను, క్లోనింగ్ అనే పద్ధతి ద్వారా పెద్ద గొఱ్ఱె నుంచి తీసిన జీవకణం ద్వారా 5 జూలై 1996 నాడు పుట్టించారు.
పొట్టేలు మాంసంతో చేసే వంటకాలు
- మటన్ బిరియానీ
- దమ్ బిరిమానీ
- కబాబ్స్ (అచ్చ తెలుగులో వట్టి చియ్యలు అని కూడా అంటారు)
- మటన్ మొగలాయి
- పత్థర్ కా గోష్త్
గొఱ్ఱెలకు సంబందించిన సామెతలు

- గొల్లవాడు గొఱ్ఱెపిల్లను చంకలో పెట్టుకొని ఊరంతా వెతికాడట
- వాడిదంతా గొఱ్ఱె దాటు వ్యవహారం
- కఱ్ఱ లేని వాడిని గొఱ్ఱె అయినా కరుస్తుంది.
- గొఱ్ఱె తోక బెత్తెడే
- జీతం భత్యం లేకుండా ..... తోడేలు గొఱ్ఱెలను కాస్తానన్నదట.
- గొఱ్ఱెల గోత్రాలు గొల్ల వాని కెరుక.
- గొఱ్ఱె కసాయి వాడినే నమ్ముతుంది.

వ్యాధులు
వర్షాకాలంలో నోటి, కాలి వ్యాధి (గాలికుంటు వ్యాధి) వస్తుంది. వ్యాధి సోకితేనోట్లో పుండ్లు కావడం, పొదుగుల వద్ద, కాలి గిట్టలకు కురుపుల్లా వచ్చి తీవ్రంగా ఇబ్బంది పెడతాయి.[1][2]
ఇవి కూడా చూడండి
- పొట్టేలు పున్నమ్మ, తెలుగు సినిమా
చిత్రమాలిక
- గొర్రెల మంద. నాగార్జున సాగర్ రోడ్డులో తీసిన చిత్రము
- భారతదేశంలో ఒక పొట్టేలు
- కొమ్ములున్న గొర్రె
- పొట్టేలు
యితర లింకులు
Wikispecies has information related to: Ovis aries
Look up sheep in Wiktionary, the free dictionary.
వికీమీడియా కామన్స్‌లో Ovis ariesకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
వికీమీడియా కామన్స్‌లో Sheepకి సంబంధించి దస్త్రాలు ఉన్నాయి.
- American Sheep Industry
- Sheep Industry (Queensland)
- Canadian Sheep Federation
- National Sheep Association (UK)
- New Zealand Sheepbreeders Association
- Sheep magazine, all articles available free online
- View the sheep genome[permanent dead link] in Ensembl
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads