చంద్రమోహన్

సినీ నటుడు From Wikipedia, the free encyclopedia

చంద్రమోహన్
Remove ads

చంద్రమోహన్ (1942 మే 23 - 2023 నవంబరు 11) గా ప్రసిద్ధులైన మల్లంపల్లి చంద్రశేఖర రావు తెలుగు సినిమా రంగంలో ఎన్నో విలక్షణమైన పాత్రలు పోషించిన నటుడు. కథానాయకుడిగా 175 పైగా, మొత్తం 932 సినిమాల్లో నటించారు.[2] 1966లో రంగులరాట్నం చిత్రంతో ఇతని సినీ ప్రస్థానం ఆరంభమైంది. అప్పటి నుండి సహనాయకుడిగా, కథనాయకుడుగా, హాస్యనటునిగా, క్యారెక్టర్ యాక్టర్‌గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. ప్రధానంగా కామెడీ పాత్రల ద్వారా చంద్రమోహన్ ప్రేక్షకులకు చిరకాలం గుర్తుంటారు

త్వరిత వాస్తవాలు చంద్రమోహన్, జననం ...

క్రొత్త హీరోయన్‌లకు లక్కీ హీరోగా చంద్రమోహన్‌ను పేర్కొంటారు. సిరిసిరిమువ్వలో జయప్రద, పదహారేళ్ళ వయసులో శ్రీదేవి తమ నటజీవితం ప్రాంభంలో చంద్రమోహన్‌తో నటించి తరువాత తారాపథంలో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.చంద్రమోహన్ చివరి సినిమా 2017లో వచ్చిన ఆక్సిజన్ (సినిమా)లో నటించాడు.

Remove ads

జీవిత సంగ్రహం

చంద్రమోహన్ కృష్ణా జిల్లాకు చెందిన పమిడిముక్కల గ్రామంలో 1942, మే 23న మల్లంపల్లి వీరభద్రశాస్త్రి, శాంభవి దంపతులకు జన్మించారు.[3] ఇతని అసలు పేరు మల్లంపల్లి చంద్రశేఖర్ రావు. ఈయన వ్యవసాయ కళాశాల, బాపట్లలో బి.యస్.సి. పూర్తిచేసి, కొంతకాలం ఏలూరులో పనిచేశాడు. సినిమాలలో నటించాలనే ఉత్సాహంతో మద్రాసు చేరి ప్రయత్నించారు. హీరోగా రంగులరాట్నం (1966) చిత్రంతో మొదలుపెట్టి, హాస్య నటుడిగా మారి తర్వాత కాలంలో కారెక్టర్ నటుడిగా చిత్రసీమలో స్థిరపడ్డారు.

చంద్రమోహన్ నటించిన కొన్ని చిత్రాలు సుఖదుఃఖాలు, పదహారేళ్ళ వయసు, సిరిసిరిమువ్వ, సీతామాలక్ష్మి మొదలైనవి హిట్ కొట్టాయి. ఆ కాలంలో వీరితో ఎందరో కథానాయికగా నటించి అగ్రస్థానాన్ని చేరుకున్నారు. శ్రీదేవి, మంజుల, రాధిక, జయప్రద, జయసుధ, ప్రభ, విజయశాంతి, తాళ్ళూరి రామేశ్వరి మొదలైన వారు ఈ కోవకు చెందినవారు.

ఈయన భార్య జలంధర, రచయిత్రి. కొన్ని కథా సంకలనాలను వెలువరించింది.

Remove ads

పురస్కారములు

  • 1978 - పదహారేళ్ల వయసు సినిమా కోసం ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారం పొందారు.
  • 2005 - అతనొక్కడే సినిమా కోసం ఉత్తమ కారెక్టర్ నటుడిగా నంది పురస్కారం పొందారు.
  • 2021 - తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గుర్తింపు - మొట్టమొదటి సరిగా 14 దేశాల నుండి రచయుతలు 108 చంద్ర మోహన్ గారు నటించిన చిత్రా విశ్లేషణ.

నటించిన సినిమాలు

మరణం

చంద్రమోహన్ అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 నవంబరు 11న దీపావళి పండుగకు ఒకరోజు ముందు మరణించారు.[5][6][7][8]

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads