జయప్రద
సినీ నటి, రాజకీయ నాయకురాలు From Wikipedia, the free encyclopedia
Remove ads
తెలుగు సినీరంగంలో జయప్రద లేదా జయప్రద నహతాగా పరిచితురాలైన లలితారాణి నటి, పార్లమెంటు సభ్యురాలు. జయప్రద 1962 ఏప్రిల్ 3న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజమండ్రిలో ఒక మధ్యతరగతి కుటుంబంలో కృష్ణ, నీలవేణి దంపతులకు జన్మించింది.[1]
Remove ads
సినీ ప్రవేశం
జయప్రదకు బాల్యంలో డాక్టరు అవ్వాలని కోరిక ఉండేది. ఈమె తల్లి ఈమెను ఏడవఏటి నుండే నాట్య సంగీత శిక్షణకు పంపింది. తన తండ్రి, బాబాయిలు సినిమా పెట్టుబడిదారులైనప్పటికీ ఈమెకు సినీరంగ ప్రవేశం వారి ద్వారా లభించలేదు. 14 ఏళ్ల వయసులో పాఠశాలలో ఒక నాట్య ప్రదర్శన చేస్తుండగా సినీ నటుడు ఎం. ప్రభాకరరెడ్డి ఈమెను చూసి జయప్రద అని నామకరణం చేసి 1976లో విడుదలైన భూమి కోసం సినిమాలో మూడు నిమిషాలు నిడివికల ఒక పాట ద్వారా ఈమెను చిత్రసీమకు పరిచయం చేశాడు. అలా మొదలైన ఈమె సినీ ప్రస్థానం 2005 వరకు మూడు దశాబ్దాలలో ఆరు భాషలలో (తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ, బెంగాలి) 300కు పైగా సినిమాలలో నటించింది.
పాఠశాల తర్వాత ఈమె రాజమండ్రిలోని రాజలక్ష్మి మహిళా కళాశాలలో చదివింది. ఈమె 1986 జూన్ 22న సినీనిర్మాత శ్రీకాంత్ నహతాను వివాహమాడింది.
Remove ads
రాజకీయ ప్రవేశం
నందమూరి తారక రామారావు ఆహ్వానంతో 1994 అక్టోబర్ 10 న తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయరంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత ఈమె చంద్రబాబు నాయుడు పక్షంలో చేరి తెలుగు దేశం పార్టీ మహిళా విభాగానికి అధ్యక్షురాలైంది. 1996 ఏప్రిల్‌లో తెలుగుదేశం పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైంది. ఆ తరువాత పార్టీ నాయకులతో వచ్చిన గొడవల వలన తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసి, జయప్రద ములాయం సింగ్ యాదవ్ సమాజ్‌వాదీ పార్టీలో చేరి ఆంధ్ర నా జన్మ భూమి కానీ ఉత్తర ప్రదేశ్ నా కర్మభూమి అన్న నినాదంతో ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ నియోజవర్గం నుండి 2004 మే 13న లోక్‌సభకు ఎన్నికైంది.
Remove ads
జయప్రద నటించిన తెలుగు చిత్రాలు
|
ఇవి కూడ చూడండి
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads