చెరుకూరి సుమన్

From Wikipedia, the free encyclopedia

చెరుకూరి సుమన్
Remove ads

ఈనాడు గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు రెండవ కుమారుడు చెరుకూరి సుమన్ (1966 - 2012) బుల్లితెర రచయితగా, నటుడిగా, దర్శకుడిగా, చిత్రలేఖకుడిగా, ఉషాపరిణయం చిత్ర నటుడిగా తెలుగువారికి సుపరిచితుడు. సుమన్ (మంచిమనసు) తన పేరుకు తగ్గట్టే జీవిత చరమాంకంలో కూడా తన ప్రతిభను కనపరస్తూ కళారంగానికి సేవలందిస్తూనే అస్తమించాడు.

త్వరిత వాస్తవాలు చెరుకూరి సుమన్, జననం ...
Remove ads

జీవితసంగ్రహం

సుమన్ 1966 డిసెంబర్ 23వ తేదీన జన్మించాడు. ఆయన ఉషోదయా ఎంటర్‌ప్రైజెస్ మేనేజింగ్ డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆయన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకున్నారు. నిజాం కళాశాలలో బిఎ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిసిజె చేశాడు. మాస్టర్స్ చేసేందుకు అమెరికా వెళ్లాడు. ఈనాడు దినపత్రికలో ఇంటర్న్‌షిప్ తో ప్రారంభమై, సెంట్రల్ డెస్క్‌, సంపాదకీయ పేజీకి వ్యాసాల బాధ్యతలు నిర్వర్తించాడు.

సుమన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా 1995 ఆగస్టు 27వ తేదీన ఈటీవీ ప్రారంభమైంది. అంతరంగాలు, లేడీ డిటెక్టివ్, స్నేహ, ఎండమావులు, కళంకిత వంటి ధారావాహికలకు ఆయన కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, సమకూర్చాడు. కేవలం టీవీ చానెల్ నిర్వహణతో బాటు సృజనాత్మక విభాగాల్లోనూ పనిచేశాడు. భాగవత గాథ ఆధారంగా నిర్మించిన ఉషా పరిణయం చిత్రంలో సుమన్ శ్రీకృష్ణుడిగా నటించిటమే కాక దర్శకత్వం వహించాడు. ఆ తర్వాత పూర్తిస్ఝాయి వినోదాత్మక చిత్రం నాన్ స్టాప్ లో కధానాయకుడిగా నటించటం, నిర్మాణ, దర్శకత్వం చేశాడు.

ఆధ్యాత్మిక భావనలు మెండుగా ఉన్న సుమన్ శ్రీహరి స్వరాలు పేరుతో భక్తి గీతాల ఆల్బమ్ రూపొందించాడు. తన గీతాలకు బాణీకూడా కట్టుకున్నాడు .

నాలుగైదేళ్లుగా ఆయన అస్వస్థతతో బాధపడి హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 6, 2012 తేదీన పరమపదించాడు.[1] ఆయనకు ఒక కూతురు, ఒక కుమారుడు ఉన్నారు. భార్య విజయేశ్వరి రామోజీ గ్రూపు సంస్థల్లో భాగమైన డాల్ఫిన్ హోటల్స్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నది.

Remove ads

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads