ఛత్తీస్‌గఢ్

భారతీయ రాష్ట్రం From Wikipedia, the free encyclopedia

ఛత్తీస్‌గఢ్
Remove ads

ఛత్తీస్‌గఢ్ (छत्तीसगढ़), మధ్య భారతదేశం లోని ఒక రాష్ట్రం. ఇది 2000 నవంబరు 1న మధ్య ప్రదేశ్ లోని 16 ఆగ్నేయ జిల్లాలతో యేర్పాటు చేయబడింది. రాయ్‌పుర్ రాష్ట్రానికి రాజధాని. ఛత్తీస్‌గఢ్‌కు వాయవ్యమున మధ్య ప్రదేశ్, పడమట మహారాష్ట్ర, దక్షిణాన తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, తూర్పున ఒడిషా, ఈశాన్యాన జార్ఖండ్, ఉత్తరాన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రములు సరిహద్దులుగా వున్నందున ఎక్కువ రాష్ట్రాలతో సరిహద్దులను కలిగిన రాష్ట్రం అని పేరు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా సరిహద్దులు కలిగి ఉంది. అదే తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో ఛత్తీస్గఢ్లోని సుకుమా జిల్లా, తెలంగాణలోని ములుగు జిల్లాతో ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలతో సరిహద్దులను పంచుకుంటున్నాయి‌.

త్వరిత వాస్తవాలు Chhattisgarh, Country ...

రాష్ట్రం యొక్క ఉత్తర భాగము ఇండో-గాంజెటిక్ మైదానం అంచులలో ఉంది. గంగా నది ఉపనది అయిన రిహంద్ నది ఈ ప్రాంతములో పారుతుంది. సాత్పూరా శ్రేణులు తూర్పు అంచులు, ఛోటానాగ్‌పూర్ పీఠభూమి పడమటి అంచులు కలిసి తూర్పు నుండి పడమటికి వ్యాపించే పర్వతాలతో మహానది పరీవాహక ప్రాంతం నుండి ఇండో-గాంజెటిక్ మైదానమును వేరుచేస్తున్నాయి. రాష్ట్ర మధ్య భాగం సారవంతమైన మహానది, దాని ఉపనదుల మైదానములలో ఉంది. ఇక్కడ విస్తృతముగా వరి సాగు చేస్తారు. రాష్ట్ర దక్షిణ భాగం దక్కన్ పీఠభూమిలో గోదావరి, దాని ఉపనది ఇంద్రావతి పరీవాహక ప్రాంతములో ఉంది. రాష్ట్రం లోని మొత్తం 40% శాతం భూమి అటవీమయం.

ఇండో-ఆర్యన్ భాషా కుటుంబం తూర్పు-మధ్య శాఖకు చెందిన ఛత్తీస్‌గఢీ భాష ఈ ప్రాంతం ప్రధాన భాష. రాష్ట్రములో పర్వతమయమైన జిల్లాలు ద్రావిడ భాష గోండీ మాట్లాడే గోండులకు ఆలవాలం.బస్తర్ ప్రాంతంలో అధిక మొత్తంలో ఈ భాషనే మాట్లడుతారు దీంతో పాటు హిందీ, ఒరియా, మరాఠి, తెలుగు, ఆదివాసీ భాషలు మాట్లాడేవారు కూడా ఉన్నారు.

Remove ads

పేరు వెనుక చరిత్ర

చత్తీష్ అనగా 36. అలాగే గడ్ అనగా కోటలు అని అర్థం. 36 కోటలు ఉన్న రాష్ట్రం అని అర్థం. చత్తిస్గడ్ రాజధాని రాయిపూర్ నగరాన్ని రాయ్ జగత్ అనే గోండ్ రాజు స్థాపించాడు . గోండ్ రాజులు నిర్మించిన 36 కోటల వలనే ఈ రాష్ట్రానికి ఛత్తీస్గడ్ అనే పేరు వచ్చింది

ప్రభుత్వం

రాష్ట్రం ఏర్పడినప్పటినుండి అనగా 2000 సంవత్సరం నుంచి 2018 వరకు బిజెపి పార్టీకి చెందిన రమణ్ సింగ్ నేతృత్వంలో ప్రభుత్వం నడిచింది. తొలిసారిగా 2018 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ బుఖేష్ భగేల్ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.

రాష్ట్ర గణాంకాలు

  • రాష్ట్ర అవతరణ:2000 నవంబరు 1
  • వైశాల్యం:1,36,034 చ.కి.
  • జనసంఖ్య: 25,540,196 అందులో స్త్రీలు 12,712,281, పురుషులు 12,827,915 లింగ నిష్పత్తి .991
  • జిల్లాల సంఖ్య:27
  • గ్రామాలు:19,744 పట్టణాలు.97
  • ప్రధాన భాష :చత్తీస్ గరి, గోండి, హింది, ప్రధాన మతం. హిందూ
  • పార్లమెంటు సభ్యుల సంఖ్య:11 శాసన సభ్యుల సంఖ్య. 90
  • మూలం: మనోరమ ఇయర్ బుక్

దేవాలయాలు

చిత్రమాలిక

Remove ads

రాష్ట్రం లోని జిల్లాలు

ఛత్తీస్‌గఢ్‌లో 33 జిల్లాలు ఉన్నాయి.[14][15][16][17][18][19][20][21]

మరింత సమాచారం వ.సంఖ్య, కోడ్ ...

వీటిలో బీజాపూర్, నారాయణ్ పూర్ లను 2007 మే 2 న రాష్ట్ర ప్రభుత్వం చే పరిపాలనా సౌలభ్యానికై విభజించబడ్డాయి.

Remove ads

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads