జాజ్‌పూర్

ఒడిశా రాష్ట్రం జాజ్‌పూర్ జిల్లా ముఖ్యపట్టణం From Wikipedia, the free encyclopedia

జాజ్‌పూర్map
Remove ads

జాజ్‌పూర్ ఒడిశా రాష్ట్రం, జాజ్‌పూర్ జిల్లాలోని పట్టణం. ఇది కేసరి రాజవంశం యొక్క రాజధానిగా ఉండేది. ఆ తరువాత దీని స్థానంలో కటక్, రాజధాని అయింది.[1][2] ఇది జాజ్‌పూర్ జిల్లాకు ముఖ్యపట్టణం. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం పాణికోయిలిలో ఉంది. పట్టణ పరిపాలనను పురపాకల సంఘం నిర్వహిస్తుంది.

త్వరిత వాస్తవాలు జాజ్‌పూర్, దేశం ...
Remove ads

చరిత్ర

జాజ్‌పూర్, పురాతన బిరాజా ఆలయం ఉన్న ప్రదేశం, దీనిని మొదట బిరాజా అని పిలిచేవారు. పురాతన గ్రంథాలలో ఈ పట్టణానికి విరంజ, వరంజ-నగర, వరాహ-తీర్థ అనే పేర్లు ఉండేవి. [3] భౌమ-కార రాజులు తమ రాజధానిగా గుహదేవపతాక (లేదా గుహేశ్వరపతాక) ను స్థాపించారు. ఇదే ఇప్పటి జాజ్‌పూర్ సమీపంలోని గోహిరతికార్ (లేదా గోహిరతిక్ర) అని గుర్తించారు. [4] తరువాతి సోమవంశీ రాజులు తమ రాజధానిని యయాతినగర (నేటి బింక) నుండి గుహేశ్వరపతాకకు మార్చారు. పట్టణానికి అభినవ-యయాతినగర అని పేరు పెట్టారు. [3]

తరువాత, జాజ్పూర్ [5] పట్టణం యజనగర అని పిలువబడింది. ఒక సిద్ధాంతం ప్రకారం, ఈ పేరు "యయాతినగర" నుండి వచ్చింది. మరొక సిద్ధాంతం ఏమిటంటే, ఇది గంగా - గజపతి కాలంలో (11వ-16వ శతాబ్దం) ప్రాచుర్యం పొందిన యజ్ఞాల నుండి ఉద్భవించింది. [6] తబకత్ -ఇ-నసిరి, తారిఖ్-ఇ-ఫిరుజ్షాహి వంటి ముస్లిం చరిత్రలలో, ఈ పట్టణం పేరును "జజ్‌నగర్"గా పేర్కొన్నారు. తరువాత, " -నగర్ " ("పట్టణం") ప్రత్యయం స్థానంలో " -పూర్ " చేరి, పేరు "జాజ్‌పూర్"గా మారింది. [3]

Remove ads

భౌగోళికం, శీతోష్ణస్థితి

త్వరిత వాస్తవాలు జాజ్‌పూర్, Climate chart (explanation) ...
మరింత సమాచారం శీతోష్ణస్థితి డేటా - Jajpur, నెల ...
Remove ads

జనాభా వివరాలు

2011 భారత జనాభా లెక్కల ప్రకారం, జాజ్‌పూర్ పట్టణ జనాభా 37,458. అందులో 19,216 మంది పురుషులు, 18,242 మంది మహిళలు. 6 సంవత్సరాల లోపు పిల్లలు 3,823. జాజ్‌పూర్‌లో అక్షరాస్యుల సంఖ్య 29,975, ఇది జనాభాలో 80.0%, పురుషులలో అక్షరాస్యత 83.5% కాగా, స్త్రీలలో ఇది 76.4%. ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 89.1%, ఇందులో పురుషుల అక్షరాస్యత రేటు 92.9%, స్త్రీల అక్షరాస్యత రేటు 85.1%. షెడ్యూల్డ్ కులాల జనాభా 6,363 షెడ్యూల్డ్ తెగల జనాభా 565. 2011లో జాజ్‌పూర్‌లో 8198 గృహాలు ఉన్నాయి [1]

విద్య

పట్టణం లోని కళాశాలలు

  • NC అటానమస్ కాలేజ్, జాజ్‌పూర్ టౌన్
  • SG కళాశాల, కనికపడ, జాజ్‌పూర్
  • VN అటానమస్ కాలేజ్, జాజ్‌పూర్ రోడ్

దేవాలయాలు

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads