తాడిపత్రి

ఆంధ్రప్రదేశ్, అనంతపురం జిల్లా, తాడిపత్రి మండల పట్టణం From Wikipedia, the free encyclopedia

Remove ads

తాడిపత్రి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాకు చెందిన ఒక పట్టణం, ఇది తాడిపత్రి మండలానికి కేంద్రం. ఇది పురపాలకసంఘం హోదా కలిగి పట్టణం.

త్వరిత వాస్తవాలు తాడిపత్రి, దేశం ...
Remove ads

చరిత్ర

విజయనగర సామ్రాజ్యములో మొదట టెంకణ దేశముగాను తర్వాత పెన్నబడి సీమ, గండికోటసీమ గాను పిలువబడిన తాడిపత్రి ప్రాంతం, విజయనగర సామ్రాజ్యంలో అంతర్భాగం. మొదట తాటిపల్లి తర్వాత తాటిపర్తిగాను, ప్రస్తుతం తాడిపత్రి గాను వ్యవహరించబడుతూ ఉంది. దీనికి వేదకాలంలో భాస్కర క్షేత్రం అనే పేరు కూడావుంది. పూర్వం ఈ ప్రాంతంలో తాటిచెట్లు ఎక్కువగా వున్నందున తాటిపల్లి అనేపేరు వచ్చిందని, తాటకి అనే రాక్షసిని శ్రీరాముడు సంహరించినందున వల్ల ఆ పేరువచ్చిందని కూడా అంటారు. సా.శ. 1350 ప్రాంతంలోక్ళష్ణా తీరవాసియైన నారాయణ భట్టు అను బ్రాహ్మణుడు విద్యారణ్య స్వాముల వారి ఆదేశంతో ఇక్కడ నివాసం ఏర్పరుచుకొని ఈప్రాంతాన్ని అభివ్ళద్ది చేసాడని చెపుతారు. తాడిపత్రిలో శ్రీ బుగ్గ రామలింగేశ్వరాలయం, శ్రీ చింతల వెంకటరమణస్వామి ఆలయాలు సా.శ. 1460-1525 మధ్యలో నిర్మించబడ్డాయి. వీటిలో బుగ్గ రామలింగేశ్వర ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యంలో తాడిపత్రి ప్రాంత మండలేశ్వరుడైన పెమ్మసాని రామలింగనాయడు, చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని అతని కుమారుడైన తిమ్మానాయనిచే నిర్మాణమైనట్లు తాడిపత్రి కైఫీయత్ ద్వారా తెలుస్తుంది. ఈ రెండు దేవాలయాలు అద్భుత శిల్ప సంపదతోఅలరారుతున్నాయి. ఇక్కడికి సమీపంలో ఆలూరుకోనలో పురాతన ప్రాశస్తి కలిగిన రంగనాధఆలయం, ఓబుళేసు కోనఆలయాలు గలవు.

Remove ads

భౌగోళికం

అనంతపురం నుంచి ఈశాన్య దిశలో 55 కి.మీ ఉంది.

జనగణన వివరాలు

2011 జనగణన ప్రకారం పట్టణ మొత్తం జనాభా 1,08,171.

పరిపాలన

తాడిపత్రి పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.

రవాణా సౌకర్యాలు

ఇది జాతీయ రహదారి 544D పై ఉంది. ఇది చెన్నై - ముంబై రైలు మార్గంలో కడప, గుంతకల్ జంక్షన్ ల మధ్యన ఉంది.

పరిశ్రమలు

పట్టణం పరిసర ప్రాంతాలలో సుమారు 600 గ్రానైట్ ప్రోసెసింగ్ పరిశ్రమలు, నల్ల రాతి పొలిష్ పరిశ్రమలు 1000 దాకా ఉన్నాయి. ఇక్కడ పెన్నా సిమెంట్, అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలు మరియు స్టీల్ ప్లాంట్ గలవు. వివిధ రకములైన ప్రాసెసింగ్ యూనిట్లు కలవు

పర్యాటక ఆకర్షణలు

ఇక్కడికి దాదాపు 25 కిలోమీటర్ల దూరములో ప్రఖ్యాతి గాంచిన బెలుం గుహలు ఉన్నాయి. 10 కి.మీ. దూరంలో, హాజీవలీ దర్గా,15కి.మీ.దూరంలో పప్పూరు గ్రామంలో శ్రీ అశ్వర్ద నారాయణ స్వామి, భీమలింగేశ్వర ఆలయాలు ప్రసిద్ధి చెందాయి.

ప్రముఖులు

Thumb
తెలుగు నాటకరంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది బళ్ళారి రాఘవ చిత్రం
  • బళ్ళారి రాఘవ:బళ్ళారి రాఘవ తెలుగు నాటకరంగ ప్రముఖులు. ప్రముఖ న్యాయవాది.ఇతను 1880 ఆగస్టు 2న తాడిపత్రిలో జన్మించాడు.[2] అతని పూర్తిపేరు తాడిపత్రి రాఘవాచార్యులు. తండ్రి నరసింహాచారి, తల్లి శేషమ్మ.
  • కే వి రెడ్డి:కె.వి.రెడ్డి చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో తాడిపత్రిలో తన మేనమామల వద్ద పెరిగాడు.
  • జె.సి దివాకరరెడ్డి - మాజీ మంత్రి

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads