తామర పువ్వు

ఆసియాకు చెందిన జలసస్యం From Wikipedia, the free encyclopedia

తామర పువ్వు
Remove ads

తామర పువ్వు (లేదా పద్మము) (ఆంగ్ల భాషలోLotus flower) చాలా అందమైనది. తామర పువ్వు మొక్కల ఆకులు గుండ్రంగా, ఆకుల కాడలపై చిన్న చిన్న ముళ్ళు కలిగియుంటుంది. తామర పువ్వు ఆకుల పైభాగం నీటితో తడవకపోవడం విశేషం. తామర పువ్వు మొక్కలు ముఖ్యంగా కోస్తా తీర గ్రామాల్లో ఉండే మంచినీటి చెరువుల్లో కనిపిస్తాయి. వీటి ఆకులు కటికవాళ్ళు మాంసం ప్యాక్ చేయడానికి వాడతారు. తామర పువ్వుల్లో తెలుపు, లేత గులాబీ రంగు రకాలున్నాయి. ముద్ద లేత గులాబీ రంగు తామర పువ్వు భారత దేశ జాతీయ పుష్పం.

త్వరిత వాస్తవాలు Nelumbo nucifera, Scientific classification ...
Remove ads

లక్షణాలు

  • భూగర్భ కొమ్ముగల బహువార్షిక గుల్మం.
  • ఇంచుమించు గుండ్రంగా ఉన్న సరళ పత్రాలు.
  • ఏకాంతంగా పొడుగాటి వృంతాలతో ఏర్పడిన తెల్లని లేదా లేత గులాబీ రంగు పుష్పాలు.
  • గుండ్రటి పుష్పాసనంలో అమరియున్న అసంయుక్త ఫలదళాలు.

ఉపయోగాలు

  • తామర పువ్వులు సువాసన కలిగి అందముగా ఉండడం వలన పుష్పపూజలలో ఉపయోగిస్తారు.
  • దీని పుష్పాలు, కేసరములు, కాడలు అతిసార వ్యాధికి, కామెర్లకు, గుండె జబ్బుల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • దీని పువ్వుల రసము దగ్గు నివారణకు, మూలవ్యాధి, రక్తస్రావము తగ్గించుటకు వాడెదరు.
  • ఆయుర్వేద వైద్యంలో చర్మ వ్యాధులకు, కుష్ఠువ్యాధి నివారణకు ఉపయోగిస్తారు

-ఇతర విశేషాలు

  • తామర పువ్వును (ఆంగ్లం లో : Lotus )అని పిలుస్తారు. చాలా మందికి తామర పువ్వుకు, కలువ పువ్వు కు ఉన్న తేడాలు తెలియవు. కలువ పువ్వు నింఫియా కుంటుంబానికి చెందినది. కలువ పువ్వు ఆకుల కు మధ్యలో కట్ ఉండి తేలిగ్గా నీటిలో తడుస్తాయి, కాడలు సున్నితంగా ఉంటాయి. కలువ పువ్వులు వందలాది రంగుల్లో లభిస్తాయి. కలువు పువ్వు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రీయ పుష్పం. తామర విత్తనములను కూరల్లో పూల్ మఖానా (Pool Makhana) అనే పేరుతో వాడతారు.

చిత్రమాలిక

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads