దక్షిణాసియా
From Wikipedia, the free encyclopedia
Remove ads
ఆసియా ఖండంలో దక్షిణంగా ఉన్న ప్రాంతాన్ని దక్షిణాసియా అంటారు.ఆఫ్ఘనిస్తాన్, భారతదేశం, పాకిస్తాన్, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవులు దేశాలు దక్షిణాసియా పరిధిలోకి వస్తాయి [5][note 2] ఈ 8 దేశాలు తమ మధ్య ఆర్థిక స్నేహ సంబంధాలు మెరుగు పరుచుకొనేందుకు దక్షిణాసియా ప్రాంతీయ సహకార మండలి (సార్క్) అనే మండలిని ఏర్పరుచుకున్నాయి. దీని ప్రధాన కార్యాలయం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉంది
దక్షిణాసియా విస్తీర్ణం 52 లక్షల చ.కి.మీ. ఇది ఆసియా ఖండంలో 11.71%. ప్రపంచ భూ ఉపరితల వైశాల్యంలో 3.5%.[5] దక్షిణాసియా జనాభా 189.1 కోట్లు. ఇది ప్రపంచ జనాభాలో నాలుగవ వంతు. ప్రపంచంలో అత్యధిక జనాభా, అత్యధిక జనసాంద్రత కలిగిన భౌగోళిక ప్రాంతం.[7] మొత్తమ్మీద, ఇది ఆసియా జనాభాలో సుమారు 39.49%, ప్రపంచ జనాభాలో 24% కంటే ఎక్కువ.[8][9][10]
2010 నాటి లెక్కల ప్రకారం, ప్రపంచంలోనే అత్యధిక హిందువులు, ముస్లింలు, సిక్కులు, జైనులు, జొరాస్ట్రియన్లు దక్షిణాసియా లోనే ఉన్నారు .[11] ప్రపంచ హిందువుల జనాభాలో 98.47%, ప్రపంచ సిక్కులలో 90.5%, ప్రపంచ ముస్లింలలో 31%, 3.5 కోట్ల క్రైస్తవులు, 2.5 కోట్ల బౌద్ధులూ దక్షిణాసియాలో ఉన్నారు.[12][13][14][15]
Remove ads
భూమి, నీటి విస్తీర్ణం
ఈ జాబితాలో ఆయా దేశాల సార్వభౌమత్వం కింద ఉన్న ప్రాంతాలన్నీ ఉన్నాయి. అంటార్కిటికా లోని ప్రాంతాలు ఇందులో భాగం కాదు. EEZ + TIA అనేది తనకే స్వంతమైన ఆర్థిక మండలం (EEZ), మొత్తం అంతర్గత ప్రాంతం (TIA). ఇందులో భూ విస్తీర్ణం, దాని లోని అంతర్గత జలాలూ కలిసి ఉన్నాయి.
Remove ads
సమాజం
భాషలు

దక్షిణాసియాలో అనేక భాషలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో మాట్లాడే భాషలు ఎక్కువగా భౌగోళిక స్థానాలపై ఆధారపడి ఉంటాయి. ఇవి మతాతీతంగా ఉంటాయి. కాని లిపి మాత్రం మతపరమైన విభజనలకు లోబడి ఉంటుంది.. ముఖ్యంగా, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ వంటి దక్షిణాసియాలోని ముస్లింలు అరబిక్ వర్ణమాలను, పెర్షియన్ నాస్తలీఖ్ను ఉపయోగిస్తారు. 1952 వరకు, ముస్లిం-మెజారిటీ బంగ్లాదేశ్ (అప్పటికి తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవారు) కూడా నస్తలీఖ్ లిపిని తప్పనిసరి చేసింది. కాని ఆ తరువాత, అప్పటి తూర్పు పాకిస్తాన్ అధికారిక భాషగా బెంగాలీని స్వీకరించాలని కోరుతూ జరిగిన భాషా ఉద్యమం తరువాత బెంగాలీని స్వీకరించింది. దక్షిణాసియాలోని ముస్లిమేతరులు, భారతదేశంలోని కొంతమంది ముస్లింలు తమ సాంప్రదాయ పురాతన వారసత్వ లిపిలను వాడుతారు. ఇండో-యూరోపియన్ భాషలకైతే బ్రాహ్మి లిపి నుండి వచ్చినవాటిని, ద్రావిడ భాషలకు ఇతరులకూ అయితే బ్రాహ్మియేతర లిపిలనూ ఉపయోగిస్తున్నారు .[16]
సాంప్రదాయికంగా నాగరి దక్షిణాసియాలో ప్రధానమైన లిపి.[17] దేవనాగరి లిపి 120 కి పైగా దక్షిణాసియా భాషలకు ఉపయోగిస్తున్నారు.[18] వీటిలో హిందీ, [19] మరాఠీ, నేపాలీ, పాలి, కొంకణి, బోడో, సింధి, మైథిలి, ఇతర భాషలు, మాండలికాలూ ఉన్నాయి. ఆ విధంగా ఇది ఎక్కువగా వాడే లిపిలలో ఒకటి.[20] శాస్త్రీయ సంస్కృత గ్రంథాలకు కూడా దేవనాగరి లిపిని ఉపయోగిస్తారు.[18]
ఈ ప్రాంతంలో అత్యధికంగా మాట్లాడే భాష హిందీ, తరువాత బెంగాలీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ, పంజాబీ ఉన్నాయి.[16] ఆధునిక యుగంలో, ఉత్తర దక్షిణాసియాలోని ముస్లిం సమాజం (ముఖ్యంగా పాకిస్తాన్, భారతదేశంలోని ఉత్తర రాష్ట్రాలు) ఉపయోగించే ఉర్దూ వంటి కొత్త సమకాలీకరణ భాషలు అభివృద్ధి చెందాయి.[21] పంజాబీ భాషను ఇస్లాం, హిందూ, సిక్కు మతస్థులు ముగ్గురూ మాట్లాడుతారు..మాట్లాడే భాష సారూప్యంగా ఉంటుంది గానీ లిపిలు మాత్రం మూడు రకాలుగా ఉన్నాయి. సిక్కులు గుర్ముఖి వర్ణమాలను ఉపయోగిస్తారు, పాకిస్తాన్లోని ముస్లిం పంజాబీలు నస్తలీఖ్ లిపిని ఉపయోగిస్తుండగా, భారతదేశంలోని హిందూ పంజాబీలు గుర్ముఖి లేదా నాగర లిపిని ఉపయోగిస్తారు. గురుముఖి, నాగరి లిపిలు విభిన్నమైనవే గానీ నిర్మాణంలో అవి దగ్గరగా ఉంటాయి. కానీ పెర్షియన్ నస్తలీఖ్ లిపి చాలా భిన్నంగా ఉంటుంది.[22]
బ్రిటిషు ఇంగ్లీషును పట్టణ ప్రాంతాల్లో ఉపయోగిస్తారు. ఇది దక్షిణాసియాలోని ప్రధాన ఆర్థిక భాష .[23]
మతాలు

2010 నాటి లెక్కల ప్రకారం దక్షిణాసియాలో హిందువులు, జైనులు, సిక్కుల జనాభా ప్రపంచంలోనే అత్యధికం.[14] సుమారు 51 కోట్ల మంది ముస్లింలు, [14] 2.5 కోట్ల మంది బౌద్ధులు, 3.5 కోట్ల క్రైస్తవులూ ఉన్నారు.[24] 90 కోట్లతో హిందువులు, దక్షిణాసియా మొత్తం జనాభాలో 68 శాతం ఉన్నారు.[25] హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు, క్రైస్తవులు భారతదేశం, నేపాల్, శ్రీలంక, భూటాన్లలో కేంద్రీకృతమై ఉండగా, ముస్లింలు ఆఫ్ఘనిస్తాన్ (99%), బంగ్లాదేశ్ (90%), పాకిస్తాన్ (96%), మాల్దీవుల్లో (100%) ఎక్కువ శాతంలో ఉన్నారు.[26]
భారతదేశంలో ఉద్భవించిన మతాలు హిందూ మతం, జైన మతం, బౌద్ధమతం, సిక్కు మతం. ఇవి భారతీయ మతాలు [27] భారతీయ మతాలు విభిన్నమైనవి, అయితే పరిభాష, భావనలు, లక్ష్యాలు, ఆలోచనల్లో సారూప్యత ఉంటుంది. ఈ మతాలు దక్షిణాసియా నుండి తూర్పు ఆసియా, ఆగ్నేయాసియాల్లో వ్యాపించాయి.[27] క్రైస్తవం, ఇస్లాంలను వ్యాపారులు దక్షిణాసియాలోని తీర ప్రాంతాలలో ప్రవేశపెట్టారు. తరువాత సింధ్, బలూచిస్తాన్, పంజాబ్ లోని కొన్ని ప్రాంతాలపై అరబ్ కాలిఫేట్‌లతో పాటు పర్షియా మధ్య ఆసియా నుండి వచ్చిన ముస్లింల ప్రవాహాలు విజయం సాధించాయి. దీని ఫలితంగా షియా, సున్నీ ఇస్లాంలు రెండూ దక్షిణాసియాలోని వాయవ్య ప్రాంతాలలో వ్యాపించాయి. తదనంతరం, ఇస్లామిక్ సుల్తానేట్లు, మొఘల్ సామ్రాజ్యపు ముస్లిం పాలకుల ప్రభావంతో ఇస్లాం దక్షిణాసియాలో వ్యాపించింది.[28][29] ప్రపంచ ముస్లింలలో మూడింట ఒకవంతు మంది దక్షిణాసియాకు చెందినవారే.[30][31]
Remove ads
నోట్స్
- Among the top 100 urban areas of the world by population.
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads