ముస్లిం
From Wikipedia, the free encyclopedia
Remove ads
ముస్లిం, కొన్నిసార్లు మొస్లెం ,[1] అనీ పలుకుతారు.ముస్లిం అనగా ఇస్లాం మతాన్ని అవలంబించేవాడు. ఇస్లాం మతం ఏకేశ్వరోపాసనను అవలంబించే ఇబ్రాహీం మతం ను ఆధారంగా చేసుకుని ఖురాన్ గ్రంధములో చెప్పబడినటువంటి విషయాలను పాటిస్తూ జీవనం సాగించేవారు. ఖురాన్ ను ముస్లిం అల్లాహ్ (పరమేశ్వరుడు) వాక్కుగా ఇస్లామీయ ప్రవక్త అయిన ముహమ్మద్ ప్రవక్తపై అవతరించిందిగా భావిస్తారు. అలాగే ముహమ్మద్ ప్రవక్త ప్రవచానాలైన హదీసులను సాంప్రదాయిక విషయాలుగాను, కార్యాచరణాలు గాను భావించి ఆచరిస్తారు. .[2] "ముస్లిం" అనునది ఒక అరబ్బీ పదజాలం, దీని అర్థం "తనకు అల్లాహ్ ను సమర్పించువాడు". స్త్రీ అయితే "ముస్లిమాహ్" గా పిలువబడుతుంది.
Remove ads
ముస్లిం కొరకు ఇతర పదాలు
సాధారణంగా వాడే పదం "ముస్లిం". పాత ఒరవడి పదం "మొస్లెం ".[3] దక్షిణాసియా దేశాలలో ముసల్మాన్ (مسلمان) అనే పర్షియన్ వ్యవహారిక నామం సాధారణం.1960 మధ్యకాలంలో ఆంగ్లరచయితలు ముహమ్మడన్స్ లేదా మహమ్మతన్స్ అనే పదాలు వాడేవారు.[4] కానీ ముస్లింలు ఈ పదాలను తప్పుడు అర్థం వచ్చే పదాలుగా భావించారు. ముహమ్మడన్స్ అనగా అల్లాహ్ ను గాక ముహమ్మద్ ను ఆరాధించే వారనే అర్థం స్ఫురిస్తుందని దాని వాడకాన్ని నిరోధించారు.[5]ఆంధ్ర ప్రదేశ్ లో "సాయిబు", "తురక" లేదా "తురుష్కుడు" (టర్కీ కి చెందిన వాడు), "హజ్రత్" అని పిలవడం చూస్తాం.
Remove ads
అర్థం
సూఫీ ఆధ్యాత్మిక గురువైన ఇబ్న్ అరాబి ప్రకారం ముస్లిమ్ అనే పదం విశదీకరణ ఇలా ఉంది
ఇవీ చూడండి
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads