దేవత (1965 సినిమా)
1965 తెలుగు సినిమా From Wikipedia, the free encyclopedia
Remove ads
అయోమయ నివృత్తి పేజీ దేవత చూడండి.
పద్మనాభం సొంత చిత్ర నిర్మాణ సంస్థ రేఖా అండ్ మురళి ఆర్ట్స్ వారి దేవత చిత్రం 1965 జూలై 24 న విడుదల. నందమూరి తారకరామారావు , సావిత్రి, జంటగా నటించిన ఈ చిత్రానికి కె. హేమాంబరదర రావు దర్శకుడు కాగా, సంగీతం ఎస్. పి . కోదండపాణి సమకూర్చారు.
[[వర్గం:1965_{{{language}}}_సినిమాలు]]
Remove ads
నటీనటులు
పాత్రధారులు
- సావిత్రి - సీత, లలిత
- నందమూరి తారక రామారావు - ప్రసాద్
- చిత్తూరు నాగయ్య -లోకాభిరామయ్య, ప్రసాద్ తండ్రి
- నిర్మలమ్మ - పార్వతమ్మ (ప్రసాద్ తల్లి)
- పద్మనాభం - వరహాలు
- పెరుమాళ్లు - శేషయ్య (సీత తండ్రి)
- గీతాంజలి - హేమ
- రాజనాల - జగన్నాథం
- ఉదయలక్ష్మి - రుక్మిణి (డాక్టర్)
- వల్లం నరసింహారావు - రమేష్ (లలిత ప్రియుడు)
- మాస్టర్ మురళి - మధు
- బొడ్డపాటి
అతిథులు
- అంజలీదేవి
- ఎస్వీ రంగారావు
- షావుకారు జానకి
- రేలంగి
- కృష్ణకుమారి
- గుమ్మడి
- రమణారెడ్డి
- జమున
- కాంతారావు
- నగేష్ (వరహాలు పగటికలలో సినీ దర్శకుడు)
- రాజబాబు (వరహాలు పగటికలలో అతని పీ.ఏ.)
Remove ads
కథ
ప్రసాద్ ఒక కాలేజీ లెక్చరర్. అతని భార్య సీత, కొడుకు మధు. సీత తన అత్త పార్వతమ్మను, మామ లోకాభిరామయ్యను కంటికి రెప్పలా చూసుకుంటూ వుంటుంది. ఒక సారి సీత అనారోగ్యంతో బాధపడుతున్న తన తండ్రి శేషయ్యను చూడటానికి వెళుతుంది. ఆమె ప్రయాణం చేస్తున్న రైలు ప్రమాదానికి గురవుతుంది. ప్రసాద్ సీతను రైల్వే హాస్పెటల్‌లో కనుగొంటాడు. డాక్టర్లు ఆమె జ్ఞాపకశక్తిని కోల్పోయిందని చెబుతారు. ప్రసాద్ ఆమెను ఇంటికి తీసుకువెళతాడు. ఆమె తన పేరు లలిత అని సీత కాదు అని అంటుంది. ప్రసాద్ ఆమెను సైకియాట్రిస్టుకు చూపిస్తాడు. సైకియాట్రిస్ట్ రుక్మిణి ఆమెను పరీక్షించి ఆమె కన్య అని, సీత కాదు, సీత మరణించి ఉంటుందని నిర్ణయిస్తుంది. ముసలివాళ్లైన ప్రసాద్ తల్లిదండ్రుల కోసం, అనారోగ్యంతో బాధ పడుతున్న మధు కోసం లలిత సీతలాగా నటించాల్సి వస్తుంది. ప్రసాద్ లలితను, ఆమె ప్రియుడు రమేష్‌ను కలపడానికి ప్రయత్నిస్తాడు. కానీ రమేష్ లలిత శీలాన్ని అనుమానిస్తాడు. శేషయ్య తాను చనిపోయే ముందు తన ఆస్తిని అంతా తన కుమార్తె సీత పేరుమీద వ్రాస్తాడు. ఇది అతని పెంపుడు కొడుకు జగన్నాథానికి కోపం తెప్పిస్తుంది. లలితను సీత అని భావించి ఆమెను మట్టుపెట్టడానికి జగన్నాథం కుట్ర పన్నుతాడు. ప్రసాద్ ఆమెను రక్షిస్తాడు. చివరకు లలిత ప్రసాద్‌నే పెళ్లి చేసుకుంటుంది.[1]
Remove ads
విశేషాలు
ఈ చిత్రంలో మహానటి సావిత్రి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రంలోని వరహాలు పాత్రకు సినిమా పిచ్చి, తన పేరు బాగాలేదని అందరికి ప్రేమ్‌కుమార్ అని చెప్పుకుంటుంటాడు. అతను ఒకసారి మద్రాసుకు వెళ్ళి కొందరు నటీనటులను కలుసుకుంటాడు, అందువలన కొందరు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో అతిథులుగా నటించారు. వరహాలు సినిమా స్టూడియోలు చూడటానికి వెళ్తాడు, కానీ లోనికి వెళ్ళటానికి అనుమతించరు, అప్పుడతను తను హీరో అయితే ఎలా ఉంటుందో ఊహించుకుంటాడు, ఆ కలలో ప్రముఖ హాస్యనటుడు నగేష్ ఒక దర్శకునిగా, రాజబాబు అతని పీ.ఏ.గా దర్శనమిస్తాడు.
పాటలు
9. అందము లోల్కు మోముపై,(పద్యం) పి. సుశీల, రచన: వీటూరి
10.ఇతడే ట్రాజడి యాక్టింగ్ లో కింగ్,(పద్యం),మాధవపెద్ది సత్యం, రచన: వీటూరి
11.నాకు నీవే కావాలి రా ఓఓఓ నీకు నేనే, ఎస్.జానకి ,మాధవపెద్ది , రచన: సి నారాయణ రెడ్డి.
Remove ads
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads