నందమూరి తారకరత్న

తెలుగు నటుడు From Wikipedia, the free encyclopedia

నందమూరి తారకరత్న
Remove ads

నందమూరి తారకరత్న (1983, ఫిబ్రవరి 22 - 2023, ఫిబ్రవరి 18) తెలుగు సినిమా నటుడు. తారకరత్న తెలుగు చిత్రసీమలో ప్రముఖ నటుడు ఎన్.టి.రామారావు మనుమడు. తారకరత్న 2001లో ఒకేసారి 9 సినిమాలు మొదలు పెట్టి వరల్డ్ రికార్డ్ సృష్టించాడు.[2]

త్వరిత వాస్తవాలు తారకరత్న, జననం ...
Remove ads

బాల్యం

తారకరత్న 1983, ఫిబ్రవరి 22న చెన్నైలో జన్మించిన ఆయన నందమూరి మోహన కృష్ణ ఒక్కగానొక్క కుమారుడు.[3] ఆయన తండ్రి సినిమాటోగ్రాఫర్‌ కాగా తల్లి సీత గృహిణి.

విద్యాభ్యాసం

ఏడో తరగతి వరకు చెన్నైలో నందమూరి తారకరత్న చదువుకున్నాడు. ఆ తరవాత హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని భారతీయ విద్యాభవన్‌లో హైస్కూల్‌ విద్యను అభ్యసించాడు. గుంటూరు విజ్ఞాన్‌ కాలేజీలో ఇంటర్‌, హైదరాబాద్‌లోని విజ్ఞాన్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ పూర్తిచేసాడు.

చిత్రాలు

మరింత సమాచారం సంవత్సరం, సినిమా ...

వెబ్ సిరీస్

పురస్కారాలు

అస్వస్థత

2023 జనవరి 27న తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర చిత్తూరు జిల్లా కుప్పంలో ప్రారంభమవగా అందులో పాల్గొన్న తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు.[9] ఆయనను వెంటనే దగ్గరలోని కేసీ ఆస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పట్టణంలోని పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రికి తరలించారు. వైద్యపరీక్షలలో ఆయన గుండెలో ఎడమవైపు 90శాతం బ్లాక్‌ అయిందని గుర్తించారు. మెరుగైన చికిత్సకోసం బెంగళూరు నుంచి నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు అత్యాధునిక వైద్య పరికరాలతో మరునాడు ఇక్కడకు చేరుకుని ఆయనకు చికిత్సను అందించారు.[10]

అయినా ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో పీఈఎస్‌ వైద్యకళాశాల ఆస్పత్రి వైద్యులు ముందుగా సూచించినట్టు తారకరత్న భార్య అలేఖ్య నిర్ణయం మేరకు అదేరాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయకు ప్రముఖ కార్డియాలజిస్టుల పర్యవేక్షణతో కూడిన అత్యాధునిక సదుపాయాలున్న ప్రత్యేక అంబులెన్స్‌లో ఆయనను తరలించారు.[10]

రెండు రోజులపాటు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స కొనసాగినా ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగానే ఉందని, తీవ్ర గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన మెలేనా అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు గుర్తించారు.[11]

ఆయన ఆరోగ్య పరిస్థితిపై జనవరి 30న సాయంకాలం ఆసుపత్రి తాజా బులెటిన్ విడుదల చేసింది. ఇందులో ఆయన ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని, వెంటిలేటర్ పైనే ఉన్నాడని డాక్టర్లు వెల్లడించారు.[12]

2023 ఫిబ్రవరి 2 నాటికి నందమూరి తారకరత్న అస్వస్థతకు గురై వారం రోజులు అయింది. ఆయనకు చికిత్స కొనసాగుతోంది. మెదడుకు సంబంధించి చేసిన సిటీ స్కాన్ పరీక్షల రిపోర్టు రాగా మరికొన్ని పరీక్షలు నిర్వహించారు.[13]

2023 ఫిబ్రవరి 3న తిరిగి తారకరత్న మెదడు స్కానింగ్‌ చేశారు. వచ్చే నివేదిక ఆధారంగా మెదడు పనితీరు తెలిసింది. పరిస్థితిని బట్టి ఆయనను విదేశాలకు తరలించేందుకు సిద్ధమయ్యారు.[14]

2023 ఫిబ్రవరి 16న తిరిగి తారకరత్నకు ఎమ్మారై స్కానింగ్ చేశారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యులు తెలిపారు.[15]

22 రోజులుగా నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్యం 2023 ఫిబ్రవరి 18న అత్యంత విషమంగా మారినట్లు వైద్యులు తెలిపారు.[16]

Remove ads

మరణం

2023 జనవరి 27న గుండెపోటుకు గురియై బెంగళూరులోని నారాయణ హృదయాలయలో చికిత్స పొందుతున్న 39 ఏళ్ళ తారకరత్న 2023 ఫిబ్రవరి 18 మహాశివరాత్రి పర్వదినాన మరణించాడు.

వంశవృక్షం


సూచికలు

యితర లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads