నరేంద్ర హిర్వాణి
భారతదేశపు క్రికెట్ ఆటగాడు. From Wikipedia, the free encyclopedia
Remove ads
నరేంద్ర హిర్వాణి 1968 అక్టోబర్ 18 న ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ జన్మించిన నరేంద్ర హిర్వాణి భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. లెగ్‌స్పిన్నర్ బౌలర్ అయిన ఇతను ప్రవేశించిన తొలి టెస్టులోనే మంచి ప్రతిభను కనబర్చాడు. మద్రాసు (చెన్నై) లో అతడు ఆడిన తొలి టెస్టులో వెస్ట్‌ఇండీస్ పై తొలి ఇన్నింగ్సులో 61 పరుగులే ఇచ్చి 8 వికెట్లను పడగొట్టి తొలి టెస్ట్ లోనే ఈ ఘనత సాధించిన నాల్గవ బౌలర్ గా రికార్డు సాధించాడు. రెండో ఇన్నింగ్సులో కూడా 75 పరుగులే ఇచ్చి మళ్ళి 8 వికెట్లు సాధించాడు. టెస్టులో మొత్తం 16 వికెట్లకు 136 పరుగులు మాత్రమే ఇచ్చి ఇంతకు పూర్వం 1972లో బాబ్ మాసీ నెలకొల్పిన 137/16 రికార్డును అధికమించాడు. ఆ తర్వాత జరిగిన షార్జా టోర్నమెంటులో మ్యాన్ ఆప్ ది సీరీస్ అవార్డును పొందినాడు. 2005-06 లో ఇతడూ పస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి నిష్క్రమించాడు.
మొత్తం 17 టెస్టులు ఆడి 30.10 సగటు పరుగులు ఇచ్చి 66 వికెట్లను సాధించాడు. ఇన్నింగ్సులో 5 వికెట్లను 4 సార్లు పడగొట్టాడు. తని అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 61/8. ఇదితని తొలి ఇన్నింగ్సులో సాధించినదే. బ్యాటింగ్లో 5.40 సగటుతో 54 పరుగులు చేశాడు. వన్డేలలో 18 మ్యాచ్‌లు ఆడి 23 వికెట్లు సాధించి, బ్యాటింగ్ లో 8 పరుగులు చేశాడు.
Remove ads
ప్రారంభ రోజుల్లో
టెస్టుల్లో విజయం
తదుపరి వృత్తి
రికార్డ్స్
- హిర్వాణి 1990 లో ఓవల్లో ఇంగ్లాండ్ తో జరిగిన ఒక టెస్ట్ మ్యాచ్ సందర్భంగా విరామం లేకుండా (షెడ్యూల్ వ్యవధిలో కన్నా) బౌలింగ్ మారకుండా 59 ఓవర్లు (ప్రపంచ రికార్డు) వేసాడు.
మూలాలు
యితర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads