నిజాంపేట నగరపాలక సంస్థ
From Wikipedia, the free encyclopedia
Remove ads
నిజాంపేట నగరపాలక సంస్థ, తెలంగాణ రాష్ట్రంలో 2020 లో కొత్తగా ఏర్పడిన పట్టణ స్థానిక సంస్థలో ఇది ఒకటి.[1][2] నిజాంపేట ఒకప్పుడు మల్లంపేట గ్రామ పంచాయితీ పరిధిలో శివారు గ్రామంగా ఉండేది.1976లో మల్లంపేట పంచాయితీ నుండి విడిపోయి, ప్రత్యేక పంచాయతీగా ఆవిర్భవించింది. గ్రామ పంచాయితీ హోదా నుండి 2019 ఏప్రియల్ 20 న పురపాలక సంఘంగా ఏర్పడింది. తిరిగి వెంటనే 2019 జూలై 28 న నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్ ఈ మూడింటి కలిపి నిజాంపేట నగరపాలక సంస్థగా మునిసిపల్ కార్పోరేషన్ స్థాయికి అప్ గ్రేడ్ చేసారు. నిజాంపేట గ్రామం బాచుపల్లి మండల పరిధిలో ఉంది.నిజాంపేట్ నగరపాలక సంస్థ హైదరాబాదు మహానగరానికి వాయవ్య దిశ చివరలో ఉంది. ఇది హైదరాబాదు ఐటి కారిడార్ చుట్టూ వేగంగా అభివృద్ధి చెందుతున్న శివారు ప్రాంతాలలో ఒకటిగా మారింది. ఈ ప్రాంతలో నీటికొరత ఉన్నప్పటికీ దీనికి కారణం, ఆర్థిక స్తోమతకు భరించకలిగిన అవకాశాలు, సాపేక్షంగా కాలుష్య రహిత వాతావరణం ప్రాంతం కావటం.నీటికొరత ఉన్నప్పటికీ, 2018 లో ధరలను పెంచిన ప్రాంతానికి ప్రభుత్వం హైదరాబాదు మహానగరపాలస సంస్థ నీటిని అందించింది.గ్రామ పంచాయితీగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బిల్డర్లు రహదారులు,పార్కు స్థలాలు, ప్రభుత్వంనకు చెందిన ఖాళీ స్థలాలు ఆక్రమించుకోవటంలో నగర పరిధిలో మొక్కలు పెంపకం, పార్కులు, రహదారుల అభివృద్ధి పనులుకు అంతరాయం కలిగి ప్రజలు ఆశించినంతగా అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదని ప్రజలు అభిప్రాయం కనిపిస్తుంది. వర్షాకాలంలో కొన్ని అపార్టుమెంట్లు నీటిలో మునిగిపోయిన సందర్భాలు ఉన్నాయి. పచ్చదనం, ఉద్యానవనాలతో పోల్చినప్పుడు ప్రగతి నగర్ ఉత్తమమైందని కొంతమంది అభిప్రాయం.దీని ముఖ్య పట్టణం నిజాంపేట్.
Remove ads
మేయర్ , డిప్యూటీ మేయర్
2020 లో జరిగిన సాధారణ ఎన్నికలలో మేయరు పదవికి (URW) తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన కె.నీలారెడ్డి ఎన్నికైంది.అలాగే డిప్యూటీ మేయరు (UR) పదవికి తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన యస్.ధనరాజ్ యాదవ్ ఎన్నికయ్యాడు.[3]
ప్రగతినగర్ చెరువు ప్రాంతం

ప్రగతి నగర్ చెరువు చుట్టూ సుమారు 20,000 ఫ్లాట్లు, కొన్ని విల్లాస్ తో సహా కలిపి అనేక భారీ నిర్మాణాలు ఉన్నాయి. ఇళ్ళు, ఫ్లాట్లు స్వతంత్రంగా నిర్మించిన ఈ ప్రదేశంలో చాలా కాలనీలు ఉన్నాయి.రాబోయే టౌన్‌షిప్‌ల కారణంగా నిజాంపేట్ జీవించడానికి చాలా ప్రాచుర్యం పొందిన ప్రదేశంగా ఉందనే అభిప్రాయం మధ్యతరగతి వినియోగదారులలో ఉంది.హైదరాబాద్ ప్రతిపాదిత అవుటర్ రింగ్ రోడ్ నిజాంపేట నగరానికి చాలా దగ్గరగా ఉంది.
Remove ads
వాణిజ్య ప్రాంతం
నిజాంపేట, జెఎన్‌టియు, మెట్రో రైలు, కూకట్‌పల్లి, బాచుపల్లి, మియాపూర్‌లకు అతి దగ్గరగా ఉంది. ఇవి అన్నీ మెట్రో రైల్ కనెక్టివిటీతో అన్ని షాపులు, పెద్ద వాణిజ్య సంస్థలకు కేంద్రాలుగా ఉన్నాయి. నిజాంపేట్ రోడ్ - నిజాంపేట్ విలేజ్ - బాచుపల్లి రహదారికి రెండు వైపులా హెరిటేజ్ ఫ్రెష్ @, మోర్ మెగా మార్ట్, విజేతలాంటి పెద్ద సూపర్ మార్కెట్లు విరివిగా ఉన్నాయి. ఈ ప్రాంతాల అన్నీ నిజాంపేట్ విలేజ్ నుండి కేవలం 2 కి.మీ. దూరంలోనే ఉన్నాయి.
నిజాంపేట రోడ్‌లో పెక్కు ఆధునిక సౌకర్యలు కల్గిన ఎస్‌ఎల్‌జి (బాచుపల్లి - రాజీగంధీ నగర్), శ్రీ శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్, మెట్రో హాస్పిటల్, గ్రామం మధ్యలో ఒక మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి ఉన్నాయి. ప్రధాన రహదారిలో అపోలో క్లినిక్ ఉంది. నిజాంపేట్ రోడ్‌లో 3 కి.మీ. దూరంలో రెండు అపోలో క్లినిక్‌లు ఉన్నాయి. హనుమాన్ ఆలయానికి సమీపంలో ఉన్న నెస్ట్ చిల్డ్రన్ హాస్పిటల్, ప్రసిద్ధ ఫార్మసీ రిటైలర్ మెడ్‌ప్లస్ హనుమాన్ ఆలయం సమీపంలో ప్రారంభమయ్యాయి. అక్రుతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జరీ, ఇక్కడికి 4 కి.మీ. దూరంలో ఉంది.నిజాంపేట్ పరిసర ప్రాంతాలను వాణిజ్య కేంద్రాలుగా పరిగణిస్తారు. హనుమాన్ ఆలయం (నిజాంపేట్ విలేజ్ బస్ స్టాప్) సమీపంలో ఆహారం, బట్టలకు సంబంధించిన చాలా షాపులు ప్రజల అవసరాలకు తగ్గట్టుగా అందుబాటులో ఉన్నాయి.
అభివృద్ధి పనులు
2022, మార్చి 20న నిజాంపేట మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని 16, 17, 19, 28 డివిజన్లలో రూ.కోటి15 లక్షల నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, లైబ్రరీ, డ్వాక్రా భవన నిర్మాణ పనులను, 30వ డివిజన్ జర్నలిస్ట్ కాలనీలో రూ. 30లక్షల వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్డుతోపాటు హైరైజ్ ఫేజ్-2లో రూ.26లక్షలతో నిర్మించిన బీటీ రోడ్డును కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్, మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డితో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్, కార్పోరేటర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[4]
Remove ads
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads