నీలిమందు మొక్క
From Wikipedia, the free encyclopedia
Remove ads
నీలిమొక్క నుంచి నీలిమందు తయారుచేస్తారు. అందుకని దీనిని నీలిమందు మొక్క అని కూడ అంటారు. దీనినే నీలిగోరింట, మధుపర్ణిక అని కూడ అంటారుట. నిజానికి ఈ నీలిమొక్క ఫాబేసి కుటుంబానికి చెందిన దరిదాపు 700 మొక్కలలో ఒక్కటి మాత్రమే. ఈ వర్గం మొక్కలు ఉష్ణ మండలాలలోనూ (tropical regions) సమశీతోష్ణ మండలాలలోనూ (sub-tropical regions) విరివిగా పెరుగుతాయి. ఇవి తుప్పలులా కాని, చెట్లలా కాని పెరుగుతాయి.
Remove ads
ఉపయోగాలు
ఈ వర్గానికి చెందిన దరిదాపు 700 జాతులలోనూ రెండు జాతులని మాత్రం (ముఖ్యంగా, Indigofera tinctoria and Indigofera suffruticosa) నీలిమందు తయారు చెయ్యటానికి వాడతారు. Indigofera suffruticosa ని I. anil అని కూడ పిలుస్తారు. ఇక్కడ 'అనిల్' అన్న మాట 'నీల్' అనే సంస్కృత పదం నుండి పుట్టింది. నీల్ అంటే నీలం కనుక I. anil అంటే 'నీలిమందు నీలం' అని అర్ధం. ఈ Indigofera anil నుండే మొట్టమొదట aniline అనే అద్దకపు రంగుని కృత్రిమంగా తయారు చేసేరు.
ఈ వర్గపు మొక్కలకి ఔషధ లక్షణాలు కూడ ఉన్నాయి. వీటిలో కొన్ని వాపుని తగ్గించగలవు (anti-inflammatory), కొన్ని నొప్పిని తగ్గించగలవు (analgesic or pain killer).
Indigofera articulata (అరబ్బీలో Khedaish) ని పంటినొప్పికీ, Indigofera oblongifolia (అరబ్బీలో "Hasr") ని వాపు తగ్గించటానికీ, కీటకపు కాట్లకీ వాడతారు.[1]Indigofera suffruticosa నీ Indigofera aspalthoides నీ కూడ వాపులు తగ్గించే మందుగా వాడతారు.[2]. Indigofera arrecta నుండి తీసిన మందుతో పొట్టలో పుండ్లు () తగ్గటానికి ఒకరు మందు తయారు చేసి దాని తయారీకి ఏకస్వం (patent) కూడ పుచ్చుకున్నారు.[3]
Remove ads
ఈ వర్గంలో కొన్ని మొక్కల అంతర్జాతీయ నామాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads