పుత్తూరు
ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా, పుత్తూరు మండల పట్టణం From Wikipedia, the free encyclopedia
Remove ads
పుత్తూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతి జిల్లాకు చెందిన పట్టణం. పుత్తూరు మండల కేంద్రం.[3]
Remove ads
చరిత్ర

1830-31 సంవత్సరాల్లో తన కుటుంబం, సేవకులు, పరివారంతో కాశీయాత్ర చేసిన ఏనుగుల వీరాస్వామయ్య ఆ యాత్రను తెలుగులో ముద్రితమైన తొలి ట్రావెలాగ్ కాశీయాత్ర చరిత్రగా మలిచారు. ఆ ప్రయాణం ఈ గ్రామం మీదుగా సాగి, వారు ఇక్కడ విడిది చేయడంతో ఈ గ్రామంలో 1830 సమయంలో స్థితిగతులు ఎలా ఉండేవో ఆ గ్రంథంలో నమోదు అయింది. అతను వ్రాసుకున్నదాని ప్రకారం 1830ల నాటికే పుత్తూరులో మునియప్పిళ్ళ సత్రం ఉంది. అక్కడ బ్రాహ్మణులకు, గోసాయిలకు, బైరాగులకు సదావృత్తి (స్వయంపాకం వంటిది) ఇచ్చేవారు. ఆ పట్టణంలో అప్పట్లో పరిపాలిస్తున్న ఈస్టిండియా కంపెనీ వారు దొరలకు హోటల్/సత్రం (ముసాఫరుఖానా) కట్టించారు. చిన్న పట్టణం (చిన్న పేటస్థలం) అని వివరించారు. కావలసిన వస్తువులు దొరుకుతాయన్నారు.[4]
Remove ads
జనాభా
2011 భారత జనాభా విడుదల చేసిన నివేదిక ప్రకారం పుత్తూరు మున్సిపాలిటీలో 54,092 జనాభా ఉంది, అందులో 27,017 మంది పురుషులు, 27,075 మంది మహిళలు ఉన్నారు.[5]
0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 5352, ఇది పుత్తూరు మొత్తం జనాభాలో 9.89%. పుత్తూరు పట్టణంలో స్త్రీ పురుష నిష్పత్తి రాష్ట్ర సగటు 993కి వ్యతిరేకంగా 1002గా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సగటు 939తో పోలిస్తే పుత్తూరులో పిల్లల లింగ నిష్పత్తి దాదాపు 927గా ఉంది. పుత్తూరు అక్షరాస్యత రేటు రాష్ట్ర సగటు 67.02% కంటే 78.37% ఎక్కువ. పుత్తూరులో పురుషుల అక్షరాస్యత 85.30% కాగా, స్త్రీల అక్షరాస్యత 71.51%గా ఉంది
పుత్తూరు పట్టణ పరిధిలో మొత్తం 13,477 గృహాలకు నీటి సరఫరా, మురుగునీరు పారుదల వంటి ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి. పట్టణ పరిధిలో రోడ్లు నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్నులు విధించడానికి స్థానిక పురపాలక సంఘం అధికారం కలిగి ఉంది.
Remove ads
పరిపాలన
పుత్తూరు పురపాలక సంఘం పట్టణ పరిపాలన నిర్వహిస్తుంది.
వైద్య సదుపాయాలు
ఈ గ్రామంలో ఎముకలు విరిగినవారికి సంప్రదాయబద్దంగా చికిత్స చేస్తారు.
విద్యాసంస్థలు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads