పెద్దరికం

1992 సినిమా From Wikipedia, the free encyclopedia

పెద్దరికం
Remove ads

పెద్దరికం 1992లో ఎ. ఎం. రత్నం స్వీయ నిర్మాణ, దర్శకత్వంలో విడుదలై ఘనవిజయం సాధించిన తెలుగు చిత్రము. ఇందులో జగపతి బాబు, సుకన్య నాయకా నాయికలుగా నటించారు. రాజ్ కోటి సంగీత దర్శకత్వం వహించిన ఈ చిత్రంలోని పాటలు ప్రేక్షకాదరణ పొందాయి. ఈ చిత్రం మలయాళంలో విజయం సాధించిన గాడ్‌ఫాదర్ చిత్రానికి పునర్నిర్మాణం.[1] కథానాయిగా సుకన్యకు ఇది తొలి తెలుగు చిత్రం.

త్వరిత వాస్తవాలు పెద్దరికం, దర్శకత్వం ...
Remove ads

కథ

అడుసుమిల్లి బసవపున్నమ్మ (భానుమతీ రామకృష్ణ), పర్వతనేని పరశురామయ్య (ఎన్. ఎన్. పిళ్ళై) కుటుంబాల మధ్య వైరం ఉంటుంది. బసవపున్నమ్మ మనవరాలు జానకి (సుకన్య) పెళ్ళి పరశురామయ్య కుటుంబం కారణంగా చెడిపోతుంది. దాంతో బసవపున్నమ్మ వారి మీద పగ తీర్చుకోవడానికి జానకిని పరశురామయ్య చిన్న కొడుకు కృష్ణమోహన్ (జగపతి బాబు) ను ప్రేమించినట్లు నాటకమాడుతుంది. ఒకర్నొకరు అవమానించుకోవడానికి ప్రయత్నించి వారు నిజంగానే ప్రేమించుకుంటారు. దాంతో వారి రెండు కుటుంబాల మధ్య మళ్ళీ గొడవలు చెలరేగుతాయి. ఆ గొడవలను అంతా సర్దుబాటు చేసి ఆ రెండు కుటుంబాలు ఎలా కలిశాయో తెలిపేదే మిగతా కథ.

Remove ads

తారాగణం

సాంకేతికవర్గం

పాటలు

  1. ఇదేలే తరతరాల చరితం , రచన: భువన చంద్ర గానం. కె. జె. యేసు దాస్, స్వర్ణలత
  2. ముద్దుల జానకి పెళ్ళికి రచన: వడ్డేపల్లి కృష్ణ , గానం. కె ఎస్ చిత్ర
  3. నీ నవ్వే చాలు పూబంతి , రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  4. ప్రియతమా ప్రియతమా తరగని పరువమా, రచన: భువన చంద్ర, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర

మూలాలు

బయటి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads