భారత రక్షణ దళాలు

సంయుక్త భారత సాయుధ రక్షణ దళాలు From Wikipedia, the free encyclopedia

భారత రక్షణ దళాలు
Remove ads

భారత సాయుధ దళాలు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క సైనిక దళాలు. ఇది మూడు వృత్తిపరమైన యూనిఫాం సేవలను కలిగి ఉంటుంది: భారత సైన్యం, ఇండియన్ నేవీ, భారత వైమానిక దళం. అదనంగా, భారత సాయుధ దళాలకు సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్, అసోం రైఫిల్స్, ఇండియన్ కోస్ట్ గార్డ్, స్పెషల్ ఫ్రాంటియర్ ఫోర్స్, స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్, అండమాన్, నికోబార్ కమాండ్, ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్ స్టాఫ్ వంటి వివిధ ఇంటర్-సర్వీస్ కమాండ్‌లు, సంస్థలు మద్దతు ఇస్తున్నాయి. . భారత రాష్ట్రపతి భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్ అయితే జాతీయ భద్రతకు సంబంధించిన కార్యనిర్వాహక అధికారం, బాధ్యత భారత ప్రధానమంత్రి, వారి ఎంపిక చేసిన క్యాబినెట్ మంత్రులకు అప్పగించబడింది. భారత సాయుధ దళాలు భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖ నిర్వహణలో ఉన్నాయి. 1.4 మిలియన్లకు పైగా క్రియాశీల సిబ్బంది బలంతో, ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైనిక దళం, ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సైన్యాన్ని కలిగి ఉంది. ఇది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద రక్షణ బడ్జెట్‌ను కూడా కలిగి ఉంది. గ్లోబల్ ఫైర్‌పవర్ ఇండెక్స్ నివేదిక దీనిని నాల్గవ అత్యంత శక్తివంతమైన మిలిటరీగా పేర్కొంది.

త్వరిత వాస్తవాలు భారతదేశం సైనిక దళాలు भारतीय सशस्‍त्र सेनाएँ భారతీయ సాయుధ బలగాలు, శాఖలు ...

భారత సైనిక బలగాలలో 3 ప్రధాన విభాగాలున్నాయి.[14][15]

14 లక్షల పైబడిన సైన్యంతో,[16] భారత రక్షణ బలగాలు ప్రపంచంలోకెల్లా మూడవ అతిపెద్ద సైన్యం.[17] ఈ దళాలన్నిటికీ సర్వసైన్యాధ్యక్షుడు, భారత రాష్ట్రపతి. ఈ సైనిక దళాల నిర్వహణ భారత ప్రభుత్వపు రక్షణ మంత్రిత్వ శాఖ చూస్తుంది. పై మూడు ప్రధాన దళాలకు వాటివాటి అధిపతులు ఉండగా, మూడింటినీ సమన్వయ పరుస్తూ సంయుక్త ప్రధాన సైన్యాధికారి ఉంటారు. త్రివిధ దళాధిపతులు ముగ్గురిలోకీ సీనియరు అధికారి ఈ బాధ్యతలు నిర్వహిస్తారు.

ప్రధానమైన పై మూడు దళాలతో పాటు తీర రక్షక దళం, ఇతర పారామిలిటరీ దళాలు కూడా రక్షణ దళాలలో భాగంగా ఉన్నాయి.[18] వ్యూహాత్మక బలగాల కమాండ్, అండమాన్, నికోబార్ కమాండ్ వంటి ప్రత్యేక కమాండ్లు కూడా భారత రక్షణ వ్యవస్థలో భాగం.

భారత సాయుధ దళాలు అనేక సైనిక చర్యల్లో పాలుపంచుకున్నాయి. 1947, 1965, 1971 నాటి భారత పాక్ యుద్ధాలు, 1963 భారత చైనా యుద్ధం, భారత పోర్చుగీసు యుద్ధం, 1987 భారత చైనా ఘర్షణ, కార్గిల్ యుద్ధం, సియాచిన్ ఘర్షణ వీటిలో కొన్ని. ప్రతి సంవత్సరం డిసెంబరు 7 న భారత్ సాయుధ దళాల దినోత్సవం జరిపి వీరోచిత సైనికులను సత్కరించుకుంటుంది. 1962 నుండి భారతీయ వాయుసేన రష్యాతో దగ్గరి సంబంధాలు నెలకొల్పుకుంది. ఐదవ తరం ఫైటరు విమానం, సైనిక రవాణా విమానాల అభివృద్ధి ఈ సహకారంలో భాగం. అణుత్రయ సామర్థ్యాన్ని సాధించిన భారత్[19] తన సాయుధ బలగాలను నిరంతరం ఆధునికీకరిస్తూ ఉంది.[20] క్షిపణి రక్షణ వ్యవస్థ, రేపటి సైనిక వ్యవస్థ ఈ ఆధునికీకరణలో కొన్ని భాగాలు.[21][22][23]

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads