మడకా హరిప్రసాద్
From Wikipedia, the free encyclopedia
Remove ads
మడకా హరిప్రసాద్ గణిత శాస్త్రంలో ఘనాపాటి. ఆయన అక్టోబరు 30, 1999 న అతి తక్కువ సమయంలో గణిత ప్రక్రియలు చేసి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం పొందాడు.[1]
జీవిత విశేషాలు
హరిప్రసాద్ 1988 లో అనంతపురం జిల్లా , కదిరి తాలూకా గుండువారి పల్లెలో మోహన కృష్ణ,రాధాకృష్ణమ్మ దంపతులకు జన్మిచారు. ఆయన తండ్రి ఎం.మోహన కృష్ణ ఒక ఆర్.టి.సి కండక్టరు. బాల్యం నుండి లెక్కలంటే ఆసక్తి, జిజ్ఞాస ఎక్కువ. ఆయన తన 20వ యేట 33.7 సెకన్లలో ఎనిమిది అంకెల సంఖ్యను మరో ఎనిమిది అంకెల సంఖ్యతో గుణించడం, ఒకనిమిషంలో వేర్వేరు సంవత్సరాలలోని తేదీలను వారాలను చెప్పడం, ఒకనిముషం 3.8 సెకన్లలో ఆరు అంకెల సంఖ్యకు వర్గమూలం కనుగొనడం మొదలు, సాహస కార్యాలతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లు మూడింటిని ఏకకాలంలో సాధించారు.ఈ కార్యక్రమాన్ని 2009 అక్టోబరు 30 న ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరులో చేసారు. అవధాన కార్యక్రమాలు అనేకం నిర్వహించారు.[2][3]
Remove ads
రికార్డు వివరాలు
- ఆరు అంకెల సంఖ్య యొక్క వర్గమూలం 1నిమిషముల 3.8సెకన్లలో చేసారు. 732,915 యొక్క వర్గమూలం 856.1045496 అని 1నిమిషముల 3.8సెకన్లలో చేయటం.[4]
- రెండు ఎనిమిది అంకెల సంఖ్యల లబ్దం 33.7 సెకన్లలో చెప్పడం.
- వేర్వేరు సంవత్సరాలలో తేదీలను ఒక నిమిషం లో చెప్పడం.
గౌరవాలు
- రాష్ట్ర ప్రభుత్వం ల్యాప్ టాప్ కంప్యూటరు బహూకరణ.
- డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్ అథారిటీ వారి గోల్డ్ మెడల్ (1988)
- ఇంటెల్ డిస్కవరీ ఫెయిర్ లో ప్రథమ బహుమతి.
- 2002 లో ఉగాది పురస్కారం.
- నేషనల్ మెమొరీ ఛాంపియన్ షిప్.[5]
మూలాలు
ఇతర లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads