గిన్నీస్ ప్రపంచ రికార్డులు
ప్రపంచంలోని ప్రకృతి లేదా మానవుల ద్వారా చేసిన మొదటివి, అద్భుతమైన విషయాలను పొందుపరిచే పుస్తకం. From Wikipedia, the free encyclopedia
Remove ads
ప్రపంచంలో రికార్డులు సాధించిన వారి వివరములు గల పుస్తకము.
గిన్నీస్ ప్రపంచ రికార్డులు (ఆంగ్లం: Guinness World Records) (2000 వరకు ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ అని పిలవబడ్డాయి) ప్రతి సంవత్సరం ప్రచురించబడే ఒక ప్రమాణిక పుస్తకము. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రపంచ రికార్డులను నమోదు చేస్తుంది. ఇందులో మానవులు సాధించిన ఘనవిజయాలు, ప్రకృతిలో జరిగే విపరీతాలను గుర్తింపబడతాయి. ఈ పుస్తకమే కాపీరైటు పొందిన పుస్తకాల అమ్మకాలలో ఒక ప్రపంచ రికార్డు సాధించింది.[1]
Remove ads
చరిత్ర
1951 నవంబరు 10న సర్ హగ్ బీవర్, ఐర్లాండ్ లోని గిన్నీస్ బ్రెవరీ కంపెనీ డైరెక్టరు ఒక రోజు స్నేహితులతో ప్రపంచంలో అత్యంత వేగంగా పరుగెత్తే పక్షి ఏది అని వాదిస్తున్నాడు. అయితే తొందరలోనే ఈ విషయాన్ని నిర్ధారించడం చాలా కష్టమని అతనికి అర్ధం అయింది.[2] అయితే బ్రిటన్లో ప్రచురించబడే 81,400 ప్రచురణలలో ఇలాంటి వివాదాలను పరిష్కరించే పుస్తకం అప్పటివరకు విడుదలకాలేదు. అతని ఆలోచనలో ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలను చూపించే పుస్తకం చాలా ప్రాచుర్యం పొందుతుందని భావించారు.
బీవర్ ఆలోచనను గిన్నీస్ కంపెనీలో ఉద్యోగిగా ఉండే క్రిష్టాఫర్ కాటవే బాగా సమర్ధించి లండన్లోని నోరిస్, రాస్ అనే ఇద్దరు కవలలకు ఆ పని అప్పగించాడు. ఈ అన్నదమ్ములు పూర్తిచేసిన పుస్తకం "ది గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు" ఆగష్టు 1954లో ఒక వెయ్యి కాపీలు ముద్రించి అందరికీ పంచిపెట్టారు.[3]
గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డులు స్థాపించిన తరువాత మొదటి 198-పేజీల ప్రతిని 27 ఆగష్టు 1955లో విడుదలచేశారు. క్రిస్టమస్ కల్లా బ్రిటిష్ బెస్ట్ సెల్లర్ గా నమోదయింది. ఆ తరువాతి సంవత్సరం అమెరికాలో విడుదల చేసి 70,000 కాపీలు అమ్ముడయ్యాయి. అప్పటినుండి ప్రతి సంవత్సరం కొత్త రికార్డులతో అక్టోబరులో ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. మెక్ విటర్స్ అన్నదమ్ములు తరువాత బహుళ ప్రాచుర్యం పొందిన దూరదర్శినిలో పిల్లల ప్రశ్నలకు సమాధానాలు చెప్పెవారు.
Remove ads
గిన్నీస్ మ్యూజియం
1976 సంవత్సరంలో గిన్నీస్ బుక్ ఆఫ్ ప్రపంచ రికార్డుల ఎగ్జిబిషన్ హాలు ఎంపైర్ స్టేట్ బిల్డింగ్లో ప్రారంభించబడింది. దీనిలో ప్రపంచంలోని అత్యంత పొడువైన మనిషి (రాబర్ట్ వాడ్లో) విగ్రహం, ప్రపంచంలో అత్యంత పొడవైన వానపాము, కత్తులను మ్రింగే వ్యక్తి X-రే ఫోటో, మెరుపుల వలన కన్నాలు పడిన టోపీ మొదలైనవి ఉన్నాయి.[4]
ఈ మధ్యకాలంలో గిన్నీస్ కంపెనీ అమెరికాలోనే కాకుండా ఇతర దేశాలలో మూజియాలు స్థాపించడానికి అంగీకరించింది. ప్రస్తుతం టోక్యో, కోపెన్ హాగన్, సాన్ ఆంటోనియో, నయగారా జలపాతాలు, కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్, టెన్నిస్సె లలో ఉన్నాయి.
Remove ads
రికార్డ్ సృష్టించిన భారతీయులు
- ఎక్కువ పాటలు (వివిధ బాషలలో) పాడిన గాయకురాలు లతా మంగేష్కర్ = 32 వేలకు పైగా పాటలు.
- అసుతోష్ పాణిగ్రాహి
- రాజన్ మహదేవన్-జ్ఞాపక శక్తి
- శ్రీధర్ చిల్లాల్-4.25 అడుగులు పొడవయిన చేతి గోళ్ళు
- 2006 : కిషన్ శ్రీకాంత్ - అతిపిన్న వయసులో(10 ఏళ్ల వయసు) సినిమా దర్శకత్వం [5]
- మురుగప్ప చన్నవీరప్ప మోడి -నేత్ర వైద్యుడు,ఒక రోజులో 833 కంటి శుక్లాల శస్త్ర చికిస్చ్చాలు చేసారు. 46,120 గ్రామాలు సందర్శించి 12,118,630 కంటి రోగులను పరిశీలించి ఫిబ్రవరి,1993వ సంవత్సరానికే 610,564కంటి శస్త్ర చికిస్చ్చాలు నిర్వహించిన ఈయన వైద్యో నారాయణో హరి అనే గౌరవానికి అర్హుడు.
- మనోరమ - అత్యధిక సినిమాలలో నటించిన వ్యక్తి.
సంఘటనలు
- 2004 : 17,921 మందితో రక్త దాన శిబిరము-అక్టోబర్ 10, 2004 న బాపుజి గ్రామం, శ్రీగంగానగర్,ఇండియా [6]
- 1999వ సంవత్సరములో సుయంవరం(తమిళ సినిమా) పేరుతొ స్వయంవరం(తెలుగు అర్థం) 10మంది దర్శకులు,5గురు సంగీత దర్శకులు,12మంది కథానాయకులు,10మంది నాయికలు, 23 గంటలలో చిత్రీకరణ, నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తిచేసి సినిమాని విడుదలకి సిద్దం చేసిన అరుదయిన సంఘటన.
- ఎక్కువ సినిమాల నిర్మాణం
- ఎక్కువ సినిమా థియేటర్లు
- ఎక్కువ ప్రేక్షకులు
- కుంభమేళా
- తిరుమలలో శ్రీవారికి సమర్పించు శిరోజాలు
- అన్నమాచార్యుని 601 జన్మదినాన హైదరాబాదులో జరిగిన 'లక్షగళ సంకీర్తనార్చన'లో 1,60,000 మంది ఒకేసారి అన్నమాచార్య కీర్తనలు గానం చేశారు.
తెలుగువారు
గిన్నీస్ ప్రపంచ రికార్డులు వారిచే గుర్తింపబడిన ప్రపంచములోనే
- అతిపెద్ద ఆధునికమైన ఫిల్మ్ స్టూడియో రామోజీ ఫిల్మ్ సిటీ మన హైదరాబాద్ శివార్లలో ఉంది, నిర్మించింది రామోజీరావు
- ఎక్కువ పాటలు(వివిధ బాషలలో)పాడిన గాయకుడు ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం30 వేలకు పైగా
- ఎక్కువ సినిమాలకి (వివిధ బాషలలో) దర్శకత్వం వహించిన దర్శకుడు దాసరి నారాయణ రావు(100 సినిమాలకి పైగా)
- ఎక్కువ సినిమాలు (వివిధ బాషలలో) నిర్మించిన నిర్మాత రామానాయుడు(100 సినిమాలకి పైగా)
- అతితక్కువ కాలములో ఎక్కువ సినిమాలలో నటించిన నటుడు బ్రహ్మానందం (750 సినిమాలకి పైగా)
- 2000 : ఎక్కువ సినిమాలకి దర్శకత్వం వహించిన మహిళా దర్శకురాలు విజయనిర్మల[7](42 సినిమాలు)
మన తెలుగు చలనచిత్ర సీమకు గొప్పదనం,గౌరవం,ప్రపంచములో గుర్తింపు తెచ్చిన ప్రతిభావంతులు. - వడ్డీ మహేశ్వరి: కూచిపూడి నాట్యం ఎక్కువ సమయం చేసినందుకు గాను
- మల్లి మస్తాన్ బాబు : 172 రోజుల్లో ఏడు ఖండాలలోని ఏడు అత్యున్నత పర్వతాలను అధిరోహించిన పర్వతారోహకుడు.
- గట్టెం వెంకటేష్: పంటిపుల్లపై న్యూయార్క్ ఎంపైర్ స్టేట్ బిల్డింగ్ నమూనాను చెక్కిన 19 యేళ్ళ యువకుడు.
Remove ads
రికార్డుల్లోకి ఐపీఎల్ జెర్సీ 2022
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ (2022) ఫైనల్ మ్యాచ్ జరిగిన అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంకు ఒక ప్రత్యేకత ఉంది. అది ఏంటంటే ఈ స్టేడియం ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం. ఇందులో 1,32,000 మంది కూర్చుని వీక్షించే వసతి ఉంది. ఇప్పుడు మరో ఘణత సాధించింది. IPL 2022 సందర్భంగా ప్రదర్శించిన 66 X 44 మీటర్ల సైజుతో క్రికెట్ జెర్సీ, అతిపెద్ద క్రికెట్ జెర్సీగా గిన్నిస్ వరల్డ్ రికార్డు కైవసం చేసుకుంది. ఈ జెర్సీలో పది జట్ల లోగోలతో పాటు 15వ సీజన్ ను ప్రతిఫలిస్తూ జెర్సీపై 15వ నంబర్ వేశారు.[8]
Remove ads
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads