మిత్రుడు (సినిమా)
From Wikipedia, the free encyclopedia
Remove ads
మిత్రుడు మహాదేవ్ దర్శకత్వం వహించిన 2009 సినిమా. వైష్ణవి సినిమా పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించాడు. నందమూరి బాలకృష్ణ, ప్రియామణి ముఖ్య పాత్రల్లో నటించారు. మణి శర్మ సంగీతం అందించాడు. ఈ చిత్రాన్ని తరువాత హిందీలో ఆజ్ కా హిందుస్తానీ పేరుతోను, భోజ్‌పురిలో ఫూల్ కౌర్ కేట్ గానూ అనువదించారు.
ఈ సినిమా సమీక్షకుల ప్రశంసలు పొందలేకపోయింది.[1]
Remove ads
కథ
ఆదిత్య ( నందమూరి బాలకృష్ణ ) నిరాశకు గురైన ఒంటరివాడు, అతను మలేషియాలో ఉంటాడు. ఇందూ ( ప్రియమణి ) ఒక కోటీశ్వరుడైన వ్యాపారవేత్త కుమార్తె. ఆమె మలేషియాలో చదువుతుంది. జ్యోతిష్కుడు ఆమె ఆదర్శ భర్త లక్షణాలు ఎలా ఉండాలో చెబుతాడు. ఆ లక్షణాలు ఆదిత్య లక్షణాలతో కలుస్తాయి. కొన్ని విఫల ప్రయత్నాల తరువాత, ఆదిత్య ఇందూ ప్రతిపాదనను అంగీకరించి ఆమెను వివాహం చేసుకుంటాడు. ఆదిత్య ఎందుకు నిరాశకు గురయ్యాడు, ఇందూ ఆదిత్యను వెంబడించి అతనిని వివాహం చేసుకోవటానికి అసలు కారణం ఏమిటీ అనేవే మిగిలిన కథ అంతా
Remove ads
తారాగణం
- నందమూరి బాలకృష్ణ
- ప్రియమణి
- అర్జన్ బాజ్వా
- బ్రహ్మానందం
- ఎం. బాలయ్య
- ప్రదీప్ రావత్
- చంద్ర మోహన్
- ఆహుతి ప్రసాద్
- తమ్మారెడ్డి చలపతిరావు
- కృష్ణ భగవాన్
- రఘుబాబు
- శ్రీనివాసరెడ్డి
- సురేఖా వాణి
- హేమ
- ధర్మవరపు సుబ్రహ్మణ్యం
- రాళ్లపల్లి
- రంగనాథ్
- బేబీ యాని
- రచనా మౌర్య
పాటలు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads