మూడుచింతలపల్లి మండలం
తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా లోని మండలం From Wikipedia, the free encyclopedia
Remove ads
మూడుచింతలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చెల్-మల్కాజ్‌గిరి జిల్లా చెందిన మండలం.[1]2016 లో జరిగిన పునర్య్వస్థీకరణలో ఈ గ్రామం షామీర్‌పేట మండలంలో ఉంది.ఆ తరువాత ఈ గ్రామం ప్రధాన కేంద్రగా మూడుచింతలపల్లి మండలంగా షామీర్‌పేట మండలంలోని కొన్ని గ్రామాలను విడగొట్టి కొత్త మండలంగా ఏర్పాటైంది.[2][3] 2016 లో చేసిన తొలి పునర్వ్యవస్థీకరణలో కాకుండా ఆ తరువాత నుండి 2021 వరకూ మధ్య గల కాలంలో కొత్తగా ఏర్పాటు చేసిన మండలాల్లో ఇది ఒకటి. [4][5] దానికి ముందు ఈ మండలం రంగారెడ్డి జిల్లా లో ఉండేది. [6] ప్రస్తుతం ఈ మండలం మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మల్కాజ్‌గిరి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో రెండు నిర్జన గ్రామాలు.
Remove ads
కొత్త గణాంకాలు
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 237 చ.కి.మీ. కాగా, జనాభా 23,194. జనాభాలో పురుషులు 11,665 కాగా, స్త్రీల సంఖ్య 11,529. మండలంలో 5,454 గృహాలున్నాయి.[7]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
- మూడుచింతలపల్లి
- లింగాపూర్
- ఉద్దేమర్రి
- ఉషార్‌పల్లి
- కేశవరం
- నాగిసెట్టిపల్లి
- కొల్తూర్
- నారాయణపూర్
- పోతారం
- అనంతారం
- లక్ష్మాపూర్
- అద్రాస్‌పల్లి
- ఎల్లగూడ
- జగ్గంగూడ
- సంపనబోలు
- కేశ్వాపూర్
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads