యుఎస్ ఓపెన్ (టెన్నిస్)
From Wikipedia, the free encyclopedia
Remove ads
యుఎస్ ఓపెన్ టెన్నిస్ ఛాంపియన్‌షిప్స్ (సాధారణంగా యుఎస్ ఓపెన్ అని అంటారు) న్యూయార్క్‌లోని క్వీన్స్‌లో ప్రతి సంవత్సరం జరిగే హార్డ్‌కోర్ట్ టెన్నిస్ టోర్నమెంటు. 1987 నుండి, యుఎస్ ఓపెన్, గ్రాండ్ స్లామ్ టోర్నమెంటులలో కాలక్రమానుసారం సంవత్సరంలో జరిగే నాల్గవది, చివరిది. మిగిలిన మూడు, కాలక్రమానుసారం, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ లు. యుఎస్ ఓపెన్ ఆగస్టు చివరి సోమవారం నాడు ప్రారంభమై రెండు వారాల పాటు కొనసాగుతుంది. మధ్య వారాంతం యుఎస్ లేబర్ డే సెలవుదినం ఉంటుంది. ఈ టోర్నమెంటు, ప్రపంచంలోని పురాతన టెన్నిస్ ఛాంపియన్‌షిప్‌లలో ఒకటి. దీనిని వాస్తవానికి యుఎస్ నేషనల్ ఛాంపియన్‌షిప్ అని పిలుస్తారు, దీని కోసం పురుషుల సింగిల్స్, పురుషుల డబుల్స్‌ను మొదట 1881 ఆగస్టులో ఆడారు. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల కారణంగా రద్దు చేయని లేదా 2020లో COVID-19 మహమ్మారి వలన అంతరాయం కలగని ఏకైక గ్రాండ్ స్లామ్ ఇది.
టోర్నమెంటులో ఐదు ప్రాథమిక ఛాంపియన్‌షిప్‌లు ఉన్నాయి: పురుషుల, మహిళల సింగిల్స్, పురుషులు, మహిళల డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్. టోర్నమెంటులో సీనియర్, జూనియర్, వీల్ చైర్ ప్లేయర్‌ల ఈవెంట్‌లు కూడా ఉన్నాయి. 1978 నుండి, టోర్నమెంటును న్యూయార్క్ నగరంలో క్వీన్స్ లో ఉన్న ఫ్లషింగ్ మెడోస్-కరోనా పార్క్ లోని USTA బిల్లీ జీన్ కింగ్ నేషనల్ టెన్నిస్ సెంటర్‌లో యాక్రిలిక్ హార్డ్‌కోర్ట్‌ల మీద నిర్వహిస్తారు. యుఎస్ ఓపెన్ను, లాభాపేక్షలేని సంస్థ అయిన యునైటెడ్ స్టేట్స్ టెన్నిస్ అసోసియేషన్ (USTA) నిర్వహిస్తుంది. యుఎస్ ఓపెన్ చైర్‌పర్సన్ పాట్రిక్ గాల్‌బ్రైత్. టిక్కెట్ల విక్రయాలు, స్పాన్సర్‌షిప్‌లు, టెలివిజన్ కాంట్రాక్టుల ద్వారా వచ్చే ఆదాయాన్ని యునైటెడ్ స్టేట్స్‌లో టెన్నిస్‌ను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.
ఈ టోర్నమెంటు, 1971 నుండి 2021 వరకు, సింగిల్స్ మ్యాచ్‌లోని ప్రతి సెట్ లోనూ ప్రామాణిక టైబ్రేకర్‌లను (ఏడు పాయింట్లు రావాలి, తేడాతో రెండు ఉండాలి) ఉపయోగిస్తూ వచ్చింది.[2] 2022 నుండి, చివరి సెట్‌లో కొత్త టైబ్రేక్ నియమాలు చేర్చారు. మ్యాచ్ చివరి సెట్‌లో (మహిళలకు మూడవది, పురుషులకు ఐదవది) స్కోరు ఆరు-ఆరు వద్ద ఉన్నపుడు, పొడిగించిన టైబ్రేకర్ (గెలుపొందేందుకు పది పాయింట్లు రావాలి, రెండు పాయింట్ల ఆధిక్యం ఉండాలి) ఆడుతున్నారు.
Remove ads
1978 నుండి 2019 వరకు, యుఎస్ ఓపెన్‌ను ప్రో డెకోటర్ఫ్ అని పిలిచే హార్డ్‌కోర్ట్ ఉపరితలంపై ఆడేవారు. ఇది అనేక పొరలున్న కుషన్డ్ ఉపరితలం. ఇంటర్నేషనల్ టెన్నిస్ ఫెడరేషన్ దీన్ని మీడియం-ఫాస్ట్ అని వర్గీకరించింది.[3] ప్రతి ఆగస్టులో టోర్నమెంటు ప్రారంభానికి ముందు, కోర్టుల ఉపరితలాన్ని మళ్లీ తయారుచేస్తారు.[4]
ఆటగాళ్లు, ప్రేక్షకులు, టెలివిజన్ వీక్షకులు అందరికీ బంతి సులభంగా కనబడేందుకు గాను, 2005 నుండి, యుఎస్ ఓపెన్ సిరీస్ లోని టెన్నిస్ కోర్టులన్నిటి లోనూ లైన్‌ల లోపల నీలం రంగు ("యుఎస్ ఓపెన్ బ్లూ" అని దీనికి ట్రేడ్‌మార్కు తీసుకున్నారు) పెయింట్ వేస్తున్నారు.[5] లైన్ల వెలుపల ఉన్న ప్రాంతాన్ని "యుఎస్ ఓపెన్ గ్రీన్" అనే పెయింట్ వేస్తారు.[5]
Remove ads
పాయింట్, ప్రైజ్ మనీ పంపిణీ
సంవత్సరాలుగా యుఎస్ ఓపెన్‌లో పురుషులు ( ATP ), మహిళల ( WTA ) ర్యాంకింగ్ పాయింట్లు మారుతూ ఉన్నాయి. ఒక్కో ఈవెంటుకు ఉన్న ర్యాంకింగ్ పాయింట్‌లను చూపే పోటీల కోసం పట్టికల శ్రేణి క్రింద ఉంది:
సీనియర్
నగదు బహుమతి
2023 యుఎస్ ఓపెన్ మొత్తం ప్రైజ్ మనీ $65,000,020. ఇది గ్రాండ్ స్లామ్‌లన్నిటి లోకీ అతిపెద్ద మొత్తం. టోర్నమెంటు చరిత్రలోనే ఇది అతి పెద్దది. ప్యాకేజీ క్రింది విధంగా విభజించబడింది:[6]
ఈవెంట్ | వి | ఫై | సెఫై | క్వాఫై | రౌండ్ 16 | రౌండ్ 32 | రౌండ్ 64 | Round of 128 | Q3 | Q2 | Q1 |
సింగిల్స్ | $3,000,000 | $1,500,000 | $775,000 | $455,000 | $284,000 | $191,000 | $123,000 | $81,500 | $45,000 | $34,500 | $22,000 |
డబుల్స్ | $700,000 | $350,000 | $180,000 | $100,000 | $58,000 | $36,800 | $22,000 | N/A | N/A | N/A | N/A |
మిక్స్‌డ్ డబుల్స్ | $170,000 | $85,000 | $42,500 | $23,200 | $14,200 | $8,300 | N/A | N/A | N/A | N/A | N/A |
ప్రస్తుత ఛాంపియన్లు
|
Remove ads
రికార్డులు




Remove ads
గమనికలు
మూలాలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads