లాహోర్
From Wikipedia, the free encyclopedia
Remove ads
లాహోర్ Lahore (ఉర్దూ: لاہور, పంజాబీ: لہور, పాకిస్తాన్ నగరం, "పాకిస్తాన్ పంజాబ్" రాష్ట్రానికి రాజధాని. పాకిస్తాన్ లో కరాచీ తరువాతి అధిక జనాభా గల నగరం. దీనిని 'పాకిస్తాన్ హృదయం' అనికూడా అంటారు. ఇది రాజకీయ, సాంస్కృతిక, విద్యా వైజ్ఞాన కేంద్రం. దీనికి 'మొఘలుల తోట' అని కూడా అంటారు, ఇలా పిలవడానికి కారణం, మొఘలుల వారసత్వాలు ఇక్కడ ఎక్కువ. ఈ నగరం రావీ, వాఘా నదుల ఒడ్డున, భారత్-పాకిస్తాన్ సరిహద్దున గలదు.
ఇక్కడి నిర్మాణాలు మొఘలుల శైలులలో ఉన్నాయి. ఉదాహరణకు బాద్షాహీ మస్జిద్, 'అలీ హుజ్విరి', లాహోర్ కోట, షాలిమార్ తోటలు, జహాంగీర్ సమాధి, నూర్జహాన్ సమాధి. ఇవి పర్యాటకులకు విశేషంగా ఆకర్షిస్తాయి.
ఈ నగర ప్రధాన భాష పంజాబీ, ఉర్దూ, ఇంగ్లీషు. అధిక ప్రజలు "లాహోరీ పంజాబీ" (పంజాబీ, ఉర్దూల సమ్మేళనం) మాట్లాడుతారు. 2006 లో ఈ నగర జనాభా ఒక కోటిని దాటింది.[2] దక్షిణాసియాలో ఐదవ పెద్ద నగరంగానూ, ప్రపంచంలో 23వ నగరం గానూ స్థానం పొందింది.
"సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా" గేయ రచయిత ఇక్బాల్ లాహోర్ కు చెందిన వాడే.
Remove ads
సోదర నగరాలు
లాహోర్ కు క్రింది సోదర నగరాలు గలవు:
బెల్గ్రేడ్, సెర్బియా (2007).[3]
ఇస్తాంబుల్, టర్కీ (1975).[4][5]
సరివోన్, నార్త్ కొరియా (1988).[4]
జియాన్, చైనా (1992).[4][5]
కోర్టిర్జ్క్, బెల్జియం (1993).[4]
ఫెజ్, మొరాకో (1994).[4][5]
కార్డోబా, స్పెయిన్ (1994).[4][6]
సమర్ఖండ్, ఉజ్బెకిస్తాన్ (1995).[4]
ఇస్ఫహాన్, ఇరాన్ (2004).[4]
మస్ హద్, ఇరాన్ (2006).[4][5]
గ్లాస్గో, స్కాట్లాండ్ (2006).[4][5]
చికాగో, ఇల్లినాయిస్ (2007).[4][7][8]
దుషాంబే, తజికిస్తాన్.[5]
ఫ్రెస్నో, కాలిఫోర్నియా.[5]
Remove ads
దేవాలయాలు
- లవ దేవాలయం: లాహోర్ కోటలో ఉన్న హిందూ దేవాలయం. హిందూ మతానికి చెందిన రాముడి కుమారుడైన లవునికి అంకితం చేయబడిన దేవాలయం. సిక్కు కాలం నాటి కాలానికి చెందినది.
ఇవీ చూడండి
- ప్రపంచ నగరాలు
- ది గ్రేట్ గామా
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads