వ్యాధి

ఇది జీవులను ప్రతికూలంగా ప్రభావితం చేసే అసాధారణ పరిస్థితి From Wikipedia, the free encyclopedia

వ్యాధి
Remove ads

అనారోగ్య పరిస్థితిని వ్యాధి లేదా రోగము (లాటిన్ Morbus, ఫ్రెంచి Maladie, జర్మన్ Krankheit, స్పానిష్ Enfermedad, ఆంగ్లం Disease) అంటారు. వ్యాధులు కలుగకుండా మన శరీరంలోని రోగ నిరోధక శక్తి మనల్ని కాపాడుతుంది.

Thumb
వ్యాధికారక సూక్ష్మక్రిములు

వ్యాధి కారణాలు

చాలా రకాల వ్యాధులకు కారణాలు తెలియదు. కొన్ని వ్యాధులు వివిధ రకాలైన కారణాల వలన కలుగవచ్చు. కొన్ని మనలోనే అంతర్గతంగా ఉంటే, కొన్ని బాహ్య కారణాలుగా ఉంటాయి. జన్యు సంబంధమైనవి అంతర్గత కారణాలు. పోషకాహార లోపాలు, వాతావరణంలోని కారకాలు, వ్యాధికారక క్రిమికీటకాదులు బాహ్య కారణాలు. కొన్ని వ్యాధులలో ఈ రెండు కారకాల పాత్ర ఉంటుంది.

వ్యాధి కారకాలను సంఘ, మానసిక, రసాయన, జీవ కారకాలుగా వర్గీకరించవచ్చును. కొన్ని కారకాలు ఒకటి కంటే ఎక్కువ తరగతులలో ఉండవచ్చును. ఉదాహరణకు వాతావరణంలో జీవ, రసాయన కారకాలు రెండూ ఉండవచ్చును.

Remove ads

వ్యాధుల వ్యాప్తి

ఒకరి నుండి మరొకరికి వ్యాప్తి చెందే వ్యాధులు - అంటువ్యాధులు. ఇవి వైరస్, బాక్టీరియా,ఫంగస్, ఇతర పరాన్న జీవుల (parasites) వలన సంక్రమిస్తాయి. జలుబు, క్షయ, తామర, పొట్టపురుగులు వీటికి ఉదాహరణలు. ఈ వ్యాధులు వివిధ రకాలుగా వ్యాప్తిచెందుతాయి. కొన్ని గాలి ద్వారా, కొన్ని కీటకాల ద్వారా, కొన్ని మురికి నీరు లేదా అపరిశుభ్రమైన ఆహారం ద్వారా, మరికొన్ని స్పర్శ(touch) వలన, సెక్స్ ద్వారా వ్యాపిస్తాయి. ఈ విధమైన వ్యాప్తిని మనం చాలా వరకు నివారించవచ్చును.

రకాలు

Remove ads

వ్యాధుల నివారణ

కొన్ని రకాల వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం ద్వారా వీటి నుండి మనల్ని రక్షించుకోవచ్చును. దీనినే వ్యాధి నివారణ (Disease Prevention) అంటారు. వ్యాధి వచ్చిన తర్వాత వైద్యం (Treatment) చేసుకోవడం కన్నా ఇది చాలా విధాలుగా ఉత్తమమైన పద్ధతి.

ఇవి కూడా చూడండి

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads