శబల (ఖండ కావ్యం)

From Wikipedia, the free encyclopedia

Remove ads

శబల కవిలెంక తుమ్మల సీతారామమూర్తి చౌదరి రచించిన ఖండకావ్యం

త్వరిత వాస్తవాలు కృతికర్త:, దేశం: ...

రచన నేపథ్యం

శబల గ్రంథం తెనుగు లెంక, అభినవ తిక్కన బిరుదాంకితుడైన తుమ్మల సీతారామమూర్తి చౌదరి 25.3.1955లో తొలిముద్రణ పొందింది. భారతి ప్రెస్ (తెనాలి)లో ప్రచురించారు.

ఇతివృత్తం

శబల ఖండకావ్యం వివిధ పద్యకావ్య ఖండాల సంకలనం. శబల, సంక్రాంతి తలపులు, నా కథ-సీత, పశువైద్యం తదితర కావ్యఖండాలు ఈ కావ్యంలో ఉన్నాయి. అవన్నీ వేర్వేరు ఇతివృత్తాలను స్వీకరించి రచించినవి. సంక్రాంతి తలపులు కావ్యఖండంలో రైతు జీవితమును వర్ణించారు. నా కథ - సీత శీర్షికన రచించిన కావ్యఖండానికి సీతాదేవి తన కథను తాను చెప్పుకోవడం ఇతివృత్తం.

ఉదాహరణలు

  • ఘోర కదన వ్యాపార పారీణులై నుతికింజాలిన భూసురుల్గలరె తెన్గుం గడ్ద వర్జించినన్
  • రైతు పుచ్చిన కొయ్యలో జిగురు పుట్టు నటుల్ వలి పాట పాడునని వ్రాసారు తుమ్మల వారు.

ఇతరుల మాటలు

  • ఈ కావ్యము పేరు సంక్రాంతి తలపులు (శబల గ్రంథంలో ఒక భాగం). ఇది నేటి యాంధ్ర భాషా కవిత్వములో శిరోభూషణమైన కవితా ఖండము.
- విశ్వనాథ సత్యనారాయణ, సుప్రతిష్ఠుడైన కవి, రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads