శివమొగ్గ
From Wikipedia, the free encyclopedia
Remove ads
శివమొగ్గ లేదా షిమోగా (కన్నడం:ಶಿವಮೊಗ್ಗ), కర్ణాటక రాష్ట్రం, శివమొగ్గ జిల్లా లోని నగరం.ఇది అదే జిల్లాకు ముఖ్యపట్టణం. ఇది తుంగ నది ఒడ్డున ఉంది. "శివ ముఖ" (శివుని ముఖం) అనే పదం నుండి "శివమొగ్గ" పదం వచ్చిందంటారు. "సిహి మోగె" (తీపి కుండ) నుండి కూడా ఈ పేరు వచ్చిందంటారు. 16వ శతాబ్దంలో "కేలడి" నాయకుల పాలనా కాలంలో ఈ పట్టణం ప్రాముఖ్యతను సంతరించుకొంది. శివప్ప నాయకుని కాలం ఈ నగరం చరిత్రలో సువర్ణఘట్టం. తరువాత మైసూరు రాజ్యంలో భాగంగా ఉంది. 2006 నవంబరు 1 న అధికారికంగా ఈ నగరం, జిల్లా పేరును "షిమోగా"నుండి "శివమొగ్గ"గా మార్చారు.
Remove ads
జిల్లా సరిహద్దులు

ఈ జిల్లాకు తూర్పున దావణగెరి జిల్లా, ఆగ్నేయాన చిక్‌మగళూరు జిల్లా, నైరుతిన ఉడిపి జిల్లా, వాయువ్యాన ఉత్తర కన్నడ జిల్లా, ఈశాన్యాన హవేరి జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి.
రవాణా సౌకర్యాలు
రైలు రవాణా
ఈ జిల్లాలో ఆగ్నేయం నుండి వాయువ్యం వరకు భద్రావతి, హర్నహళ్ళి, కుంసి, ఆనందపురం, సాగర్ ల మీదుగా తల్గుప్ప వరకు ఒక రైలు మార్గం ఉంది.
రోడ్డు రవాణా
ఈ జిల్లాలో ప్రధాన పట్టణాలను కలుపుతూ ముఖ్య రహదారులున్నాయి.13వ నెంబరు జాతీయ రహదారి, 206వ నెంబరు జాతీయ రహదారులు ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి. ఈ జిల్లాలో మొత్తం 6632 కిలోమీటర్ల రోడ్డు మార్గం ఉండగా అందులో 222 కిలోమీటర్లు జాతీయ రహదారులు. 402 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులు కూడా ఈ జిల్లా గుండా వెళ్తున్నాయి.
వాయు రవాణా
ప్రస్తుతానికి వాయు రవాణా ఈ జిల్లాలో లేనప్పటికీ శివమొగ్గ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో సొగానె వద్ద విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు.
Remove ads
పరిశ్రమలు
- దేశంలోని ముఖ్య ఇనుము-ఉక్కు పరిశ్రమలలో ఒకటైన విశ్వేశ్వరయ్య ఇనుము-ఉక్కు పరిశ్రమ ఈ జిల్లాలో ఈశాన్యాన భద్రావతి వద్ద ఉంది. ఈ పారిశ్రామిక పట్టణంనకు మంచి రైలు, రోడ్డు సౌకర్యం ఉంది. ఇంజనీరు మోక్షగుండం విశ్వేశ్వరయ్య మార్గదర్శకాలపై ఏర్పడిన ఈ కర్మాగారపు ప్రారంభనామం మైసూర్ ఇనుము-ఉక్కు పరిశ్రమ. ప్రస్తుతం ఈ పరిశ్రమ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా అధీనంలో పనిచేస్తుంది.
- భద్రావతిలోనే మరో ముఖ్యమైన పరిశ్రమ భద్రావతి పేపర్ మిల్స్ లిమిటెడ్. ISO 14001 ధృవపత్రం పొందిన ఈ కంపెనీ అన్నిరకాల పేపరును ఉత్పత్తి చేయుటలో ప్రసిద్ధి.
- ఇవే కాకుండా పలు వ్యవసాయ ఆధారిత, ఇంజనీరింగ్ ఉత్పత్తుల, ఆటోమోబైల్, ఆహార, పానీయాలకు సంబంధించిన పారిశ్రామిక యూనిట్లు ఈ జిల్లాలో కలవు.
ముఖ్య పట్టణాలు
- శివమొగ్గ
- సోరబ్
- శికారిపుర
- హోసనగర
- అంజనపుర
- తీర్థహళ్ళి
- భద్రావతి
- తుంగ
అవీ ఇవీ
- కర్ణాటక ముఖ్యమంత్రి బి.ఎస్.యడ్యూరప్ప ప్రాతినిధ్యం వహిస్తున్న శికారిపుర అసెంబ్లీ నియోజకవర్గం ఈ జిల్లాలోనే ఉంది.
- భారత క్రికెట్ జట్టు తరఫున ఆడిన ప్రముఖ క్రికెట్ ఆటగాడు గుండప్ప విశ్వనాథ్ ఈ జిల్లాలోని భద్రావతిలో జన్మించాడు.
- జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత యు.ఆర్.అనంతమూర్తి తీర్థహళ్ళి తాలుకాలోని మెలిగె గ్రామంలో జన్మించాడు.
- శరావతిలోయ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం సాగర్ తాలుకాలో ఉంది.
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads