పిన్‌కోడ్

భారతదేశంలో వాడే పోస్ట్ కోడ్ పద్ధతి From Wikipedia, the free encyclopedia

పిన్‌కోడ్
Remove ads

పిన్‌కోడ్ (ఆంగ్లం : Postal Index Number లేదా PIN లేదా Pincode) తపాలా సూచిక సంఖ్య. ఈ విధానం భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టబడింది.దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (Unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (Postal Regions) గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.

Thumb
తపాలా పెట్టె, దీనిపై 'పిన్‌కోడ్' గలదు.
Remove ads

నిర్మాణం

భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడ్ ప్రాంతాలు గలవు. పిన్‌కోడ్ లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి.భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.ఉదాహరణకు 533222 అనే పిన్కోడ్లో 5 - జోన్, 3 - సబ్ జోన్, 3 - జిల్లా, 222- వ్యక్తిగత తపాలా కార్యాలయం సూచిస్తాయి.

ఉదా:- ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్నాటక రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే ఢిల్లీ అన్నమాట. 20 నుంచి 28 వరకు ఉత్తర ప్రదేశ్‌, 29ను ఉత్తరాంచల్‌కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్కి 50 నుంచి 53, కర్నాటకకి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (Cluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే వరంగల్‌. 500 అంటే హైదరాబాద్‌. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. అమెరికాలో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.

మరింత సమాచారం పిన్‌కోడులో గల మొదటి 2 అంకెలు, తపాలా సర్కిల్ ...
Remove ads

ఇవీ చూడండి

మూలాలు

బయటి లింకులు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads