సప్తస్వరాలు (సినిమా)

From Wikipedia, the free encyclopedia

సప్తస్వరాలు (సినిమా)
Remove ads

సప్తస్వరాలు నటుడు కాంతారావు నిర్మాతగా, హీరోగా 1969లో తీసిన చిత్రం. పౌరాణిక పాత్రలతో కూడిన జానపద చిత్రం.

త్వరిత వాస్తవాలు సినిమా పోస్టర్, దర్శకత్వం ...
Remove ads

కథ

అజ్ఞానం మూలంగా మానవ లోకం అన్యాయాలు, అక్రమాలు, వాటి వల్ల ఏర్పడే సమస్యలతో సతమతమవుతూండడం చూసి నారదుడు (రామకృష్ణ), గంధర్వుడు (కాంతారావు) సరస్వతీ దేవి(విజయనిర్మల)కి మొరపెట్టుకుంటారు. దాంతో ఆమె ఓ శారదా పీఠాన్ని ఇచ్చి మనషుల అజ్ఞానాన్ని రూపుమాపి, లోక కళ్యాణం చేయమని చెప్పి పంపుతుంది. వైజయంతి (విజయలలిత) వ్యామోహంలో పడి గంధర్వుడు ఆ శారదా పీఠాన్ని పోగొట్టడంతో ఆగ్రహించిన నారదుడు భూలోకానికి వెళ్ళి నరుడిగా ఆ బాధలు అనుభవించమని శాపం ఇస్తాడు.

అలా శాపగ్రస్తుడైన గంధర్వుడు భూలోకంలో ముత్యపుచిప్పలో ఒక సంగీతవేత్త (చిత్తూరు నాగయ్య)కి దొరుకగా సారంగ అన్న పేరు పెట్టి, పెంచుతూ సంగీతం నేర్పుతూంటాడు. మరో ముత్యపుచిప్పలో మహారాజు (ధూళిపాళ)కి ఓ ఆడ శిశువు దొరుకగా దేవ మనోహరి అని పేరుపెట్టి, నాట్యం నేర్పుతూంటాడు. పెరిగి పెద్దవాడైన సారంగ, జయంతి (రాజశ్రీ)ని ప్రేమిస్తాడు. ఈ విషయం తెలిసిన తండ్రి తను సంగీతం ఏ లక్ష్యంతో నేర్పిస్తున్నాడో చెప్తాడు. ఆ లక్ష్యమేంటంటే - స్వర్గం నుంచి భూమికి పతనమైపోయి సోపాన మండపం మీదున్న శారదా పీఠాన్ని సాధించడం. తను అయోనిజుడు కావడం, సంగీత వేత్త కావడంలో సమస్య లేదు కానీ తన సర్వస్వమైన జయంతిని వదిలి బ్రహ్మచర్యం ఎలా ఉండడం అన్న సంకటంలో పడతాడు.

ఆ సమయంలోనే మానవ జాతి సంతోషకరంగా ఉంటే నచ్చని తాంత్రిక విద్యల మాంత్రికుడు అభేరి (సత్యనారాయణ) శారదా పీఠం చేజిక్కించుకుని లోకాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తాడు. సారంగుడు పలు కష్టాలు అధిగమించి శారదా పీఠాన్ని సంపాదించి గురువుకు అందిస్తాడు. జయంతిని వివాహం చేసుకోవటంతో రాకుమారి, మహారాజు సంతసిస్తారు. ఈ క్రమంలోనే మాంత్రికుడు కూడా అంతంకావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.

Remove ads

సాంకేతిక వర్గం

  • కథ, మాటలు - వీటూరి
  • పాటలు - సి.నారాయణరెడ్డి, వీటూరి
  • నేపథ్యగానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల. పి.బి. శ్రీనివాస్, ఏ.వీ.ఎన్ మూర్తి, విజయలక్ష్మి కాంతారావు
  • సంగీతం - టి.వి.రాజు
  • ఛాయాగ్రహణం - అన్నయ్య
  • ట్రిక్ ఛాయాగ్రహణం - ఎస్.ఎస్.లాల్
  • స్టంట్: మాధవన్
  • కొరియోగ్రఫీ: వెంపటి సత్యం, కె.ఎస్.రెడ్డి
  • నృత్యాలు - వెంపటి సత్యం
  • కళా దర్శకత్వం - బి.ఎన్.కృష్ణ
  • నిర్మాత: కాంతారావు
  • దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య

నటీనటులు

పాటలు

  1. అదే నీవంటివి అదే నేవింటిని గుండె అలలాగ చెలరేగ - ఘంటసాల,సుశీల - రచన: డా॥ సినారె
  2. ఓం నమో వేదాంత వేద్యాయ మేఘశ్యామల (సుప్రభాతం) - బృందం
  3. కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్ధలే కౌస్తుభం (శ్రీకృష్ణ కర్ణామృతం నుండి) - ఘంటసాల
  4. కృష్నయ్యా గడసరి కృష్ణయా గోపెమ్మా సొగసరి గోపెమ్మా - సుశీల, ఘంటసాల - రచన: డా॥ సినారె
  5. ఛమ్ ఛమ్ ఛమ్మచెక్క సైసై సై చక్కని చుక్క ఇది ఏ వంకలు - విజయలక్ష్మి కన్నారావు బృందం
  6. జయ జయ మహా రుద్ర ( దండకం ) - ఎ.వి. ఎన్. మూర్తి బృందం
  7. డెందము దోచిన నందకిషోరుడు ఎందు దాగెనో - ఘంటసాల - రచన: డా॥ సినారె
  8. నాథమే వేదసారం ఆనంద - ఎ.వి. ఎన్. మూర్తి, ఎస్. జానకి, ఘంటసాల - రచన: డా॥ సినారె
  9. నిను గన్న కనులె కనులు స్వామి నీవున్న తావులె బృందావనులు - సుశీల
  10. యా కుందేందు తుషారహార ధవళ యా శుభ్రవస్త్రా (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్
  11. యదుబాల శ్రితజనపాల దరిశనమీవయ గోపాల - ఘంటసాల బృందం - రచన: వీటూరి
  12. సారంగ తొలుత నీ రమణీయ రూపమే కన్నాను (పద్యం) - సుశీల
  13. సా సకల ధర్మాలలో సర్వతమోత్తమదేది ( సంవాద పద్యాలు) - విజయలక్ష్మి కన్నారావు,ఘంటసాల , రచన: వీటూరీ
  14. హాయిగా పాడనా గీతం జగములు పొగడగ జేజేలు - పి.బి. శ్రీనివాస్,ఘంటసాల - రచన: వీటూరి
Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads