సురినామ్

From Wikipedia, the free encyclopedia

సురినామ్
Remove ads

సురినామ్ (ఆంగ్లం : Suriname) [2] అధికారిక నామం, రిపబ్లిక్ ఆఫ్ సురినామె. ఇది దక్షిణ అమెరికా లోని ఉత్తర భాగాన గల దేశాలలో ఒక చిన్న దేశం.సురినామ్‌ తూర్పుసరిహద్దులో గయానా , దక్షిణసరిహద్దులో బ్రెజిల్ ఉన్నాయి. 1,65,000 చ.కి.మీ. వైశాల్యం ఉన్న సురినామ్‌ దక్షిణ అమెరికాలో అతిచిన్న దేశగా గుర్తించబడుతుంది. [note 1] ఐక్యరాజ్యసమితి గణాంకాల ఆధారంగా సురినామెలో ప్రజలు ఉత్తర తీరంలో రాజధాని , అతిపెద్ద నగరం అయిన " పారామరాయిబో " నగరంలో , పరిసరప్రాంతాలలో నివసిస్తున్నారు.

త్వరిత వాస్తవాలు రిపబ్లియెక్ సురినామె (Republiek Suriname)సురినామ్ గణతంత్రం, అతి పెద్ద నగరం ...

ఈప్రాంతంలో నిరంతరంగా విభిన్న సంస్కతి కలిగిన పలు స్థానిక తెగలకు చెందిన ప్రజలు నివసించేవారు. 17 వ శతాబ్దం చివరలో డచ్ పరిపాలన కిందకు రావడానికి ముందు సురినామే ప్రాంతం మీద ఆధిపత్యం కొరకు యూరోపియన్ అన్వేషణా శక్తులు పోటీ పడ్డాయి. 1954 లో, ఈ దేశం నెదర్లాండ్స్ రాజ్యానికి చెందిన " రాజ్యాంగ దేశాలలో "లో ఒకటిగా మారింది. నవంబరు 25, 1975 న " సురినామ్ దేశం నెదర్లాండ్స రాజ్యం నుండి విడిపడి స్వతంత్ర దేశంగా అవతరించింది. అయినప్పటికీ నెదర్లాండు పూర్వ కాలనీలతో సన్నిహితమైన ఆర్థిక, దౌత్య , సాంస్కృతిక సంబంధాలు కొనసాగించింది. దేశంలోని స్థానిక ప్రజలు భూ హక్కులరక్షణ , వారి సాంప్రదాయ భూములు , ఆవాసాలను కాపాడటానికి పనిచేస్తున్నారు.

సురినామే సాంస్కృతికంగా కరేబియన్ దేశంగా పరిగణించబడుతుంది. " కరేబియన్ కమ్యూనిటీ " సభ్యదేశంగా ఉంది. అధికారిక భాషగా డచ్ భాష ప్రభుత్వ వ్యాపార, మాధ్యమ , విద్యబోధనకు ఉపయోగించబడుతుంది. స్రానన్ టోనో, ఇంగ్లీష్ భాష - ఆధారిత ఇంగ్లీష్ క్రియోల్ భాష విస్తృతంగా ఉపయోగించే లింగ ఫ్రాంకా భాషలు వాడుకలో ఉన్నాయి. ఐరోపా వెలుపల ఉన్న దేశాలలో సురినామెలో మాత్రమే డచ్ అధికగా వాడుకభాషగా ఉంది. సురినామె ప్రజలు ప్రపంచంలో చాలా విభిన్నమైనవరిగా పలు జాతి, మత, , భాషా సమాహార సమూహంగా ఉన్నారు.

Remove ads

పేరువెనుక చరిత్ర

ఈ ప్రాంతం యూరోపియన్ రాకకు ముందు వివిధ సంస్కృతులకు చెందిన ప్రజలచే ఆక్రమించబడింది. ఈ ప్రాంతంలోని వీరప్పై సమీపంలో ఉన్న పెట్రోగ్లిఫ్ ప్రదేశాలలో , సురినామ్‌లోని ఇతర ప్రదేశాలలో కనుగొనబడిన అవశేషాలు ఇందుకు సాక్ష్యంగా ఉన్నాయి. యురేపియన్లు ఈప్రాంతానికి చేరిన సమయంలో ఇక్కడ నివసిస్తున్న అరవాకన్ భాష మాట్లాడే టైనో ప్రజలు ఈప్రాంతాన్ని సురినేన్ అని పిలిచేవారు.[3] ఈప్రాంతం లోని మార్షల్ క్రీక్ వద్ద బ్రిటిష్ సెటిలర్లు మొదటి యురేపియన్ కాలనీ నిర్మించారు.[4] సురినామె నదీతీరంలో ఉన్న ప్రమ్ంతాన్ని సురినామ్‌ అని పిలిచారు.డచ్ ఈప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత ఈప్రాంతం ఇది డచ్ గయానాలో భాగంగా మారింది.1978లో దేశం అధికారిక ఆగ్లనామం సురినామ్‌ నుండి సురినామెగా మార్చబడింది. అయినప్పటికీ సురినామ్‌ ఇప్పటికీ వాడుకలో ఉంది. ఉదాహరణగా సురినామ్‌ ఎయిర్వేస్ , సురినామ్‌ నేషనల్ ఎయిర్ లైన్ ఇందుకు ఉదాహరణగా ఉన్నాయి.

Remove ads

చరిత్ర

Thumb
Maroon village, along Suriname River, 1955

సురినామెలో క్తీ.పూ 3000లో స్థానికజాతిప్రజలు నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసించారు.వీరిలో వేట , చేపల వేట ఆధారంగా నివసించిన సంచార తెగకు చెందిన అరవాక్ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఉన్నారు.వీరు అధికంగా సముద్రతీరాలలో నివసించారు. ఈ ప్రాంతంలో నివసించిన మొదటి మానవజాతిగా వీరు గుర్తించబడుతున్నారు. తరువాత నివసించిన కలీనా ప్రజలు వారి యుద్ధనౌకల శక్తితో అరవాక్ ప్రజల మీద విజయం సాధించారు. వారు " మార్గోజిన్ నది " ముఖద్వారంలో ఉన్న గలిబి ("కుపాలి యిమి," అంటే "పితరుల చెట్టు") లో స్థిరపడ్డారు. అరావాక్ , కారిబ్ తెగలు సముద్రతీరం , సవన్నాల వెంట నివసించించారు. చిన్నచిన్న సమూహాలకు చెందిన అకురియో, ట్రో, వారూ , వాయనా తగలకు చెందిన ప్రజలు వర్షారణ్య దీవిలలో నివసించారు.

కాలనీ పాలన

Thumb
Presidential Palace of Suriname

16 వ శతాబ్దం ప్రారంభంలో కింగ్డమ్ ఆఫ్ ఫ్రాన్స్ (ఫ్రెంచి) , హాబ్స్బర్గ్ స్పెయిన్ (స్పెయిన్) , కింగ్డమ్ ఆఫ్ ఇంగ్లండ్ (ఇంగ్లాండు) అన్వేషకులు ఈ ప్రాంతాన్ని సందర్శించారు. ఒక శతాబ్దం తరువాత డచ్ , కింగ్డమ్ ఆఫ్ ఇంగ్లండ్ (ఇంగ్లీష్) సెటిలర్లు సారవంతమైన గయానా మైదానాలలోని అనేక నదీ తీరాలలో తోటలను , కాలనీలను స్థాపించారు. సురినామ్ నదీ తీరంలో ఆంగ్లేయుల చేత నిర్మించబడిన " మార్షల్స్ క్రీక్ " అనే పేరుగల ఇంగ్లీష్ కాలనీ గయానాలో నమోదు చేయబడిన మొదటి కాలనీగా భావిస్తున్నారు.[4]

ఈ భూభాగంపై నియంత్రణ కోసం డచ్ , ఆంగేయుల మధ్య వివాదాలు సంభవించాయి. 1667 లో చర్చల ఫలితంగా జరిగిన " బ్రీడా ఒప్పందం (1667) "కు డచ్ వారు ఇంగ్లీష్ నుండి సురినామ్ నస్కెంట్ తోటల కాలనీని స్వంతం చేసుకున్నారు. ఇంగ్లీష్ ఉత్తర అమెరికాలో మద్య అట్లాంటిక్ తీరానికి సమీపంలో ఉన్న మునుపటి " న్యూ నెదర్ల్యాండ్ " కాలనీలో ప్రధాన నగరమైన న్యూ ఆంస్టర్‌డాంను స్వంతం చేసుకుంది. ఆ రోజుల్లో ఇప్పటికే సాంస్కృతిక , ఆర్థిక కేంద్రంగా ఉన్న నగరానికి ఆగ్లేయులు " డ్యూక్ ఆఫ్ యార్క్ " గౌరవార్ధం " న్యూయార్క్ " పేరు పెట్టారు.

1683 లో అంస్టర్‌డాం నగరంలో " కర్నేలిస్ వాన్ ఆర్స్సేన్ వాన్ సమ్వెల్స్డిజెక్ " కుటుంబం , " డచ్ వెస్ట్ ఇండియా కంపెనీ" " సొసైటీ ఆఫ్ సురినామె " స్థాపించింది. సొసైటీ కాలనీని నిర్వహించడానికి , రక్షించడానికి నిధిసహాయం అందించింది. కాలనీ రైతులు నదీతీరాలలో కాఫీ, కోకో, చెరకు , పత్తి తోటల పనిచేయడానికి ఆఫ్రికా బానిసలను ఉపయోగించుకున్నారు. ప్లాంటర్స్‌ బానిసల పట్ల వ్యవహరిస్తున్న తీరు పలువురి విమర్శలకు గురైంది.[5] పలువురు బానిసలు ప్లాంటేషన్ల నుండి తప్పించుకుని పారిపోయారు.

పరిసరప్రాంతాలలోని వర్షారణ్యాలలో నివసిస్తున్న అమెరికా స్థానిక ప్రజల సహాయంతో పారిపోయిన బానిసలు లోతట్టు భూభాగంలో ప్రత్యేకమైన నూతన సంస్కృతిని విజయవంతంగా స్థాపించారు.వీరిని ఆగ్లేయులు మరూంస్ అని, ఫ్రెంచ్ వారు "నెగ'మరోన్స్" (సాహిత్యపరంగా "గోధుమ నీగ్రోస్" అని అర్ధం, ఇది "లేత చర్మం గల నీగ్రోస్" అని అర్థం)అని , డచ్‌ వారు మారోంస్ అనిపిలిచారు. మారినోలు క్రమంగా ఎథొనోజెనిసిస్ ప్రక్రియ ద్వారా అనేక స్వతంత్ర తెగలలను అభివృద్ధి చేశారు. వారిలో వివిధ ఆఫ్రికన్ జాతులకు చెందిన బానిసలు ఉన్న కారణంగా వారు విభిన్న తెగలను సృష్టించారు. ఈ గిరిజనలలో సారంకా పరామకా, నడికా ప్రజలు లేదా అఖన్, క్విన్టి, అలుకు లేదా బోనీ , మాటావాయి అనే ఉపజాతులు ఉన్నాయి.

Thumb
Waterfront houses in Paramaribo, 1955

మహిళలు ప్లాంటేషన్ల మీద దాడి చేసి బానిసల నుండి కొత్త సభ్యులను చేర్చికోవడం , మహిళలను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించారు. అలాగే ఆయుధాలు, ఆహారం , ఇతర సరఫరాలను పొందటానికి తోటలపై దాడి తోడ్పడింది.వార దాడులలో కొన్నిసార్లు దాడులలో రైతులు , వారి కుటుంబాలు హత్యకు గురైయ్యారు. వలసరాజ్యాలు నిర్మించిన రక్షణ వలయాలు 18 వ శతాబ్దపు మాప్‌లో చూపించబడ్డాయి కానీ ఇవి సరిపోవు.[6] వలసవాదులు కూడా మరాన్లపై సాయుధ పోరాటం చేశారు. వీరు సాధారణంగా వర్షపు అడవి ప్రవేశించి తప్పించుకుంటూ ఉండేవారు. వార్ వలసవాదుల కంటే మెరుగైన శక్తియుక్తులై ఉండేవారు. కలహాలకు ముగింపు పలకాలని 18 వ శతాబ్దంలో యురోపియన్ కలనియల్ అధికారులు వివిధ తెగలతో పలు శాంతి ఒప్పందాలపై సంతకాలు చేసారు. వారు తమ భూభాగ భూభాగాలలో మౌరిన్స్ సార్వభౌమ హోదా , దేశంలోని అంతర్భాగంలో వర్తక హక్కులను స్వయంప్రతిపత్తిని మంజూరు చేశారు.

బానిసత్వ నిర్మూలన

1861-63లో " అమెరికన్ అంతర్యుద్ధం " , దక్షిణాన బానిసలు యూనియన్ మార్గాల నుండి పారిపోయారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల అధ్యక్షుడు అబ్రహం లింకన్ , అతని పాలనా యంత్రాంగం విదేశాల్లో పర్యటించి యునైటెడ్ స్టేట్స్ వదిలి వెళ్ళాలని అనుకుంటున్న బానిసలను తిరిగి దేశంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నించారు. వారు దక్షిణ అమెరికాలోని సురినామ్ డచ్ కాలనీ వలసరాజ్యానికి ఆఫ్రికన్-అమెరికన్ వలసలకు సంబంధించి డచ్ ప్రభుత్వంతో చర్చలు ప్రారంభించారు. ఈఆలోచన అనుకున్న ఫలితాలను ఇవ్వనందున 1864 తర్వాత ఆలోచన వెనుకకు తీసుకున్నారు.[7] నెదర్లాండ్స్ 1863 లో సురినామ్‌లో బానిసత్వాన్ని రద్దు చేసింది. నెమ్మదిగా కనీసవేతనాలతో 10 సంవత్సరాల ఒప్పందంతో తోటలలో పని చేయడానికి బానిసలతో పనిచేయించుకోవడానికి అవకాశం కల్పించబడింది.ఇది వారి యజమానులకు పాక్షిక నష్టపరిహారంగా పరిగణించబడింది.1873 తరువాత చాలామంది స్వేచ్ఛను పొందిన బానిసలు అత్యధికసంఖ్యలో రాజధాని నగరమైన " పారామరిబో " తోటలలో చేస్తున్న పనివదిలి వెళ్ళారు.

Thumb
Javanese immigrants brought as contract workers from the Dutch East Indies. Picture taken between 1880 and 1900.

తోటల కాలనీగా సురినామ్‌లో ఆర్థిక వ్యవస్థ కార్మిక-ఉత్పాదక వస్తువుల పంటలపై ఆధారపడి ఉంది. కార్మిక కొరత కోసం డచ్ వారు ఇండోనేషియా (డచ్ ఈస్ట్ ఇండీస్) , భారతదేశం (భారతదేశాన్ని పాలిస్తున్న అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అంగీకారంతో) నుండి కార్మికులను ఒప్పంద పద్ధతి ద్వారా పనిచేయడానికి తీసుకుని వచ్చారు.అదనంగా, 19 వ శతాబ్దం చివర , 20 వ శతాబ్దం ప్రారంభంలో చాలా మంది కార్మికులు (ఎక్కువగా పురుషులు) చైనా , మధ్య ప్రాచ్యం నుండి తీసుకురాబడి తోటలలో పనిచేయడానికి నియమించబడ్డారు. సురినామ్ జనాభా చాలా తక్కువగా ఉన్నప్పటికీ ఈ సంక్లిష్టమైన కాలనీకరణ , దోపిడీ కారణంగా జాతిపరంగా , సాంస్కృతికంగా సురినాం వైవిధ్యం కలిగిన దేశాలలో ఒకటిగా మారింది.[8][9]

Thumb
Dutch colonists, 1920. Most Europeans left after independence in 1975.

కాలనీ పాలన నుండి తొలగింపు

రెండవప్రపంచ యుద్ధం సమయంలో 1941 నవంబరు 23న నదర్లాండుతో కుదిరిన ఒప్పందం ఆధారంగా బాక్సిట్ గనులను రక్షించడానికి యుద్ధప్రాతిపదికన యునైటెడ్ స్టేట్స్ సురినామ్‌ను ఆక్రమించింది.[10] యుద్ధం తరువాత నెదర్లాండ్స్ , దాని కాలనీల సంబంధాలలో తలెత్తిన విభేదాల కారణంగా 1942 లో డచ్ ప్రభుత్వాన్ని బహిష్కరించింది.

1954 లో " నెదర్లాండ్స్ ఆంటిల్లెస్ " , " నెదర్లాండ్స్ "తో పాటు సురినామె " కింగ్డం ఆఫ్ నెదర్లాండ్స్ " లోని రాజ్యాంగ దేశాలలో ఒకటి అయ్యింది. ఈ ఏర్పాటులో నెదర్లాండ్స్ సురినామ్‌ రక్షణ , విదేశీ వ్యవహారాల నియంత్రణను నిలుపుకుంది. 1974 లో " నేషనల్ పార్టీ ఆఫ్ సురినాం " (ఎన్.పి.ఎస్) నాయకత్వంలోని స్థానిక ప్రభుత్వం పూర్తి స్వాతంత్ర్యం కొరకు డచ్ ప్రభుత్వంతో చర్చలు జరిపింది.1975 నవంబర్ 25న సురినామ్‌ స్వతంత్రదేశం అయింది.సురినామ్‌లో " క్రియోల్ పీపుల్స్ " ( ఆఫ్రికన్ లేదా మిశ్రమ ఆఫ్రికన్-యురోపియన్) ప్రజలు అధికంగా ఉన్నారు. ఇది 25 నవంబరు 1975 న మంజూరు చేయబడింది. స్వాతంత్ర్యం తరువాత మొదటి దశాబ్దంలో సురినామ్ ఆర్థిక వ్యవస్థకు డచ్ ప్రభుత్వానికి అందించిన విదేశీ నిధిసాయం ఆధారంగా మారింది.

స్వతంత్రం

Thumb
Henck Arron, Beatrix and Johan Ferrier on November 25, 1975

దేశం మొదటి అధ్యక్షుడు " జోన్ ఫెర్రియర్ ", మాజీ గవర్నర్, ఎన్.పి.ఎస్. నాయకుడు " హెన్క్ అరాన్ " ప్రధానమంత్రిగా స్వతంత్ర పాలన మొదలైంది. స్వాతంత్రం కొరకు పోరాడిన కాలంలో దేశానికి స్వాతంత్రం రాక ముందు కంటే స్వతంత్రం వచ్చిన తరువాత దేశపరిస్థితి దిగజారుతుందన్న ఆందోళనతో సురినామ్‌లోని మూడవభాగం ప్రజలు నెదర్లాండ్స్ రాజ్యానికి వలస వెళ్ళారు. వాస్తవానికి సురినామ్‌ రాజకీయాలు దిగజారి జాతి వివక్ష , అవినీతి చోటు చేసుకుంది. ఎన్.పి.ఎస్. నాయకులు పక్షపాత ప్రయోజనాల కోసం డచ్ సహాయం చేసిన డబ్బును ఉపయోగించారు. దాని నాయకులు " సురినామీస్ జనరల్ ఎన్నికలు 1977" మోసం పూరితమైనవని ఆరోపణలు ఎదురయ్యాయి. ఎన్నికలలో అరాన్ అధికారపీఠాన్ని సాధించాడు. అసంతృప్తి అధికరించిన కారణంగా పెద్ద సంఖ్యలో ప్రజలు నెదర్లాండ్స్‌కు పారిపోయి అప్పటికే గణనీయమైన సమిహ్యలో ఉన్న సురినామీస్ కమ్యూనిటీతో చేరిపోయారు.[11]

1982 డిసెంబర్ హత్యలు

1980 ఫిబ్రవరి 25న 16 మంది జార్జెంట్లు " డెసి బౌటర్స్ " నాయకత్వంలో జరిపిన " సైనిక తిరుగుబాటు " ద్వారా అర్రాన్ ప్రభుత్వాన్ని పడగొట్టబడింది. [12] మిలట్రీ పాలన వ్యతిరేకులు 1980 మార్చి 15న 1982 మార్చి 12న తిరుగుబాటుదారులను ఎదుర్కొన్నారు. మొదటి ప్రయనానికి " ఫ్రెడ్ ఆర్ంసర్క్ " నాయకత్వం వహించాడు.[13] రెండసారి " మార్కిస్ట్ - లెనినిస్టులు " తిరుగుబాటుదారులను ఎదుర్కొన్నారు.[14] మూడ మారు " విల్ఫ్రెడ్ హాకర్ " నాయకత్వంలో , నాలుగవ మారు " సురినామె రాంబొకస్ " నాకత్వంలో సైనిక ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నారు.

హాకర్ నాలుగవ కౌంటర్ తిరుగుబాటు ప్రయత్నంలో జైలు నుండి తప్పించుకున్నాడు. కానీ అతను పట్టుబడి , మరణశిక్షకు గురయ్యాడు. 1982 డిసెంబరు 7 న డెసి బౌటర్స్ నాయకత్వంలో సైన్యం ఫోర్ట్ జీలండ్యా (పరామరిబో) లో సైనికప్రభుత్వాన్ని విమర్శించిన 13 ప్రముఖ పౌరులను చుట్టుముట్టింది. [15] నియంతృత్వ సైనిక ప్రభుత్వం నాలుగవ తిరుగుబాటులో భాగస్వామ్యం వహించిన రాంబొకస్ , జివానిస్ షియోంబర్‌లతో కలిసి 13 మంది ప్రముఖులను మరణశిక్షకు గురిచేసింది

1987 ఎన్నికలు

1987 లో జాతీయ ఎన్నికలు జరిగాయి. జాతీయ అసెంబ్లీ రూపొందించిన నూతన రాజ్యాంగం బౌటెర్ ఆర్మీ ఇంచార్జిగా ఉండడానికి అనుమతించింది. 1990లో ప్రభుత్వ విధానాలకు అసంతృపిచెందిన బౌటర్స్ మంత్రిమండలిని టెఫోన్ కాల్ ద్వారా పదవి నుండి తొలగించాడు. 1991 ఎన్నికల తరువాత ఆయన ప్రభుత్వంలో తిరోగమనం మొదలైంది.

1986 లో తిరుగుబాటు నాయకుడు " రోని బ్రున్స్విక్ " నాయకత్వంలో ప్రాంరంభం అయిన సురినామ్ గెరిల్లా యుద్ధం కొనసాగి 1990నాటికి బౌటెర్స్ ప్రభుత్వాన్ని బలహీనపరచింది. ప్రారంభం అయింది. 1999 లో నెదర్లాండ్స్ ఔషధ అక్రమ రవాణా ఆరోపణ విచారణకు బౌటర్స్ హాజరుకానప్పటికీ విచారణ కొనసాగించి ఆయనకు జైలు శిక్ష విధించి సురినామ్‌ఖైదులో ఉందింది.

21వ శతాబ్ధం

2010 జూలై 19న మాజీ నియంత " డేసీ మౌటర్స్ " తిరిగి అధ్యక్షుడుగా ఎన్నికై తిరిగి సురినామ్‌చేరుకున్నాడు.[16] 2015 ఎన్నికలలో ఆయన మరొక మారు అధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు.[17] 2010 ఎన్నికలకు ముందు ఆయన 24 మందితో కలిసి 15 మంది ప్రముఖులను హత్యచేసాడు.

Remove ads

భౌగోళికం

Thumb
Map of Suriname anno 2016
Thumb
Suriname map of Köppen climate classification.

సురినామే దక్షిణ అమెరికాలో అతిచిన్న స్వతంత్ర దేశంగా ప్రత్యేకత కలిగి ఉంది. ఇది గయానా షీల్డ్ లో ఉంది. ఇది అక్షాంశాల 1 ° నుండి 6 ° ఉత్తర అక్షాంశం , 54 ° నుండి 58 ° తూర్పు రేఖాంశంలో ఉంది. దేశం రెండు ప్రధాన భౌగోళిక ప్రాంతాలుగా విభజించబడుతుంది. ఉత్తర లోతట్టు తీర ప్రాంతం (లైన్ అల్బినా-పరనాం-వాగింనింగ్) పైన వ్యవసాయ అనుకూలంగా ఉంది.ప్రజలలో అత్యధికులు ఇక్కడ నివసిస్తున్నారు. దక్షిణ భాగంలో ఉష్ణమండల వర్షారణ్యాలు , బ్రెజిల్ సరిహద్దు వెంట ప్రజలు తక్కువగా నివసించే సవన్నా 80% సురినామ్ భూ ఉపరితలం కలిగి ఉంటుంది.

సురినాంలో పర్వత శ్రేణులు బఖైస్ పర్వతాలు , వాన్ ఆష్క్ వాన్ విజ్క్ పర్వతాలు అని రెండు పర్వతశ్రేణులు ఉన్నాయి.సముద్ర మట్టానికి 1,286 మీటర్లు (4,219 అడుగులు) ఎత్తులో ఉన్న జులియానాటోప్ దేశంలో ఎత్తైన పర్వతగా గుర్తించబడుతుంది.ఇతర పర్వతాలలో టాఫెల్బెర్గ్ 1,026 మీటర్లు (3,366 అడుగులు), మౌంట్ కాసికాసిమ 718 మీటర్లు (2,356 అడుగులు), గోలీథింగ్బర్గ్ 358 మీటర్లు (1,175 అడుగులు) , వోల్ట్బర్గ్ 240 మీటర్లు (790 అడుగులు) ప్రధానమైనవి.

సరిహద్దులు

Claimed Areas
Thumb
Disputed areas shown on the map of Suriname (left and right, gray areas)

సురినామే తూర్పుసరిహద్దులో ఫ్రెంచ్ గయానా , పశ్చిమసరిహద్దులో గయానా దక్షిణ సరిహద్దు బ్రెజిల్ , ఉత్తర సరిహద్దు అట్లాంటిక్ సముద్రతీరం ఉన్నాయి. ఫ్రెంచ్ గయానా , గయానాతో ఉన్న దక్షిణ సరిహద్దు దేశాలు వరుసగా మారొయిజైన్ , కొరాంటైన్ నదులు ఉన్నాయి. అయితే సముద్ర సరిహద్దు గయానాతో వివాదాస్పదమై ఉంది.[18][19]

వాతావరణం

భూమధ్యరేఖకు ఉత్తరంగా 2 నుండి 5 డిగ్రీల ఉత్తర అక్షాంశంలో సురినామ్ చాలా వేడి , తడి ఉష్ణమండల వాతావరణం కలిగి ఉంటుంది. ఉష్ణోగ్రతలు ఏడాది పొడవునా మారవు. సగటు ఆర్ద్రత 80% , 90% మధ్య ఉంటుంది. దీని సగటు ఉష్ణోగ్రత 29 నుండి 34 డిగ్రీల సెల్సియస్ (84 నుండి 93 డిగ్రీల ఫారెన్హీట్) వరకు ఉంటుంది. అధిక తేమ కారణంగా అసలైన ఉష్ణోగ్రతలు మరుగుపడుతుంది. అందు వలన రికార్డు ఉష్ణోగ్రత కంటే 6 డిగ్రీల సెల్సియస్ (11 డిగ్రీల ఫారెన్హీట్) వేడిగా ఉంటుంది. సంవత్సరం రెండు తడి సీజన్లు ఉంటాయి. ఏప్రిల్ నుండి ఆగస్టు వరకు ఒకటి , నవంబరు నుండి ఫిబ్రవరి వరకు ఒకటి ఉంటాయి. ఆగస్టు నుండి నవంబరు వరకు , ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకూ రెండు పొడి సీజన్లు కూడా ఉన్నాయి.

ప్రకృతి వనరులు

ఎగువ కొప్పెన్మేం నది పరీవాహక ప్రాంతంలో ఉన్న సెంట్రల్ సురినాం నేచర్ రిజర్వ్ యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది.ఇందుకు సురినాం ధ్వశంచేయబడని అరణ్యాలు , జీవవైవిధ్యం ప్రధాన కారణాలుగా ఇన్నాయి. దేశంలోని తీరం వెంట ఉన్న అనేక జాతీయ పార్కులలో గలిబి జాతీయ రిజర్వ్ , బ్రౌన్స్బర్గ్ నేచర్ పార్కు , కేంద్ర సురినామ్‌లో ఉన్న ఈలట్స్ డే హాన్ నేచర్ పార్క్ , బ్రెజిల్ సరిహద్దులో ఉన్న సిపాలివాని ప్రకృతి రిజర్వ్ ప్రధానమైనవి. యు.ఎన్.ఇ.పి వరల్డ్ కన్జర్వేషన్ మానిటరింగ్ సెంటర్ ఆధారంగా దేశంలో 16% భూభాగం జాతీయ ఉద్యానవనాలు , సరస్సులు ఉన్నాయి. [20]

Remove ads

ఆర్ధికం

Thumb
Suriname Exports 2012 including artificial corundum

1990 లలో పలు ఆందోళనల తరువాత సురినామే సంపాదించిన ప్రజాపాలన , ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యభరితంగా మారింది. తరువాత డచ్ ఆర్థిక సహాయంపై తక్కువగా ఆధారపడింది. దేశానికి బాక్సైట్ (అల్యూమినియం ధాతువు) మైనింగ్ ఒక బలమైన ఆదాయ వనరుగా కొనసాగుతుంది.చమురు , బంగారం ఆవిష్కరణ సురినామ్ ఆర్థిక స్వాతంత్ర్యానికి గణనీయమైన స్థాయిలో సహకరించాయి. వ్యవసాయంలో ప్రధానంగా బియ్యం , అరటి, ఆర్థిక వ్యవస్థలో శక్తివంతంగా భాగం వహిస్తూ , పర్యావరణవాదానికి కొత్త ఆర్థిక అవకాశాలు అందిస్తున్నాయి. సురినామ్ భూభాగంలో 80% కంటే ఎక్కువ శాతం వర్షారణ్యాలు ఉన్నాయి. 1998 లో సెంట్రల్ సురినాం నేచర్ రిజర్వ్ స్థాపనతో సురినామే ఈ విలువైన వనరు పరిరక్షణకు దాని నిబద్ధతను సూచించింది. 2000 లో సెంట్రల్ సురినాం నేచర్ రిజర్వు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారింది.

Thumb
ఆర్థిక మంత్రిత్వ శాఖ

సురినాం ఆర్థికరంగంలో బాక్సైట్ పరిశ్రమ ఆధిక్యత వహిస్తుంది. ఇది జి.డి.పి.లో 15% కంటే అధికంగా, 70% ఎగుమతి ఆదాయాలలో భాగస్వామ్యం వహిస్తుంది. ఇతర ప్రధాన ఎగుమతి ఉత్పత్తులలో బియ్యం, అరటి , రొయ్యలు ప్రాధాన్యత వహిస్తున్నాయి.సురినామే ఇటీవలే గణనీయ చమురును , [21] బంగారం వెలికితీయడం ప్రారంభించింది.[22] వ్యవసాయ రంగంలో సుమారు నాలుగవవంతు మంది పనిచేస్తున్నారు. సురినాం ఆర్థిక వ్యవస్థ వాణిజ్య ప్రధాన వాణిజ్య భాగస్వాములుగా నెదర్లాండ్స్, యునైటెడ్ స్టేట్స్, కెనడా, , కారిబ్బియన్ దేశాలు ప్రధానంగా ట్రినిడాడ్ , టొబాగో , నెదర్లాండ్స్ అంటిల్లీస్ మాజీ ద్వీపాలు ఉన్నాయి. [23]

1996 చివరిలో అధికారాన్ని స్వాధీనం చేసుకున్న తరువాత విజ్డెంబొస్చ్ ప్రభుత్వం మునుపటి ప్రభుత్వ నిర్మాణ సర్దుబాటు కార్యక్రమాన్ని ముగింపుకు తీసుకువచ్చి అది సమాజంలోని పేద అంశాలకు అన్యాయం చేసిందని పేర్కొంది. కొత్త పన్ను ప్రత్యామ్నాయాలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. పాత పన్నులు లాక్ చేయబడినప్పుడు పన్ను ఆదాయాలు పడిపోయాయి. 1997 చివరినాటికి, నెదర్లాండ్స్‌తో సురినామీస్ ప్రభుత్వ సంబంధాలు క్షీణించడంతో కొత్త డచ్ అభివృద్ధి నిధుల కేటాయింపు స్తంభించింది. 1998 లో ఆర్థిక వృద్ధి క్షీణించింది.గనుల త్రవ్వకం, నిర్మాణం , వినియోగ రంగాల క్షీణత సంభవించింది. అధికమొత్తంలో ప్రభుత్వ వ్యయం, బలహీనమైన పన్ను సేకరణ, సివిల్ సేవారాహిత్యం , 1999 లో తగ్గిన విదేశీ సాయం కారణంగా జి.డి.పి.లో 11% ఆర్థిక లోటుకి దోహదం చేసింది. ప్రభుత్వం ద్రవ్య విస్తరణ ద్వారా ఈ లోటుని భర్తీ చేయాలని కోరింది. ఇది ద్రవ్యోల్బణం నాటకీయంగా అధికరించడానికి దారి తీసింది. సురినామ్‌ దేశీసంస్థలు కొత్త వ్యాపారాన్ని నమోదు చేసుకోవటానికి ప్రపంచంలోని దాదాపు ఏ ఇతర దేశానికంటే (694 రోజులు లేదా 99 వారాలు) కంటే సగటున అధికసమయం సమయం అవసరం ఔతుంది.[24]

  • జి.డి.పి. (2010 est.) : 4.794 బిలియన్ అమెరికన్ డాలర్లు.
  • వార్షిక వృద్ధి రేటు నిజమైన జి.డి.పి. (2010 అంచనా) : 3.5%.
  • తలసరి జి.డి.పి. (2010 అంచనా) : 9,900.అమెరికన్ డాలర్లు.
  • ద్రవ్యోల్బణం (2007) : 6.4%.
  • సహజ వనరులు: బాక్సైట్, బంగారం, చమురు, ఇనుప ఖనిజం, ఇతర ఖనిజాలు, అడవులు, జలవిద్యుత్ ఉత్పత్తి, చేపలు , రొయ్యలు.
  • వ్యవసాయం: ఉత్పత్తులు - బియ్యం, అరటిపండ్లు, కలప, పాల్మ్ కెర్నలు, కొబ్బరి, వేరుశెనగలు, సిట్రస్ పండ్లు, అటవీ ఉత్పత్తులు.

పరిశ్రమ: రకాలు-అల్యూమినా, చమురు, బంగారం, చేప, రొయ్యలు, కలప. [12] ట్రేడ్:

  • ఎగుమతులు (2012) : 2.563 బిలియన్లు డాలర్లు; అల్యూమినియం, బంగారం, ముడి చమురు, కలప, రొయ్యలు , చేపలు, బియ్యం, అరటిపండ్లు. * * ప్రధాన వినియోగదారుల సంఖ్య: 26.1%, బెల్జియం 17.6%, యుఎఇ 12.1%, కెనడా 10.4%, గయానా 6.5%, ఫ్రాన్స్ 5.6%, బార్బడోస్ 4.7%.
  • దిగుమతులు (2012) : $ 1.782 బిలియన్: క్యాపిటల్ ఎక్విప్మెంట్, పెట్రోలియం, ఆహార పదార్థాలు, పత్తి, వినియోగదారుల వస్తువులు.
  • ప్రధాన పంపిణీదారులు: యు.ఎస్. 25.8%, నెదర్లాండ్స్ 15.8%, చైనా 9.8%, UAE 7.9%, ఆంటిగ్వా , బార్బుడా 7.3%, నెదర్లాండ్స్ యాంటిల్లీస్ 5.4%, జపాన్ 4.2%.

[12]

Remove ads

మతము , భాష

37% జనాభా భారతీయులు. హిందువులు 25% ముస్లిములు 18% (దక్షిణాసియానుండి వలస వెళ్ళిన వారు) గలరు. ఉర్దూ, భోజ్ పురి, హిందుస్తానీ భాషలు మాట్లాడేవారు ఎక్కువగా కానవస్తారు.

గణాంకాలు

Thumb
The population of Suriname from 1961 to 2003, (in units of 1000). The slowdown and decline in population growth from ~1969-1985 reflects a mass migration to the Netherlands.

2012 గణాంకాల ఆధారంగా సురినాం జనసంఖ్య 5,41,638. [25] సురినాం జనాభా విస్తృతమైన వైవిధ్యత కలిగి ఉంటుంది. దీనిలో ఆధిక్యత కలిగిన ప్రత్యేక సమూహం ఏదీలేదు. శతాబ్దాల కాలం కొనసాగిన డచ్ పాలన వారసత్వం బలవంతంగా బానిసలుగా తీసుకురాబడిన ప్రజలు, ఒప్పందవిధానంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలనుండి కూలీలుగా తీసుకురాబడిన వివిధ జాతులకు చెందిన ప్రజలు , జాతి సమూహాల స్వచ్ఛందంగా వలసల వచ్చిన ప్రజలు , స్థానిక సంప్రదాయ ప్రజలతో నిండిన కాలనీలను కలిగి ఉంది.

అతిపెద్ద సమూహంగా భారతీయులు ఉన్నారు. వీరు మొత్తం ప్రజలలో 27% మంది ఉన్నారు. 19 వ శతాబ్దపు కాంట్రాక్టు కార్మికుల వారసులు, భారతదేశంలోని ఆధునిక భారతీయ రాష్ట్రాలైన బీహార్ , తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి నేపాలీ సరిహద్దు ప్రాంతాలకు చెందిన ప్రజలు అధికంగా ఉన్నారు. తరువాత స్థానంలో సురినామీస్ మరూన్లు ఉన్నారు. వీరు పూర్వీకులు ఇతరప్రాంతాల నుండి పారిపోయి ఇక్కడకు వచ్చి సుదూరప్రాంతాలలో స్థరపడిన బానిసల సంతతికి చెందిన ప్రజలు. దేశప్రజలలో వీరి శాతం 21.7% ఉన్నారు. వీరు ఐదు ప్రధాన సమూహాలుగా విభజించబడ్డాయి: నడికా (ఆకులన్స్), క్విన్టి, మాటావా, సారామాకాన్స్ , పరామాకన్లు. సురినామీ క్రియోల్స్ ఆఫ్రికన్ బానిసలు , ఎక్కువగా డచ్ యూరోపియన్ల నుండి వచ్చిన మిశ్రమ వ్యక్తులు ఉన్నారు వీరు జనాభాలో 15.7% ఉన్నారు. దేశజనాభాలో జావానీస్ 14% శాతం ఉన్నారు. వీరిలో తూర్పు భారతీయులు, మాజీ డచ్ ఈస్ట్ ఇండీస్ (ఆధునిక ఇండోనేషియా) లో జావా ద్వీపం నుండి ఒప్పందం ద్వారా తీసుకుని రాబడిన శ్రామికవర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు.[26] 13.4% మిశ్రితసంప్రదాయానికి చెందిన ప్రజలు ఉన్నారు. ఇతర గణనీయమైన సమూహాలలో చైనీయులు ఉన్నారు. 19 వ శతాబ్దపు ఒప్పంద కార్మికులు , కొన్ని ఇటీవల వలసల ప్రజలు 40,000 మందికి కంటే అధికంగా ఉన్నారు. 2011 నాటికి లెబనీస్, ప్రాధానంగా మరానైట్స్, సెఫార్దీ , అష్కెనాజి పూర్వీకత కలిగిన యూదులు, (వారు అధికంగా జోదెన్సవాన్నే ప్రాంతంలో ఉన్నారు) , బ్రెజిలియన్లు (వారిలో చాలామంది బంగారం గనులలో పనిచేసిన కార్మికులు ఉన్నారు).[27] దేశంలో చిన్న సంఖ్యలో అయినప్పటికీ ప్రభావవంతమైన యూరోపియన్లు ఉన్నారు. వీరు జనాభాలో సుమారు 1% మంది ఉన్నారు. 19వ శతాబ్దంలో వలసవచ్చిన డచ్ ప్రజలు బోయెరస్ పేరుతో (డచ్ భాషలో బోయర్స్ అంటే రైతులు అని అర్ధం) ఇక్కడ నివసిస్తున్నారు. ఇతర యూరోపియన్ సమూహాల కంటే తక్కువగా మడెయిరా పోర్చుగీసువారు ఉన్నారు.చాలామంది బోరోస్ ప్రజలు 1975 లో దేశానికి స్వాతంత్ర్యం తరువాత దేశం విడిచిపెట్టారు.

వివిధ అమెరికన్ స్థానికజాతి ప్రజలు దేశప్రజలు జనాభాలో 3.7% ఉన్నారు. వీరిలో ప్రధాన గ్రూపులు అకురియో, అరావాక్, కలీనా, కారైస్, టిరియో , వేయనా జాతుల ప్రజలు ఉన్నారు. వారు ప్రధానంగా పరమరిబో, వనికే, పారా, మార్వోవిజ్నే , సిప్లివిని జిల్లాల్లో నివసిస్తున్నారు.[28] సురినామ్ నివాసుల్లో అత్యధిక శాతం (దాదాపు 90 శాతం) పారామెరిబోలో లేదా తీరంలో నివసిస్తున్నారు.

1975 లో సురినామ్ స్వాతంత్ర్యానికి తరువాత సంవత్సరాలలో పౌరులు తమదేశంగా సురినాం లేదా డచ్‌ను ఎంపిక చేయవలసిన అవసరం ఏర్పడిన సమయంలో ప్రజలు సురినాం నుండి నెదర్లాండ్‌కు సామూహిక వలసల పోయారు.స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే , 1980 లలో సైనిక పాలన సమయంలో , 1990 లలో విస్తరించిన ఆర్థిక కారణాల వలన ఈ వలసలు కొనసాగాయి. నెదర్లాండ్‌లో ఉన్న సురినామీ సమూహానికి చెందిన ప్రజలు 3,50,300 (2013నాటికి) ఇది సుమారు 566,000 సంఖ్యకు అభివృద్ధి చెందింది.[12]

మతం

మరింత సమాచారం Religion in Suriname, 2012 ...

సురినామ్ మతపరంగా బహుళ సాంస్కృతిక భిన్నత్వం కలిగి ఉంటుంది.2012 గణాంకాల ఆధారంగా ప్రజలలో దాదాపు సగం మంది 48.4% క్రైస్తవ మతానికి చెందినవారై ఉన్నారు.[29] 21.6% మంది రోమన్ క్యాథలిక్, 11.18% పెంటెకోస్టల్, 11.6% మోరవియన్ మిగిలిన వారు ఇతర ప్రొటెస్టంట్ తెగలవారు ఉన్నారు.సురినామ్లో హిందువులు రెండవ అతిపెద్ద మత సమూహంగా ఉన్నారు.వీరు జనాభాలో 22.3% ఉన్నారు.[29] హిందువులు అతి పెద్ద నిషపత్తిలో ఉన్న దేశాలలో సురినాం మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో గయానా, ట్రినిడాడ్ , టొబాగో ఉన్నాయి. హిందూ మతస్థులు అధికంగా ఇండో-సురినామీ ప్రజలలో ఉన్నారు. ముస్లింలు జనాభాలో 13.9% ఉన్నారు. అమెరికాస్‌లో ఈశాతం అత్యధికం.ముస్లిం మతం అధికంగా జావానీయ సంతతి ప్రజలలో తక్కువగా భారతీయ సంతతికి చెందిన వారిలో ఆచరణలో ఉంది.[29] ఇతర మత సమూహాలలో వూంటి మతం మరాన్ పూర్వీకులు ఎక్కువగా ఆఫ్రో-అమెరికన్ ఈమతాన్ని ఆచరిస్తున్నారు. జావానీజం, కొన్ని జావానీస్ సురినామీస్‌లో కనిపించే ఒక సంక్లిష్ట విశ్వాసం ఇది. అనేక స్థానిక జానపద సంప్రదాయాలు తరచుగా పెద్ద మతాలలో ఒకటిగా (సాధారణంగా క్రైస్తవ మతం) విలీనం చేయబడ్డాయి. జనాభాలో 10 శాతం కంటే కొంచెం తక్కువగా ఉన్న మతాలు ప్రస్తావించబడలేదు.

భాషలు

Thumb
Immigrants from India
Thumb
Butcher market in Paramaribo with signs written in Dutch.

సురినాంలో డచ్ ఏకైక అధికారిక భాష , విద్య, ప్రభుత్వం, వ్యాపారం , మీడియా భాషగా ఆధిక్యత కలిగి ఉంది.[12] జనాభాలో 60% పైగా డచ్ మాతృభాషగా మాట్లాడతుంటారు.[30] మిగిలిన జనాభాలో చాలా మంది రెండవ భాషగా మాట్లాడతారు. 2004 లో సురినామే డచ్ భాష యూనియన్లో ఒక అనుబంధ సభ్యదేశంగా మారింది. [31] ఇది దక్షిణ అమెరికాలో ఏకైక డచ్ భాష మాట్లాడే దేశంగా ఉంది. అలాగే అమెరికాలోని స్వతంత్ర దేశములలో డచ్ మాట్లాడే ప్రజలు అధికంగా ఉన్న ఏకైక స్వతంత్ర దేశంగా , ఖండంలోని రొమాన్ మాట్లాడే రెండు దేశాలలో ఒకటిగా ఉంది. మరొక దేశం ఆంగ్ల భాష మాట్లాడే గయానా. పారామెరిబోలో, గృహాలలో మూడింట రెండు వంతుల మంది డచ్లో ప్రధాన హోమ్ భాషగా ఉంది.[32] "నెదర్లాండ్స్-నెదర్లాండ్స్" ("డచ్ డచ్") , "వ్లామ్స్-నెదర్లాండ్స్" ("ఫ్లెమిష్ డచ్") కు సమానం అయిన ఒక జాతీయ మాండలికంగా "సురినాంస్-నెదర్లాండ్స్" ("సురినాంగ డచ్") గుర్తింపు 2009 లో ప్రచురణ Woordenboek Surinaams Nederlands (సురినామీస్-డచ్ నిఘంటువు) [33] సురినాం లోని లోతట్టు ప్రాంతాలలో మాత్రమే డచ్ అరుదుగా మాట్లాడబడుతుంది.

ఒక స్థానిక క్రియోల్ ప్రజలి మాట్లాడే " స్రనాన్ " భాషను క్రియోల్స్ వీధుల్లో విస్తృతంగా ఉపయోగించే భాషగా , తరచుగా అమరిక ఆకృతిని బట్టి డచ్‌తో కలిపి పరస్పరం వాడతుంటారు.[34] సురినాం హిందీ లేదా శార్నిమి, భోజ్పురి మాండలికాలలో ఒకటి, అప్పటి బ్రిటీష్ ఇండియా నుండి దక్షిణ ఆసియా ఒప్పంద కార్మికుల వారసులు మాట్లాడే మూడవ భాషగా ఉంది. జావనీస్ భాష జావనీస్ ఒప్పంద కార్మికుల వారసులు ఉపయోగిస్తారు. మరాన్ భాషలు స్రానన్ తో కొంత మేధోసంబంధంలో ఉన్నాయి. వీటిలో సరామా, పరమాకన్, నదికా (ఆకాన్ అని కూడా పిలుస్తారు), క్విన్టి , మాటావాయ్ భాషలు ప్రధానమైనవి. అమెరిన్డియన్ మాట్లాడే అమెరిండియన్ భాషలు, కరీబియన్ , అరావాక్ ఉన్నాయి. హక్కా , కాంటోనీస్ చైనీస్ కాంట్రాక్టు కార్మికుల వారసులు మాట్లాడతారు. మాండరిన్ కొంతమంది ఇటీవలి చైనీస్ వలసదారులచే మాట్లాడబడుతుంది. ఇంగ్లీష్ , పోర్చుగీస్ కూడా ఉపయోగిస్తారు.సురినామే భాషల గురించి ప్రజల ఉపన్యాసం దేశం జాతీయ గుర్తింపు గురించి చర్చలు కొనసాగుతున్నాయి.[34] ప్రముఖ 1980 లలో మాజీ నియంత " డెసి బోటెర్స్ " ప్రజలో ప్రవేశపెట్టిన స్రానన్ వాడకం జాతీయవాద రాజకీయాలతో సంబంధం కలిగివుంది.[34] ఈభాషా వాడకాన్ని తప్పించుకుని ఇక్కడకు చేరిన బానిసల సంతతికి చెందిన బృందాలు వ్యతిరేకిస్తాయి.[34] భౌగోళికంగా సురినాం పురుగున స్పానిష్ వాడుక కలిగిన దేశాలు లేనప్పటికీ కొందరు స్పానిష్ భాషను సమర్ధిస్తున్నారు.కరీబియన్ , ఉత్తర అమెరికా దేశాలతో సంబంధాలు అభివృద్ధి చేసుకొనడానికి ఆగ్లభాషను జాతీయ భాషగా చేయాలని ప్రతిపాదిస్తున్నారు.[34]

పెద్దనగరాలు

The national capital, Paramaribo, is by far the dominant urban area, accounting for nearly half of Suriname's population and most of its urban residents; indeed, its population is greater than the next nine largest cities combined. Most municipalities are located within the capital's metropolitan area, or along the densely populated coastline.

Remove ads

సంస్కృతి

Owing to the country's multicultural heritage, Suriname celebrates a variety of distinct ethnic and religious festivals.

జాతీయ శలవుదినాలు

  • 1 జనవరి - న్యూ ఇయర్ డే
  • 6 జనవరి - మూడు కింగ్స్ డేజనారీ -
  • జనవరి ప్రపంచ మతం దినం
  • ఫిబ్రవరి - చైనీస్ న్యూ ఇయర్
  • 25 ఫిబ్రవరి - Revolution
  • March యొక్క డే (మారుతుంది) -
  • హోలీ మార్చి / ఏప్రిల్ -
  • గుడ్ ఫ్రైడే మార్చి /
  • ఏప్రిల్ - ఈస్టర్ 1 మే - లేబర్ డే
  • మే / జూన్ - అసెన్షన్ రోజు
  • 5 జూన్ - భారతీయ రాక దినం
  • 1 జూలై - కేటీ కోటి (బానిసత్వం యొక్క విమోచన దినం - ముగింపు)
  • 8 ఆగస్టు - జావానీస్ రాక దినం
  • 9 ఆగస్టు - ఇండిజీనస్ పీపుల్స్ డే
  • 10 అక్టోబరు - Maroons యొక్క డే
  • 20 అక్టోబరు - చైనీస్ రాక దినం
  • అక్టోబరు / నవంబరు - హిందువుల అతిపెద్ద పండుగ
  • 25 నవంబరు - స్వాతంత్ర్య దినం
  • 25 డిసెంబరు - క్రిస్మస్

అనేక హిందూ , ఇస్లామిక్ జాతీయ సెలవుదినాలు దీపావళి, లోగా , ఈద్ ఉల్-ఫితర్ , ఈద్-ఉల్-అధా వంటివి ఉన్నాయి. ఈ సెలవులు హిందూ , ఇస్లామిక్ క్యాలెండర్లు ఆధారంగా ఉంటాయి కనుక గ్రెగోరియన్ క్యాలెండర్లో నిర్దిష్ట తేదీలు లేవు.

సురినామ్ కు ప్రత్యేకమైన అనేక సెలవులు ఉన్నాయి. వీటిలో భారతీయ, జావానీస్ , చైనీస్ రాక దినాలు ఉన్నాయి. వారు తమ వలసదారులతో మొదటి నౌకల రాకను జరుపుకుంటారు.

న్యూ ఇయర్స్ ఈవ్

Thumb
Pagara (red firecracker ribbons).

సురినామెలో నూతన సంవత్సరం పండుగను ఔద్ జర్ లేదా "పాత సంవత్సరం" అని పిలుస్తారు. ఈ కాలంలోనే సురినామీస్ జనాభా నగరం వాణిజ్య జిల్లాకు "నిరూపణ బాణాసంచా" సందర్శించడానికి చేరుకుంటారు. పెద్ద దుకాణాలు ఈ మందుగుండు సామగ్రిలో పెట్టుబడి పెట్టి , వాటిని వీధుల్లో ప్రదర్శిస్తాయి. ప్రతి సంవత్సరం వారి పొడవు అనుసరించి ప్రశంసలు దిగుమతి చేయబడి అతిపెద్ద రిబ్బను కంపెనీకి ఇవ్వబడ్డాయి.

ఈ ఉత్సవాలు ఉదయం 10 గంటలకు మొదలై మరుసటి రోజు పూర్తి అవుతాయి. రోజు సాధారణంగా నవ్వులు, డ్యాన్స్, మ్యూజిక్ , తాగడంతో నిండి ఉంటుంది. రాత్రి మొదలవుతున్నప్పుడు, పెద్ద వీధి పార్టీలు పూర్తి స్థాయిలో నిర్వహిస్తుంటారు. ప్రధాన పర్యాటక జిల్లాలో కేఫ్ టట్ లో అత్యంత ప్రసిద్ధ ఫియస్టా జరుగుతుంది. రాత్రి 10 , 11 మధ్య పార్టీలు నిలిచిపోతాయి. దీని తరువాత అర్ధరాత్రి వారి పగరాలను (ఎరుపు-అగ్నిమాపక-రిబ్బన్లు) వెలిగించడానికి ప్రజలు ఇంటికి వెళ్తారు. 12 గంటల తరువాత, పార్టీలు కొనసాగుతూ మళ్లీ వీధులు నిండిపోతాయి.[35]

Remove ads

మాధ్యమం

సురినాంలో ప్రబలమైన వార్తాపత్రిక డే వేర్ టిజెడ్ "ను టైంస్ ఆఫ్ సురినాం అధిగమించింది. క్రీడల వార్తల కొరకు అత్యంత ప్రాచుర్యం పొందిన పత్రిక " ఎస్.ఎం.ఇ. స్పోర్ట్ ".[36] పూర్తిగా ఆంగ్ల ఆన్‌లైన్ వార్తాపత్రిక డెవిసర్: సురినామ్ అభివృద్ధి.[37] అత్యంత ప్రజాదరణ పొందిన ఆన్లైన్ వార్తాపత్రికలు స్టార్నియుల్స్,[38] సురినామె న్యూయుస్.[39]

సురినామెలో ఇరవై నాలుగు రేడియో స్టేషన్లలో రెండు ఇంటర్నెట్ ద్వారా ప్రసారాలు (అపిన్టి , రేడియో 10) చేయబడుతూ ఉన్నాయి. పన్నెండు టెలివిజన్ వర్గాలు ఉన్నాయి:టి.వి2(చానెల్.2)ఎ.బి.సి.(చానెల్ 4), ఆర్.బి.ఎన్.(చానెల్ 5), ఎస్.టి.వి.ఎస్(చానెల్ 8), అంపిటీ(చానెల్ 10), ఎ.టి.వి.(చానెల్ 12),రాడికా (చానెల్ 14, సి.సి.సి.(చానెల్ 17), త్రిసూల్ (చానెల్ 20), గరుడ (చానెల్ 23),సంగీత్మల (చానెల్ 26), పి.ఎల్(288),ఎస్.సి.టి.వి(చానెల్ 45,47)మస్తికా(చానెల్ 50-52). సురినాం ప్రజలచే స్థాపించబడిన మారాట్ అంస్టర్‌డాం నుండి ప్రసారం చేయబడుతుంది.సురినాం ప్రముఖ కార్టూన్లలో " కొండ్రెమాన్ " ఒకటి.2012 లో సురినామె ప్రపంచవ్యాప్తంగా " ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ " నివేదిక ఆధారంగా జపాన్తో సంయుక్తంగా 22 వ స్థానాన్ని పొందింది. [40] ఇది యు.ఎస్.(47వ),యు.కె (28వ) , ఫ్రాంస్ (38 వ)

Remove ads

క్రీడలు

సురినాంలో క్రీడలు. 1959 లో స్థాపించబడిన " సురినాం ఒలింపిక్ కమిటీ " లో అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాస్కెట్బాల్, బాక్సింగ్, చదరంగం, సైక్లింగ్, ఫుట్బాల్, జుడో, కరాటే, షూటింగ్, స్విమ్మింగ్, టేబుల్ టెన్నిస్, టైక్వాండో, టెన్నీస్, ట్రియాథ్లాన్, వాలీబాల్, , రెజ్లింగ్ మొదలైన 17 క్రీడలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.

సురినామెలో ప్రధాన క్రీడలలో ఒకటి ఫుట్ బాల్ ఒకటి. చాలా మంది సురినామ్-జన్మించిన క్రీడాకారులు , సురినాంజి సంతతికి చెందిన డచ్-జన్మించిన ఆటగాళ్ళు గెరాల్డ్ వాన్బర్గ్, రూడ్ గులిట్, ఫ్రాంక్ రిజ్కార్డ్, ఎడ్గార్ డేవిడ్స్, క్లారెన్స్ సీడోర్ఫ్, ప్యాట్రిక్ క్లైయివెర్ట్, ర్యాన్ బాబెల్, అరోన్ వింటర్, జార్జిని విజ్నాల్డమ్, జిమ్మీ ఫ్లాయిడ్ హస్సెల్బైన్క్ , జెరెమీన్ లెన్స్ వంటివారు నెదర్లాండ్ నేషనల్ ఫుట్‌బాల్ టీం " ఔరంగ " తరఫున క్రీడలలో పాల్గొంటున్నారు. 1999 లో సురినామ్ , నెదర్లాండ్స్ రెండింటి కొరకు ఆడిన " హంఫ్రీ మిజనల్స్ " ఈశతాబ్దం సురినామీ ఫుట్బాల్ క్రీడాకారుడిగా ఎన్నికయ్యారు. [41] మరో ప్రసిద్ధ ఆటగాడు ఆండ్రే కమ్పెర్వీన్ 1940 లో సురినాంకు కెప్టెన్గా వ్యవహరించి , నెదర్లాండ్‌లో వృత్తిపరంగా మొట్టమొదటిసారిగా ఆడాడు.

సురినామెలో అత్యంత ప్రసిద్ధ అంతర్జాతీయ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ లెటియా విరోడ్డే 1995 ప్రపంచ ఛాంపియన్షిప్‌లో అన్నా క్విరోట్ తరువాత 800 మీటర్ల వెండి పతక విజేతగా నిలిచాడు. ప్రపంచ ఛాంపియన్షిప్ పోటీలో దక్షిణ అమెరికన్ మహిళా అథ్లెట్ గెలుపొందిన తొలి పతకంగా ఇది గుర్తించబడింది. అంతేకాకుండా ఆమె 2001 వరల్డ్ ఛాంపియన్షిప్‌లో కాంస్య పతకాన్ని , పాన్-అమెరికన్ గేమ్స్ , సెంట్రల్ అమెరికన్ అండ్ కరీబియన్ గేం 800 , 1500 మీటర్లలో పలు పతకాలను గెలుచుకుంది. 1991 పాన్ అమెరికన్ గేమ్‌ 800 మీటర్ల లో కాంస్య పతకాన్ని సాధించినందుకు టామీ ఆసింగా కూడా ప్రశంసలు అందుకున్నాడు.

స్విమ్మర్ ఆంటోనీ నీస్టీ సురినామ్‌ ఒలింపిక్ పతక విజేతగా నిలిచాడు. అయన సియోల్లో 1988 వేసవి ఒలింపిక్స్‌లో 100 మీటర్ల బటర్ ఫ్లై పోటీలో బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు.బార్సిలోనాలోని 1992 వేసవి ఒలింపిక్స్‌లో అదే విభాగంలో కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. మొదట ట్రినిడాడ్ , టొబాగో నుండి అయన ఇప్పుడు గైనెస్విల్లే (ఫ్లోరిడా) లో నివసిస్తున్నాడు. ఫ్లోరిడా విశ్వవిద్యాలయం ప్రధాన శిక్షకుడుగా ( ప్రధానంగా డిస్టెంస్ స్విమ్మింగ్ శిక్షణ)

పొరుగున ఉన్న నెదర్లాండ్స్‌ , గయానాలో ప్రజాదరణ పొందిన క్రికెట్ ప్రభావం కొంత వరకు సురినామ్‌లో ప్రవేశించి ఇక్కడ క్రికెట్ ప్రసిద్ధమైంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) లో " సురినాం క్రికెట్ బాండ్ అనుబంధ సభ్యత్వం " కలిగి ఉంది. సురినామ్ , అర్జెంటీనా దక్షిణ అమెరికాలో ఉన్న ఏకైక ఐ.సి.సి. సహచరులుగా ఉన్నప్పటికీ అయితే గయానా వెస్టిండీస్ క్రికెట్ బోర్డులో పూర్తి సభ్యత్వదేశంగా ప్రాతినిధ్యం వహిస్తుంది. వరల్డ్ క్రికెట్ లీగ్ (డబల్యూ.సి.ఎల్) సురినాం 2014 జూన్ నాటికి ప్రపంచంలోని 47 వ స్థానంలో , ఐ.సి.సి. అమెరికాలలో 6 వ స్థానంలో ఉంది.అమెరికాస్ ఛాంపియన్షిప్‌లో పోటీలలో , వరల్డ్ క్రికెట్ లీగ్ క్రీడలలో పాల్గొన్నది. పారామెరిబోలో జన్మించిన ఐరిస్ ఝారాప్ డచ్ జాతీయ జట్టుకు మహిళల వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఏకైక సురినాం మహిళగా ఆడంది.[42] బ్యాడ్మింటన్ క్రీడలో స్థానిక క్రీడాకారులు విర్గిల్ సోరోర్చోజో & మిచెల్ వొంగ్నోడ్రోరోమో , క్రిస్టల్ లీఫ్మన్స్ ఉన్నారు. కేర్బాకో కాలిఫోర్నియా ఛాంపియన్షిప్స్, సెంట్రల్ అమెరికన్ అండ్ కరీబియన్ గేమ్స్ (సి.ఎ.సి.ఎస్.ఒ. గేమ్స్) వద్ద సురినామ్ కోసం గెలిచిన పతకాలు గెలిచాడు. [43]

, సౌత్ అమెరికన్ గేంస్‌ (ఓడెస్యూర్ గేమ్స్ అని పిలువబడుతుంటాయి), వర్జీల్ సోరోరెడ్జొ కూడా సురినామ్ కోసం పాల్గొంది. 2012 లండన్ సమ్మర్ ఒలంపిక్స్‌లో పాల్గొని రెండవ బ్యాడ్మింటన్ క్రీడాకారుడుగా నిలిచాడు.మొదటి క్రీడాకారుడు ఆస్కార్ బ్రాండన్ సురినామ్ కోసం దీనిని సాధించాడు.[44] బహుళ కె-1 చాంపియన్ , లెజెండ్, ఎర్నెస్టో హోస్ట్, సురినామీ సంతతికి చెందినవాడు. మిక్సెడ్ మార్షల్ ఆర్ట్స్ (ఎం.ఎం.ఎ) , కిక్బాక్సింగ్ చాంపియన్ మెల్విన్ మాన్హోఫ్ , గిల్బర్ట్ యెల్ల్ సురినామెలో జన్మించడం లేదా సురినామీ సంతతికి చెందినవారై ఉన్నారు. రేయాన్ సిమ్సన్, మరో చరిత్రసృష్టించిన బహుళ ప్రపంచ ఛాంపియన్ కిక్బాక్సర్; రెమీ బొనాజాస్కీ కూడా ఒక బహుళ కె-1 చాంపియన్; అలాగే రిటైర్డ్ ఆడ కిక్బాక్సర్, ఇలోంకా ఎల్మోంట్; గుర్తించదగిన అప్-అండ్-కామర్ కిక్బాక్సర్ , కె-1 ఫైటర్, టైరోన్ స్పాంగ్; , మాజీ ముయే థాయ్ హెవీ వెయిట్ చాంపియన్ అయిన జింటీ వ్రేడే (చనిపోయిన), సురినాంలో జన్మించారు.

టెన్నిస్ క్రీడలో చారిత్రాత్మక జాతీయ చాంపియన్లలో గెరార్డ్ వాన్ డెర్ ష్రోఫ్ఫ్ (పురుషుల సింగిల్ జాతీయ ఛాంపియన్ 1931-41 మధ్య సంవత్సరాలలో వరుసగా 10 సంవత్సరాలు, అనేక ఫ్యూచర్ టైటిల్స్ విజేత). హెర్మన్ టిన్-ఎ-జిజీ (పురుషుల జాతీయ ఛాంపియన్ 1941 , 1945 ప్లస్ పురుషుల జాతీయ డబుల్ ఛాంపియన్ 10 సంవత్సరాలు వరుసగా తన సోదరుడు లియోతో). లియో టిజాన్-ఎ-డిజే (1948-57 మధ్య అతను తన సోదరుడు హెర్మన్ తో ఎనిమిది సార్లు నేషనల్ ఛాంపియన్ , 10 వరుస సంవత్సరాలు పురుషుల జాతీయ డబుల్ ఛాంపియన్లుగా ఉన్నారు). లియో నుండి ఒప లియో వరకు టిజిన్-ఎ-డీజీ టెన్నిస్ టోర్నమెంట్‌ను విస్తరించింది. రాండ్ఫ్ఫ్ టిన్-ఎ-జిజీ 1960 జాతీయ ఛాంపియన్.[45]

Remove ads

రవాణా సౌకర్యాలు

సురినామ్ , పొరుగున ఉన్న గయానా దేశాలు మాత్రమే దక్షిణ అమెరికా ఖండంలోని ప్రధాన భూభాగంలోని ఎడమవైపున డ్రైవ్ చేసే విధానం అమలు చేస్తూ ఉన్నాయి. గయానాలో ఈ పద్ధతి యునైటెడ్ కింగ్డమ్ వలస అధికారుల నుండి వారసత్వంగా పొందింది. సురినామ్ ఎడమ వైపున ఎందుకు డ్రైవ్ చేస్తున్నారో వివరించడానికి వివిధ కారణాలు ఇవ్వబడ్డాయి. ఈకారణాలలో ఒకటి సురినాం దిగుమతి చేసుకున్న మొదటి కార్లు ఇంగ్లాండ్ నుండి వచ్చాయని భావించబడుతోంది, కాని ఇది ఇంకా నమోదు చేయబడలేదు. అదనంగా ఆటోమొబైల్ శకానికి ముందు ట్రాఫిక్ గురించి వివరణ ఏదీలేదు. [46] మరొక వివరణ ఏమిటంటే నెదర్లాండ్స్, సురినామ్ కాలనీకరణ సమయంలో ట్రాఫిక్ కోసం రహదారి ఎడమ వైపు ఉపయోగించింది , మరొకటి సురినామ్ ఆంగ్లేయుల వలసదేశంగా ఉన్న కారణంగా జరిగిందని భావించబడుతుంది.[47] 18 వ శతాబ్దం చివరలో నెదర్లాండ్స్ కుడి వైపుకు డ్రైవింగ్ చేయటానికి మారినప్పటికీ [47][48] సురినామే మాత్రం మార్పు చేయలేదు. రచయితలు పీటర్ కిన్కెయిడ్ , ఇయాన్ వాట్సన్ మాట్లాడుతూ సురినామ్ వంటి భూభాగాల్లో పొరుగు దేశాలకు అనుసంధాన రహిత రహదారులు లేవు. స్థితిని మార్చడానికి వెలుపలి ఒత్తిడి లేదు.

వాయుమార్గం

సురినామే నుండి బయలుదేరే ఎయిర్లైన్స్:

  • బ్లూ వింగ్ ఎయిర్లైన్స్
  • కరేబియన్ కమ్యూటర్ ఎయిర్వేస్ (కరికోమ్ ఎయిర్వేస్) (సురినామ్ ఎయిర్వేస్ కమ్యూటర్)
  • గమ్ ఎయిర్
  • సురినామ్ ఎయిర్వేస్ (ఎస్.ఎల్.ఎం)
  • సురినాం వచ్చే ఎయిర్లైన్స్:
  • కరేబియన్ ఎయిర్లైన్స్ (ట్రినిడాడ్ & టొబాగో)
  • డచ్ ఆంటిల్లెస్ ఎక్స్ప్రెస్ (డిఎ.ఇ.) (కురాకా)
  • ఇన్సెల్ ఎయిర్ (కురాకా)
  • ఇన్సెల్ ఎయిర్ అరుబా (అరుబా)
  • కె.ఎల్.ఎం (నెదర్లాండ్స్)
  • సురినామ్ ఎయిర్వేస్ (ఎస్.ఎల్.ఎం) (అరుబా, బ్రెజిల్ (బెలెమ్), కురాకో, గయానా (జార్జిటౌన్), నెదర్లాండ్స్ (ఆమ్స్టర్డామ్), ట్రినిడాడ్ & టొబాగో (పోర్ట్ ఆఫ్ స్పెయిన్), & యు.ఎస్.ఎ. (మయామి).)
  • ఒక ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికేషన్తో ఉన్న ఇతర జాతీయ సంస్థలు:
  • ఏరో క్లబ్ సురినామ్ (ఎ.సి.ఎస్.) - జనరల్ ఏవియేషన్ ఏరోక్లబ్
  • కారోని ఏరో ఫార్మర్స్ (సి.ఎ.ఎఫ్) - వ్యవసాయం పంటలు
  • ఈగల్ ఎయిర్ సర్వీసెస్ (ఇ.ఎ.ఎస్) - వ్యవసాయం పంటలు
  • ఇ.ఆర్.కె. ఫార్మ్స్ (ఇ.ఆర్.కె.) - వ్యవసాయం పంటలు
  • హాయ్-జెట్ హెలికాప్టర్ సర్వీసెస్ (హెచ్.ఐ-జెట్) హెలికాప్టర్ ఛార్టర్స్
  • కుయ్కేక్ ఏవియేషన్ (కరికోమ్ ఎయిర్వేస్ యొక్క భాగం) - జనరల్ ఏవియేషన్ ఫ్లైయింగ్ స్కూల్స్
  • ఓవరీం ఎయిర్ సర్వీస్ (ఒ.ఎ.ఎస్) - జనరల్ ఏవియేషన్ చార్టర్
  • పెగాసస్ ఎయిర్ సర్వీస్ (పి.ఎ.ఎస్) - హెలికాప్టర్ ఛార్టర్స్
  • సురినామ్ ఎయిర్ ఫోర్స్ / సురినామ్సే లచ్ట్మాచ్ట్ (ఎస్.ఎ.ఎఫ్ / లము) - మిలిటరీ ఏవియేషన్ సూరినం ఎయిర్ ఫోర్స్
  • సురినామ్ స్కై రైఫర్స్ (ఎస్.ఎస్.ఎఫ్) - వ్యవసాయం పంటలు
  • సురినామెస్ మెడిస్చే జెండింగ్స్ వాలిగ్డిఎన్స్తెస్ట్ (ఎం.ఎ.ఎఫ్ - మిషన్ ఏవియేషన్ ఫెలోషిప్) - జనరల్ ఏవియేషన్ మిషనరీ
  • వోర్టెక్స్ ఏవియేషన్ సురినామే (VAS) - జనరల్ ఏవియేషన్ నిర్వహణ & ఫ్లైయింగ్ స్కూల్
Remove ads

పర్యావరణం

సురినాం వైవిధ్యమైన వాతావరణం , ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటాయి.[49] అక్టోబరు 2013 లో సురినామే ఎగువ పాలమూయు నది వాటర్ షెడ్డులో మూడు వారాల యాత్రలో పర్యావరణ వ్యవస్థలను పరిశీలిస్తున్న 16 అంతర్జాతీయ శాస్త్రవేత్తలు 1,378 జాతుల జీవజాలాన్ని జాబితాగా చేసారు. గతంలో గుర్తించబడని ఆరు జాతుల-కప్పలు, ఒక జాతి పాము , 11 జాతుల చేపలతో సహా. [50][51][52][53] అన్వేషణ యాత్రకు నిధులు సమకూర్చిన " ఎంవిరాన్మెంటల్ నాన్-ప్రాఫిట్ కన్జర్వేషన్ ఇంటర్నేషనల్" నివేదిక ఆధారంగా. సురినామ్ పుష్కలమైన మంచినీటిని అందిస్తున్న నదీప్రవాహాలు సురినామ్ జీవవైవిధ్యం , ఈ ప్రాంతంలోని ఆరోగ్యకరమైన పర్యావరణ వ్యవస్థలకు చాలా సహకరిస్తున్నాయని భావిస్తున్నారు. [54] అమెరికా లోని ఉష్ణమండల ప్రాంతానికి చెందిన సురినామ్ కస్టమ్స్ నివేదికలో " స్నేక్వుడ్ (బ్రొసిమం క్యుయాంసె)" ఒక పొద లాంటి చెట్టును తరచుగా చట్టవిరుద్ధంగా ఫ్రెంచ్ గయానాకు ఎగుమతి చేస్తున్నారని వెల్లడించింది. ఇది చేతిపనుల పరిశ్రమకు ఉపకరిస్తుందని భావిస్తున్నారు.[55]

పర్యావరణ పరిరక్షణ

2013 మార్చిన " రెడీనెస్ ప్రిపరేషన్ ప్రపోజల్ "ను ఫారెస్ట్ కార్బన్ పార్టిసిపేట్ ఫెసిలిటీ పార్టిసిపెంట్స్ కమిటీ సభ్యుల ఆమోదం పొందింది.[56] సభ్య దేశాలలో ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, నెదర్లాండ్స్, నార్వే, స్పెయిన్, స్విట్జర్లాండ్, యు.కె, యునైటెడ్ స్టేట్స్ , యూరోపియన్ కమిషన్ ఉన్నాయి.[57] సెంట్రల్ , దక్షిణ అమెరికాలోని ఇతర ప్రాంతాల మాదిరిగానే స్థానిక ప్రజలు వారి భూములు రక్షించడానికి , ఆవాసాలను కాపడడానికి క్రియాశీలతగా ప్రయత్నిస్తున్నారు.2015 మార్చిలో దక్షిణ సురినామ్లో 72,000 చదరపు కిలోమీటర్ల (27,799 చదరపు మైళ్ళు) విస్తీర్ణంలో దేశీయ పరిరక్షణా కారిడార్ స్థాపించాలని ప్రకటించిన సురినాం " జాతీయ అసెంబ్లీకి " ట్రియో, వేయనా కమ్యూనిటీలు సహకారాన్ని ప్రకటించాయి.ఈ ప్రకటనకు " కంసర్వేట్వ్ ఇంటర్నేషనల్ (సి.ఐ) , వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) Guianas మద్దతు ఇచ్చింది. ఈ కారిడార్ దాదాపు సురినామెలో సగభాగంలో ఉంటుంది.[58] ఈ ప్రాంతంలో ఉన్న దట్టమైన అడవులు దేశం వాతావరణ పునరుద్ధరణ, మంచినీటి భద్రత, , వ్యూహాత్మక హరితదనం అభివృద్ధికి ముఖ్యమైనవని భావిస్తున్నారు.[58]

Remove ads

పర్యాటకం

సురినామ్ ఆర్థిక వ్యవస్థకు హోటెల్ పరిశ్రమ చాలా ముఖ్యం. అపార్టుమెంటుల అద్దె లేదా అద్దె-నివాసగృహాల అద్దెకు ఇవ్వడం కూడా సురినామ్‌లో ప్రసిద్ధి చెందింది. చాలామంది పర్యాటకులు దేశంలోని దక్షిణప్రాంతంలో ఉన్న ప్రాచీన అమెజానియన్ వర్షపు అడవుల అత్యుత్తమ జీవవైవిధ్యానికి సందర్శించడానికి సురినాం చేరుకుంటున్నారు. ఇవి వృక్షజాలం , జంతుజాలం ​​కోసం ప్రసిద్ధి చెందాయి. " సెంట్రల్ సురినాం నేచర్ రిజర్వ్ " అతిపెద్ద రిజర్వాయర్‌గా , ప్రసిద్ధి చెందిన రిజర్వాయర్‌గా ఉంది. బ్రౌంస్‌బర్గ్ రిజర్వాయర్‌కు కనుచూపుమేరలో ఉన్న బ్రౌంస్‌బర్గ్ నేచర్ పార్కుతో పాటు అత్యంత ప్రజాదరణ పొందిన రిజర్వులలో ఒకటిగా ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అతిపెద్ద మానవ నిర్మిత సరస్సులలో ఒకటిగా ఉంది. ఈ రిజర్వాయర్లోని టోంకా ద్వీపం సారామాక్కేకర్ మరూవ్స్ నడిపే ఒక సాహసవంతమైన పర్యావరణ-పర్యాటక పథకాన్ని కలిగి ఉంది.[59] కాలాబాషాలతో తయారు చేసిన పాంగీ ర్యాప్స్ , బౌల్స్ అనే రెండు ప్రధాన ఉత్పత్తులు పర్యాటకుల కొరకు తయారు చేయబడుతున్నాయి. రంగురంగుల , అలంకరించబడిన పాంగీస్ పర్యాటకులలో ప్రసిద్ది చెందినట్లు మరూంస్ తెలుసుకున్నారు.[60] ఇతర ప్రసిద్ధ అలంకార స్మృతి చిహ్నాలలో చేతితో చెక్కబడిన ఊదా-గట్టి చెక్క బౌల్స్, ప్లేట్లు, డబ్బాలు, చెక్క పెట్టెలు , గోడ డీకర్లను ప్రధానంగా ఇక్కడ తయారు చేయబడుతున్నాయి.

దేశవ్యాప్తంగా అనేక జలపాతాలు కూడా ఉన్నాయి. రాలీగ్వాల్లెన్, లేదా రాలీ జలపాతాలు,కాపెనెమే నది మీద స్థాపించబడిన 56,000 హెక్టార్ల (140,000 ఎకరాల) ప్రకృతి రిజర్వ్, ఇది పక్షి జీవితానికి అధికంగా సహకరిస్తుంది. నికెరీ నదీ ప్రహంలో వొలోతోబో జలపాతాలు , బ్లాంచే మేరీ జలపాతాలు కూడా ఉన్నాయి. దేశం మధ్యలో ఉన్న టాఫెల్బెర్గ్ పర్వతం సర్మాకాకా నది మూలం సమీపంలో రిజర్వ్ - టఫెల్బర్గ్ నేచర్ రిజర్వు - ఉంది.ఉత్తరప్రాంతంలో రాల్లీవాల్లేన్లోని కాప్పెనమే నదిలో వోల్జ్‌బర్గ్ ప్రకృతి రిజర్వ్ ఉంది. లోపలి భాగంలో అనేక మెరూన్ , అమెరిన్డియన్ గ్రామాలు ఉన్నాయి. వీటిలో చాలామంది తమ సొంత రిజర్వ్‌లను కలిగి ఉంటారు. వీటిలో సందర్శకులను సాధారణంగా అనుమతిస్తుంటారు.

దేశంలోని ప్రతి ఒక్క జీవవ్యవస్థలలో ఒకదానిని వన్యప్రాణి రిజర్వ్గా ప్రకటించిన ప్రపంచంలోని కొన్ని దేశాలలో సురినాం ఒకటి. సునామ్‌ మొత్తం భూభాగంలో దాదాపు 30% చట్టపరంగా రక్షించబడుతుంది.సురినామ్ నది వెంట ఉన్న లార్విజ్క్ తోటలు ఇతర ఆకర్షణలలో ఉన్నాయి. ఈ తోటలను చేరుకోవడానికి సురినామ్ ఉత్తర సెంట్రల్ వానికా జిల్లాలో దొమ్బర్గ్ గుండా పడవలో మాత్రమే ప్రయాణించి చేరుకోవచ్చు.

ప్రత్యేక భవనాలు

Thumb
The Cathedral of St. Peter and Paul in Paramaribo

కరివిజనే జిల్లాలో సురినామ్ నదిపై మీద పారమరిబో , మీర్జోర్గ్ మధ్య " జూల్స్ విజ్డెన్బోస్చ్ వంతెన "వంతెన నిర్మించబడింది. ఈ వంతెన ప్రెసిడెంట్ జూల్స్ ఆల్బర్ట్ విజ్డెన్బోస్చ్ (1996-2000) కాలంలో నిర్మించబడింది ఇది 2000 లో పూర్తయింది. వంతెన 52 మీటర్లు (171 అడుగులు) ఎత్తు , 1,504 మీటర్లు (4,934 అడుగులు) పొడవు ఉంది. ఇది ఇంతకు మునుపు ఫెర్రీ మాత్రమే అనుసంధానించబడిన పారామరాయిబోను కమ్విజిన్‌ ప్రాంతాలను ప్రస్తుతం ఈ వంతెన నిర్మాణం అనుసంధానిస్తూ ఉంది. సురినామ్ తూర్పుభాగం అభివృద్ధిని సులభతరం చేయడం , ప్రోత్సహించడం ప్రధానప్రయోనంగా ఈ వంతెన నిర్మించబడింది.ఈ వంతెనలో రెండు దారులు (ఒక లేన్ ప్రతి మార్గం) ఉన్నాయి. పాదచారులకు ఇది అందుబాటు లేదు.

జనవరి 1883లో ప్రారంభం అయిన " సెయింట్.పీటర్ , పౌల్ కేథడ్రల్ " కేథడ్రాల్ కావడానికి ముందు ఒక థియేటర్‌గా ఉండేది. 1809 లో నిర్మించబడిన థియేటర్ 1820 లో దహనం చేయబడింది.ఒక మసీదు పక్కనే ఒక యూదుడు ఉన్న కొన్ని ప్రపంచదేశాలలో సురినామె దేశం ఒకటి.[61] ఈ రెండు భవనాలు పారామెరిబో మధ్యలో ఒకదానికొకటి పక్కనే ఉన్నాయి , ఒకే సమయంలో వాటికి సంబంధించిన మతపరమైన ఆచారాల జరిగే సమయంలో ఒకదానికొకటి పార్కింగ్ సదుపాయాన్ని పంచుకుంటాయి.

పారామరాయోబాలోని వనికేలో ఉన్న జోహన్ అడాల్ఫ్ పెంగాల్స్‌ట్రోలో నిర్మించిన " హిందూ ఆర్య దేవకర్ " ఆలయం కొత్త మైలురాయిగా నిలిచింది. ఇది 2001 లో ప్రారంభించబడింది.హిందూ దేవతామూర్తులు లేకపోవడం ఈ ఆలయం ప్రత్యేకత. ఈ దేవాలయం నిర్మించిన ఆర్య సమాజ్ హిందూ మతం ఉద్యమం విగ్రహారాధనను నిషేధించింది.విగ్రహాలకు బదులుగా, భవనం వేదాలు , ఇతర హిందూ గ్రంథాల , ఇతర వ్రాతలు ఉన్నాయి.ఆకర్షణీయమైన నిర్మాణవైభం కలిగిన ఈ దేవాలయం పర్యాటక ఆకర్షణలలో ఒకటిగా ఉంది.

ఆరోగ్యం

స్త్రీల సంతానోత్పత్తి 2.6%.[62] 2004లో ఆరోగ్య సంరక్షణకు ప్రభుత్వ వ్యయం జి.డి.పి.లో 3.6%. ప్రైవేట్ వ్యయం 4.2%.[62] 2000 గణాంకాల ఆధారంగా 1,00,000 మందికి 45 మంది వైద్యులు ఉన్నారు.[62] శిశుమరణాలు 1,000 మందికి 30.[62] పురుషుల ఆయుఃపరిమితి 66.4 సంవత్సరాలు.స్త్రీల ఆయుఃపరిమితి 73 సంవత్సరాలు.[62]

విద్య

సురినామ్‌లో 12 సంవత్సరాల వరకు నిర్బంధ విద్య అమలులో ఉంది.[63] 2004 లో గణాంకాల ఆఫ్హారంగా నికర ప్రాథమిక నమోదు రేటు 94% ఉంది. [62] పురుషులు ప్రత్యేకంగా చాలా మంది అక్షరాశ్యులై ఉంటారు.[62] సురినాం లోని ప్రధాన విశ్వవిద్యాలయం " అంటోన్ డి కోమ్ యూనివర్సిటీ ఆఫ్ సురినాం ".ప్రాథమిక పాఠశాల నుండి ఉన్నత పాఠశాల వరకు 13 తరగతులు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాలలో ఆరు తరగతులు, మధ్య పాఠశాల నాలుగు తరగతులు , ఉన్నత పాఠశాల మూడు తరగతులు ఉన్నాయి. ప్రాథమిక పాఠశాల విద్య ముగించిన తరువాత విద్యార్థులకు నిర్వహించబడే పరీక్షాఫలితాల ఆధారంగా విద్యార్థులు ఉన్నత ప్రమాణాలు కగిన ఎం.యు.ఎల్.ఒ. (సెకండరీ ఆధునిక పాఠశాల) లేదా తక్కువ ప్రమాణాలు కలిగిన ఎ.బి.జి.ఒ.పాఠశాలలో ప్రవేశించాలా అన్నది నిర్ణయించబడుతుంది. ప్రాథమిక పాఠశాల నుండి విద్యార్థులు ఆకుపచ్చ చొక్కా జీన్స్ ధరిస్తారు. మధ్య పాఠశాల విద్యార్థులు జీంస్ నీలం చొక్కాను ధరిస్తారు.

సెకండరీ గ్రేడ్ మిడిల్ స్కూల్ నుంచి మూడవ గ్రేడ్ వరకు వెళ్ళే విద్యార్థులు వ్యాపారం లేదా సైన్స్ కోర్సుల మధ్య ఎంచుకోవాలి. ఇది వారి ప్రధాన సబ్జెక్టు ఏమిటో నిర్ణయిస్తుంది. గణిత , భౌతిక శాస్త్రాన్ని అధ్యయనం చేయడానికి విద్యార్థి మొత్తం 13 పాయింట్లను కలిగి ఉండాలి. విద్యార్థి తక్కువ పాయింట్లు కలిగి ఉంటే అతను / ఆమె వ్యాపార కోర్సులు లోకి వెళ్ళి లేదా గ్రేడ్ విఫలం.

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads