సూరత్ లోక్‌సభ నియోజకవర్గం

గుజరాత్‌లోని లోక్‌సభ నియోజకవర్గం From Wikipedia, the free encyclopedia

Remove ads

సూరత్ గుజరాత్ రాష్ట్రంలోని 26 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఇప్పటివరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు నిర్వహించగా భారతీయ జనతా పార్టీ 7 సార్లు, కాంగ్రెస్ పార్టీ 6 సార్లు, జనతా పార్టీ, కాంగ్రెస్ (ఓ) చెరోసారి విజయం సాధించాయి. పూర్వ ప్రధానమంత్రి మురార్జీ దేశాయ్ ఈ నియోజకవర్గం నుంచి వరసగా 5 సార్లు విజయం సాధించాడు. భాజపాకు చెందిన కాశీరాం రాణా వరసగా 6 సార్లు విజయం సాధించి డబుల్ హాట్రిక్ సృష్టించారు.

త్వరిత వాస్తవాలు స్థాపన లేదా సృజన తేదీ, దేశం ...
Remove ads

అసెంబ్లీ సెగ్మెంట్లు

గెలుపొందిన లోక్‌సభ సభ్యులు

ఇప్పటివరకు ఈ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించిన సభ్యులు, వారి పార్టీల వివరాలు:[1]

మరింత సమాచారం సంవత్సరం, పేరు ...
Remove ads

2019 ఎన్నికలు

2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి దర్శన విక్రమ్ జర్దోష్ 5,48,230 ఓట్ల తేడాతో గెలిచింది. దర్శన విక్రమ్ జర్దోష్ 74.00 శాతం ఓట్లతో 795,651 ఓట్లను, 247,421 ఓట్లు (23.14 శాతం) పొంది కాంగ్రెస్ అభ్యర్థి అశోక్ పటేల్ (అధేవాడ) ను ఓడించింది.

2014 ఎన్నికలు

2014 లోక్‌సభ ఎన్నికలలో, బిజెపి నుండి దర్శన విక్రమ్ జర్దోష్ సీటును గెలిచి, 75.75 శాతం ఓట్‌షేర్‌తో 718,412 ఓట్లను పొందింది. కాంగ్రెస్ అభ్యర్థి దేశాయ్ నైషద్‌భాయ్ భూపత్‌భాయ్ 185,222 ఓట్లు (19.53 శాతం) సాధించి రన్నరప్‌గా నిలిచారు. దర్శన విక్రమ్ జర్దోష్ 533,190 ఓట్ల తేడాతో దేశాయ్ నైషద్‌భాయ్ భూపత్‌భాయ్‌పై విజయం సాధించింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads