ఇస్లామీయ కేలండర్

From Wikipedia, the free encyclopedia

ఇస్లామీయ కేలండర్
Remove ads

ఇస్లామీయ కేలండర్ లేదా ముస్లిం కేలండర్ (అరబ్బీ : التقويم الهجري అత్-తఖ్వీమ్ అల్-హిజ్రి), ఇస్లామీయ దేశాలలో, ముస్లింల సముదాయాలలో అవలంబింపబడుతున్న కేలండర్. ఇది చంద్రమాసాలపై ఆధారంగా గలది కావున దీనికి 'తఖ్వీమ్-హిజ్రి-ఖమరి' అని కూడా అంటారు. ఈ కేలండర్ లో 12 చంద్రమాసాలు, దాదాపు 354 దినాలు గలవు.

త్వరిత వాస్తవాలు విశాల వాడుక, ఎంపిక చేయబడి వాడుక ...
త్వరిత వాస్తవాలు
Remove ads

హిజ్రీ శకం

"హిజ్రీ శకా"నికి మూలం ముహమ్మద్ ప్రవక్త గారి హిజ్రా (هِجْرَة), హిజ్రాహ్ లేదా హిజ్రత్. మహమ్మదు ప్రవక్త , అతని అనుయాయులు మక్కా నుండి మదీనా కు సా.శ. 622 లో వలసవెళ్ళారు. ఈ వలస వెళ్ళడాన్నే హిజ్రత్ అని అంటారు.

సెప్టెంబరు 622 లో మహమ్మదు ప్రవక్త తన అనుయాయులతో కలసి హిజ్రత్ (వలస చేసి) 'యస్రిబ్' నగరాన్ని చేరుకొన్నారు. యస్రిబ్ నగరానికి మదీనా (తెలుగార్థం: నగరం) లేదా "మదీనతున్-నబీ" లేదా నబీ (ప్రవక్త) గారి నగరంగా పేరు స్థిరపడింది. ముస్లింల శకం హిజ్రీ ప్రారంభమయింది. ఉమర్ కాలంలో 638లో ఇస్లామీయ కేలండర్ ప్రారంభమయింది. మహమ్మదు ప్రవక్త గారి వలస క్రింది విధంగా జరిగింది.

Remove ads

వలస జరిగిన క్రమం

  • దినము 1: గురువారం 26 సఫర్ నెల, హి.శ. 1, 9 సెప్టెంబరు 622
    • మక్కానగరం లోని తన ఇంటిని వదిలారు. మక్కాకు దగ్గరలోని తూర్ గుహలో మూడు రోజులు గడిపారు.
  • దినము 5: సోమవారము 1 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, 13 సెప్టెంబరు 622
    • మక్కా పొలిమేరలు దాటి యస్రిబ్ ప్రాంతానికి పయనం.
  • దినము 12: సోమవారం 8 రబీఉల్ అవ్వల్ నెల, హి.శ. 1, 20 సెప్టెంబరు 622
    • మదీనా దగ్గరలోని "ఖుబా" ప్రాంతానికి చేరుక.
  • దినము 16: శుక్రవారం 12 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, 24 సెప్టెంబరు 622
    • ఖుబా నుండి మదీనా ప్రయాణం, శుక్రవారపు ప్రార్థనలు.
  • దినము 26: సోమవారం 22 రబీఉల్ అవ్వల్, హి.శ. 1, 4 అక్టోబరు 622
    • మదీనా మొదటి దర్శనం

హిజ్రీ మొహర్రం నెలలో ప్రారంభం కాలేదు. హిజ్రీ ప్రారంభం మొహర్రం నెలలో కాదు. ఇస్లామీయ కేలండరు లోని మూడవనెల అయిన రబీఉల్ అవ్వల్ నెలలో హిజ్రత్ జరిగింది కావున, హిజ్రీ శకం, హి.శ. 1 లోని మూడవ నెల అయిన రబీఉల్ అవ్వల్ 22 వ తేదీన ప్రారంభం అవుతుంది.

Remove ads

ఇస్లామీయ మాసాలు

1. మొహర్రం :محرّم (ముహర్రముల్ హరామ్)

2. సఫర్ : صفر (సఫరుల్-ముజఫ్ఫర్)

3. రబీఉల్-అవ్వల్ : ربيع الأول

4. రబీఉల్-ఆఖిర్ (రబీఉస్-సాని): ربيع الآخر أو ربيع الثاني

5. జమాదిఉల్-అవ్వల్: جمادى الأول

6. జమాదిఉస్-సాని: جمادى الآخر أو جمادى الثاني

7. రజబ్ : رجب (రజబ్-ఉల్-మురజ్జబ్)

8. షాబాన్ : شعبان (షాబానుల్-ముఅజ్జమ్)

9. రంజాన్ : رمضان (రంజానుల్-ముబారక్)

10. షవ్వాల్: شوّال (షవ్వాలుల్-ముకర్రమ్)

11. జుల్-ఖాదా: ذو القعدة

12. జుల్-హిజ్జా: ذو الحجة

వారములోని దినాలు

ఇస్లామీయ వారము తెలుగువారములానేవుంటుంది. వారములోని మొదటిదినము ఆదివారము 'ఇత్వార్' తో ప్రారంభము అవుతుంది. ముస్లింలకు పవిత్రదినం శుక్రవారము. శుక్రవారము ముస్లింలు 'జుమా' ప్రార్థనలకు హాజరవుతారు. "يوم" (యౌమ్) అనగా దినము.

మరింత సమాచారం తెలుగు లిప్యాంతరీకరణ, అరబ్బీ పేరు ...
Remove ads

ఇవీ చూడండి

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads