8 వసంతాలు
From Wikipedia, the free encyclopedia
Remove ads
8 వసంతాలు 2025లో విడుదలైన తెలుగు సినిమా. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై రవి శంకర్ నిర్మించిన ఈ సినిమాకు ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహించాడు.[1] అనంతిక సనిల్‌కుమార్, రవి దుగ్గిరాల, హను రెడ్డి, కన్నా పసునూరి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను జూన్ 15న విడుదల చేయగా,[2] సినిమా జూన్ 20న విడుదలైంది.
8 వసంతాలు సినిమా జులై 11 నుండి నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో స్ట్రీమింగ్ ప్రారంభమైంది.[3][4]
Remove ads
కథ
శుద్ధి అయోధ్య (అనంతిక సనీల్ కుమార్) ఓ యువ రచయిత్రి. రచనలే కాకుండా మార్షల్ ఆర్ట్స్, బ్లాక్ బెల్ట్‌లో ఆరి తేరిన వ్యక్తి. వరుణ్ (హనురెడ్డి) శుద్ది రచనల్ని, ఆమె వ్యక్తిత్వాన్ని చూసి ఇష్టపడతాడు. ప్రేమిస్తున్నా అంటూ వెంట పడతాడు. వరుణ్ తన స్వార్థాన్ని చూసుకుని శుద్ధిని వదిలేసి విదేశాలకు వెళతాడు. స్వాభిమానం, ఆత్మ గౌరవం ఉన్న శుద్ధి ఆ తరువాత ఏం చేస్తుంది? ఆ తర్వాత ఊటీలో తెలుగు రచయిత సంజయ్ (రవి దుగ్గిరాల) శుద్ధికి పరిచయం అవుతాడు. అనుకోకుండా శుద్ధికి ఫ్యామిలీ ఎస్టేట్ బాధ్యతలు చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. చివరకు ఏమైంది? అనేదే మిగతా సినిమా కథ.[5][6][7]
Remove ads
నటీనటులు
- శుద్ధి అయోధ్యగా అనంతిక సనిల్‌కుమార్[8]
- సంజయ్ గా రవి దుగ్గిరాల
- వరుణ్ గా హను రెడ్డి
- కార్తీక్ గా కన్నా పసునూరి
- అనితగా సంజన హర్దగేరి
- యశోదగా సమీర కిషోర్
- మాస్టర్ గా స్వరాజ్ రెబ్బాప్రగడ
- రాహుల్‌గా సుమంత్ విలాస్ నిట్టూర్కర్
పాటలు
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads