తెల్లవారితే గురువారం
మణికాంత్ జెల్లి దర్శకత్వంలో 2021లో విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా From Wikipedia, the free encyclopedia
Remove ads
తెల్లవారితే గురువారం, 2021 మార్చి 27న విడుదలైన తెలుగు రొమాంటిక్ కామెడీ సినిమా. వారాహి చలన చిత్రం, లౌక్యా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లలో రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని నిర్మించిన ఈ సినిమాకు మణికాంత్ జెల్లి దర్శకత్వం వహించాడు. ఇందులో శ్రీ సింహా, చిత్ర శుక్ల, మిషా నారంగ్ ప్రధాన పాత్రల్లో నటించగా, కాల భైరవ సంగీతం అందించాడు.[3][4][5][6][7]
Remove ads
కథా నేపథ్యం
సివిల్ ఇంజనీరైన వీరేంద్ర (శ్రీసింహా), తన తండ్రి వెంకటరత్నం (రవివర్మ) సహాయంతో హైదరాబాదులో కన్ స్ట్రక్షన్ కంపెనీని నిర్వహిస్తూ ఉంటాడు. అతనికి సూర్యనారాయణ (రాజీవ్ కనకాల) కూతురు మధుబాల (మిషా నారంగ్)తో పెళ్ళి కుదురుతుంది. తెల్లవారితే గురువారం నాడు పెళ్ళి. మొగుడు అంటే నరకం చూపించే మనిషి అని చిన్నప్పటి నుండీ టీవీ సీరియల్స్ చూసి మెంటల్ గా ఫిక్స్ అయిపోయిన మధుబాల పెళ్ళి మండపం నుండి పారిపోవాలనుకుంటుంది. లేడీ డాక్టర్ కృష్ణవేణి (చిత్ర శుక్లా)తో పీకల్లోతు ప్రేమలో ఉన్న వీరేంద్ర కృష్ణవేణి నుండి ఫోన్ రావడంతో ఆమె దగ్గరకు వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఎవరికివాళ్లు విడిగా పెళ్లి మంటపం నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్న ఆ ఇద్దరూ కలిసి ప్రయాణం చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఆ తరువాత ఏం జరిగిందన్నది మిగతా కథ.[8]
Remove ads
నటవర్గం
- శ్రీ సింహా
- చిత్ర శుక్ల
- మిషా నారంగ్
- రాజీవ్ కనకాల
- సత్య
- అజయ్
- వైవా హర్ష
- శరణ్య ప్రదీప్
- గిరిధర్
- ప్రియ
- రవివర్మ
- పార్వతి
- సిరి హనుమంత్
- మౌర్య
- పద్మావతి
పాటలు
ఈ సినిమాకి కాల భైరవ సంగీతం అందించాడు. కిట్టు విస్సాప్రగడ, రఘురామ్, కృష్ణ వల్లెపు పాటలు రాశారు.[9]
- అరె ఏమైందో ఏమో
- మనసుకి హనికరం అమ్మాయే
- మెల్లగా మెల్లగా
విడుదల
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads