నీలేశ్వరపాలెం (అచ్చంపేట మండలం)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, అచ్చంపేట మండల గ్రామం From Wikipedia, the free encyclopedia

Remove ads

నీలేశ్వరపాలెం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం రెవెన్యూయేతర గ్రామం.

త్వరిత వాస్తవాలు నీలేశ్వరపాలెం (అచ్చంపేట మండలం), దేశం ...
Remove ads

గ్రామ చరిత్ర

ఆంధ్ర ప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ) పరిధిలోకి వస్తున్న మండలాలు, గ్రామాలను ప్రభుత్వం విడిగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం గుర్తించిన వాటిలోని చాలా గ్రామాలు వీజీటీఎం పరిధిలో ఉన్నాయి. గతంలో వీజీటీఎం పరిధిలో ఉన్న వాటితోపాటుగా ఇప్పుడు మరిన్ని కొన్ని గ్రామాలు చేరాయి. సీఆర్‌డీఏ పరిధిలోకి వచ్చే గుంటూరు, కృష్ణా జిల్లాల్లోని మండలాలు, గ్రామాలను గుర్తిస్తూ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ద్వారా ఉత్తర్వులు జారీ అయ్యాయి.[1]

Remove ads

గ్రామ వాతావరణం

ఈ ఊరి చుట్టూరా పచ్చని పొలాలు, ఎతైన కొండలు అనందానికి కొదవలేని ప్రకృతి శోభాయానంతో వెలుగోనుతుంది. ఈఊరు మతసామరస్యానికి నిలయం. అన్ని మతాలు ఒక్కటిగా ఉంటాయి. ఈ ఊరిలో శ్రీ నీలేకంఠేశ్వర స్వామి ఆలయం ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏట ఈ ఊరిలో పండగ జాతరాలు చాల వైభవంగా జరుగుతాయి. ఈ ఊరిలో రెండు చిన్న తండాలు ఉన్నాయి. వాటి పేర్లు పాత తండా, కొత్త తండా ఇవి చాలా దగ్గరగా ఉంటాయి. ఈ ఊరిలో నాయక్‌లు (లంబాడిలు), యాదవులు ఉంటారు. ఎటువంటి భేదాభిప్రాయాలు లేకుండా జీవిస్తారు. ఈ ఊరులో చాల కాలం నుంచి చదువు కోవటానికి వసతి లేనందున, అందరు వ్యవసాయానికి అలవాటు పడ్డారు. కానీ 2000 సంవత్సరం నుండి చదువుకోవడం అలవాటు చేసుకున్నారు. ఈ ఊరిలో చాల ఇంటి పేర్లు ఉన్నాయి, వాటిలో ముఖ్యమైనవి - బాణావతు, రామావతు, ధారావతు, మూడావతు వంటివి.ఈ ఊరిలో మిరప, ప్రత్తి, వరి వంటి పంటలు పండుతాయి. చాల మంది కూలికి వెళ్తారు. ఈ ఊరికి దగ్గరలో అచ్చంపేట మండలం ఉంది. అది 3 కి.మీ. దూరం ఉంటుంది. ఈ ఊరికి ఎటువంటి సరుకులకైన, ఇతర అవసరాలకు చాలా మంది అచ్చంపేట వెళ్తారు. ఈ గ్రామం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతుంది.

Remove ads

మూలాలు

వెలుపలి లంకెలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads