పోచారం పురపాలకసంఘం
భారతదేశంలోని గ్రామం From Wikipedia, the free encyclopedia
Remove ads
పోచారం పురపాలకసంఘం, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాకు చెందిన ఒక పట్టణ స్థానిక స్వపరిపాలన సంస్థ. పోచారం పట్టణం దీని ప్రధాన పరిపాలన కేంద్రం. ఈ పురపాలక సంఘం మల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గం లోని మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో ఉంది.[1]
Remove ads
చరిత్ర
మేజర్ గ్రామ పంచాయితీగా ఉన్న పోచారం, తెలంగాణ ప్రభుత్వం చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న పురపాలక సంఘంగా ఏర్పడింది.[2]
భౌగోళికం
పోచారం 20.74 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోఉంది. ఇది 17.173°N 78.607°E అక్షాంశరేఖాంశాల మధ్య ఉంది. రాష్ట్ర రాజధాని హైదరాబాదు నుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది.
జనాభా గణాంకాలు
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, పురపాలక సంఘం పరిధిలో ఉన్న జనాభా మొత్తం 21946 మంది కాగా, అందులో 11698 మంది పురుషులు, 10248 మంది మహిళలు ఉన్నారు. 10,667 గృహాలు ఉన్నాయి ఇది పరిపాలనా పరంగా మునిసిపాలిటీ రెవెన్యూ వార్డులుగా విభజించబడింది.[3]
పౌర పరిపాలన
పురపాలక సంఘం కౌన్సిల్ కు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నిక జరుగుతుంది. పురపాలక సంఘం పరిధిలోని జనాభా ప్రాతిపదికననుసరించి దీనిని 6 ఎన్నికల వార్డులుగా విభజించారు. ప్రతి వార్డుకు వార్డు కౌన్సిలర్ ప్రాతినిధ్యం వహిస్తాడు. కౌన్సిల్ బోర్డుకు చైర్‌పర్సన్ నేతృత్వం వహిస్తారు. 2020 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో చైర్‌పర్సన్‌గా, వైస్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైనారు.[4] వీరు ఎన్నికైననాటినుండి ఐదు సంవత్సరాలు పదవిలో కొనసాగుతారు.
వార్డు కౌన్సిలర్లు
- గొంగల్ల మహేష్
- నర్రి ధనలక్ష్మి
- చింతల రాజశేఖర్
- రెడ్యానాయక్
- బి. కొండల్ రెడ్డి
- సింగిరెడ్డి సాయిరెడ్డి
- ఎ. శైలజ రెడ్డి
- బి. హేమ
- మెట్టు బాల్రెడ్డి
- బాలగోని వెంకటేష్ గౌడ్
- నల్లవెల్లి లక్ష్మి ముదిరాజ్
- బి. హరి ప్రసాదరావు
- సామల శ్రీలత రెడ్డి
- సుర్వి రవీందర్ గౌడ్
- అబ్బావతి సరిత
- ఎం. పోచమ్మ
- సుర్వి సుధాలక్ష్మి
- బద్దం మమత రాణి
Remove ads
మూలాలు
వెలుపలి లంకెలు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads