భాగ్యశ్రీ బోర్సే
From Wikipedia, the free encyclopedia
Remove ads
భాగ్యశ్రీ బోర్సే (ఆంగ్లం: Bhagyashri Borse) పూణే నగరానికి చెందిన భారతీయ నటి, మోడల్. ఆమె హిందీ చిత్రం యారియాన్ 2 (2023)తో అరంగేట్రం చేసి ప్రసిద్ధి చెందింది. ప్రముఖ దర్శకుడు హరీష్ శంకర్, మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్‌లో 2024లో విడుదలైన తెలుగు సినిమా మిస్టర్ బచ్చన్ లో కథానాయిక పాత్ర ఆమె పోషించి మెప్పించింది.[1][2] అంతే కాదు, ఈ సినిమాలో తన పాత్రకు స్వయంగా డబ్బింగ్ చెప్పుకుంది.
Remove ads
కెరీర్
నైజీరియాలోని లాగోస్ లో భాగ్యశ్రీ బోర్సే చదువుకుంది. భారతదేశం తిరిగి వచ్చి ఆమె బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీలో చేరింది. ఆ సమయంలోనే మోడలింగ్ కెరీర్ గా ఎంచుకుని ఒక ఎజెన్సీతో కలసిపనిచేసింది. పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరించింది. క్యాడ్‌బరీ డైరీ మిల్క్ సిల్క్ యాడ్ తో ఆమె ప్రసిద్ధిచెందింది. అలా బాలీవుడ్ చిత్రం యారియాన్ 2లో రాజ్యలక్ష్మి పాత్రలో తన నటనతో యువతను ఆకట్టుకుంది. ఆ తరువాత, ఆమె చందు ఛాంపియన్ లోనూ నటించింది. హరీశ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన మిస్టర్ బచ్చన్ (2024) చిత్రంలో రవితేజ సరసన ఆమె నటించింది.[3]
Remove ads
ఫిల్మోగ్రఫీ
మూలాలు
బయటి లింకులు
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads