మహాలక్ష్మీ ఆలయం ఆదిలాబాద్

From Wikipedia, the free encyclopedia

మహాలక్ష్మీ ఆలయం ఆదిలాబాద్map
Remove ads

మహాలక్ష్మీ ఆలయం తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ గ్రామీణ మండలంలోని మహాలక్ష్మీ వాడాలో ఉంది[1].ఒకే పీఠం పై మహాలక్ష్మీ,మహంకాళి మాత,సరస్వతీ మాత కొలువై నిత్యదర్శనమిస్తాయి. అత్యంత పవిత్రమైన పురాతన ఆలయంలో ఒకటి[2][3] .

త్వరిత వాస్తవాలు మహాలక్ష్మీ దేవాలయం ఆదిలాబాద్, భౌగోళికాంశాలు: ...
Remove ads

చరిత్ర


Thumb
మహాలక్ష్మీ ఆలయంలోని మాత విగ్రహాలు.

మహాలక్ష్మీ ఆలయానికి సుమారు 700 సంవత్సరాల చరిత్ర ఉందని ఇక్కడి రాతి గోడల పై రాసి ఉన్న రాతల ప్రకారం 1351 లో ఈ ఆలయం నిర్మాణమైనట్లు దాత పేరుతో రాయబడి ఉంది. ఆదిలాబాద్ పట్టణం దట్టమైన అటవీ ప్రాంతం ఉన్నపుడే ఇచట గ్రామ దేవతగా స్థాపించారని పెద్దలు చెబుతుంటారు[4].

పూజ,విధానం

ఈ మహాలక్ష్మీ దేవికి పూజ చేసే సమయంలో భాజాభంత్రీలతో తుమ్మల నారాయణ గాయకుల బృందం భీంసరి వాగు కు వెళ్ళి రాగి పాత్రలో పవిత్ర జలాన్నీ తీసుకొచ్చి దేవతలకు అభిషేకం చేసేవారట. అమ్మవార్లకు సైనుబట్టతో కుట్టిన వస్త్రాలను అలంకరించే కుంకుమ బోట్లు పెట్టి అగర ఒత్తులు వెలిగించి కోబ్బరి కాయలు కోటి పూజ చేసేవారు. శ్రావణమాసంలో నేల రోజులు భజనలు పాడుతు వినాయక చవితి వరకు భజన కార్యక్రమాలు కోనసాగించే వారు.భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించేవారు. ఇచట ఉన్న బావి నీళ్ళతో బ్రహ్మ ముహూర్తంలో దేవతలు స్నానమాచరించే వారిని అంటారు.ఆషాఢ మాసంలో ఈ ఆలయం భక్తులతో అత్యంత సందడిగా ఉంటుంది. అకాడీ పండుగ సంధర్భంగా అమ్మవారికి బోనాలు సమర్పించడానికి [5]వేలాది సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు‌.ఆ సమయంలో ఆలయ పరిసర ప్రాంతం భక్తులతో కోలాహలంగా ఉంటుంది.ఈ ఆలయాన్ని దర్శించుకుంటే కోరుకున్న కోరికలు నేరవేరతాయిని భక్తుల విశ్వాసం[6].

Remove ads

మూలాలు

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.

Remove ads