![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/te/thumb/6/6a/EVV-Satyanarayana.jpg/640px-EVV-Satyanarayana.jpg&w=640&q=50)
ఇ.వి.వి.సత్యనారాయణ
సినిమా దర్శకుడు / From Wikipedia, the free encyclopedia
ఇ.వి.విగా ప్రసిద్ధిచెందిన ఈదర వీర వెంకట సత్యనారాయణ (ఆంగ్లం: E. V. V. Satyanarayana) (జూన్ 10, 1958 - జనవరి 21, 2011) [1] తెలుగు సినిమా దర్శకుడు. తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ఇతడు దర్శకుడు జంధ్యాల శిష్యుడు. ఈతడి మొదటి సినిమా రాజేంద్రప్రసాద్ కథానాయకుడిగా నిర్మింపబడిన చెవిలో పువ్వు. ఈ సినిమా అంతగా విజయవంతం కాలేదు. కొద్ది కాలంతర్వాత నిర్మాత రామానాయుడు ప్రేమఖైదీ చిత్రంలో అవకాశమిచ్చారు. ఆ చిత్రం విజయవంతం కావటంతో పలు అవకాశాలు వచ్చాయి. జంధ్యాల వరవడిలో హస్యప్రధాన చిత్రాలు నిర్మించాడు. జంధ్యాల కంటే కొంతఘాటైన హస్యాన్ని చిత్రాల్లో ప్రవేశపెట్టారు. రాజేంద్ర ప్రసాద్ తో ఆ ఒక్కటి అడక్కు, అప్పుల అప్పారావు, ఆలీబాబా అరడజనుదొంగలు వంటి చిత్రాలు, నరేష్‌తో జంబలకిడి పంబ మొదలైన చిత్రాలు తీశారు. సీతారత్నంగారి అబ్బాయి, ఏవండీ ఆవిడ వచ్చింది (శోభన్ బాబు) లాంటి చిత్రాలతర్వాత ఆమె, తాళి వంటి మహిళాపరమైన చిత్రాలు తీశారు. అగ్రనటులైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో చిత్రాలు తీశారు. కొద్ది విరామం తర్వాత కుమారులిద్దర్ని హీరోలుగా పరిచయంచేశారు.
ఇ.వి.వి.సత్యనారాయణ | |
---|---|
![]() | |
జననం | ఈదర వీర వెంకట సత్యనారాయణ (1956-06-10)1956 జూన్ 10 ![]() |
మరణం | 2011 జనవరి 21(2011-01-21) (వయసు 54) హైదరాబాదు |
మరణ కారణం | కాన్సర్ |
నివాస ప్రాంతం | హైదరాబాదు,తెలంగాణ |
ఇతర పేర్లు | ఇ.వి.వి |
వృత్తి | సినిమా దర్శకుడు, నిర్మాత |
పిల్లలు | ఆర్యన్ రాజేష్, నరేష్ |
తండ్రి | వెంకటరావు |
తల్లి | వెంకటరత్నం |