ఊపిరితిత్తుల క్యాన్సర్ (ఆంగ్లం: Lung cancer, లేదా lung carcinoma[1]) ఊపిరితిత్తుల్లోని కణాలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల వచ్చే క్యాన్సర్.[2] ఈ పెరుగుదల మెటాస్టాసిస్ అనే ప్రక్రియ ద్వారా కేవలం ఊపిరితిత్తులతోనే ఆగిపోకుండా చుట్టూ ఉన్న అవయువాలకు కూడా వ్యాపించే అవకాశం ఉంది.[3] సాధారణంగా ఊపిరితిత్తుల్లో ప్రారంభమయ్యే ప్రాథమిక ఊపిరితిత్తుల క్యాన్సర్ (primary lung cancers) లు కార్సినోమాలు (carcinomas).[4]

Thumb
ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను కలిగి ఉన్న న్యుమోనెక్టమీ నమూనా

ఈ క్యాన్సర్లలో అధిక భాగం (సుమారు 85 శాతం) దీర్ఘకాలం పాటు పొగాకు సేవించే వారిలో కనిపిస్తాయి.[5] 10–15% కేసుల్లో బాధితులు ఎప్పుడూ ధూమపానం చేయలేదు.[6]

2012 గణాంకాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 18 లక్షల మంది ఈ వ్యాధి బారిన పడగా అందులో సుమారు 16 లక్షలమంది మరణించారు.[4] మగవారిలో కాన్సర్ మరణాలలో ఈ వ్యాధి మొదటి స్థానంలో ఉండగా, ఆడవారిలో రొమ్ము కాన్సర్ తర్వాత ఎక్కువ మంది ఈ వ్యాధి వలననే మరణిస్తున్నారు.[7] ఎక్కువ శాతం వ్యాధి నిర్ధారణ 70 సంవత్సరాల వయసులో జరుగుతోంది.[8]

మూలాలు

Wikiwand in your browser!

Seamless Wikipedia browsing. On steroids.

Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.

Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.