ఐస్ క్రీం
From Wikipedia, the free encyclopedia
ఐస్ క్రీం (ఆంగ్లం: Ice Cream) లేదా హిమగుల్మం అనగా పాలు, ఐసు (మంచు), చక్కెర మొదలైన పదార్థాలతో తయారు చేసిన ఒక నోరూరించే తినుబండారం.[1]
త్వరిత వాస్తవాలు వంటకం వివరాలు, వడ్డించే విధానం ...
వంటకం వివరాలు | |
---|---|
వడ్డించే విధానం | Dessert |
ప్రధానపదార్థాలు | Milk or cream, sugar |
వైవిధ్యాలు | Gelato, sorbet, frozen custard |
మూసివేయి
ఐస్ క్రీం ప్రపంచ వ్యాప్తంగా చాలామందికి ఇష్టమైన ఆహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఐస్ క్రీం దుకాణాల వైపు మొగ్గుచూపడం సాధారణంగా జరుగుతుంటుంది. తీవ్రమైన ఎండల ప్రభావం వల్ల కలిగిన అలసటనుండి విముక్తి పొందడానికి జనం ఆశ్రయించే ఈ హిమగుల్మాలు నేడు సర్వకాల సర్వావస్థలయందు మానవుడి ఆహార అంతర్భాగాలలో ఒకటి కావడం విచిత్రమైన పరిణామం.