తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ From Wikipedia, the free encyclopedia
కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్లు పట్టణ అభివృద్ధి ప్రణాళిక సంస్థ.[2] వారసత్వ నిర్మాణాలు, పట్టణం, దాని పరిధి ప్రాంతంలో నిర్ధిష్టమైన అభివృద్ధికి ఈ సంస్థ మార్గనిర్దేశం చేస్తుంది.[3]
కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ | |
---|---|
కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ లోగో | |
సంస్థ వివరాలు | |
స్థాపన | 1982 |
Preceding agency | వరంగల్లు మహానగర పాలక సంస్థలో భాగం |
ప్రధానకార్యాలయం | వరంగల్లు, తెలంగాణ, భారతదేశం |
సంబంధిత మంత్రులు | కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, (ముఖ్యమంత్రి) కల్వకుంట్ల తారక రామారావు, (పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి) |
కార్యనిర్వాహకులు | మర్రి యాదవరెడ్డి[1], చైర్మన్ రవికిరణ్, వైస్ చైర్మన్ |
Parent agency | తెలంగాణ ప్రభుత్వం |
వెబ్సైటు | |
http://www.kuda.in/ |
ఇది 1982 సంవత్సరంలో స్థాపించబడింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పట్టణాల్లోని మౌలిక సదుపాయాల ప్రణాళికను, అభివృద్ధిని వివరించడానికి ఆయా అభివృద్ధి పనులకోసం పట్టణ అభివృద్ధి సంస్థలకు అధికారాలు ఇవ్వబడ్డాయి.
1971లో మున్సిపల్ బోర్డు ఆధ్వర్యంలో మున్సిపల్ అధికారులు 60 చదరపు కిలోమీటర్ల పరిధితో మొదటి ప్రణాళికను తయారుచేశారు. ప్రస్తుత ప్రణాళికలో 1,803 చదరపు కిలోమీటర్లు పరిధిలోవున్న వరంగల్లు నగరం చుట్టూ ఉన్న 19 మండలాలకు చెందిన 181 గ్రామాలలోని 3.3 లక్షల ఇళ్ళలో ఉన్న 14 లక్షలమందికి ఇది వర్తిస్తుంది.[4]
క్రమసంఖ్య | జిల్లా | మండలాలు | మొత్తం మండలాలు |
---|---|---|---|
1 | హన్మకొండ జిల్లా | హన్మకొండ, కాజీపేట, హసన్‌పర్తి, ఐనవోలు, ధర్మసాగర్, వేలేరు, భీమదేవరపల్లి, ఎల్కతుర్తి, కమలాపూర్, దామెర, ఆత్మకూర్, | 11 |
2 | వరంగల్ జిల్లా | వరంగల్, ఖిలా వరంగల్, గీసుగొండ, సంగెం, వర్ధన్నపేట | 5 |
3 | జనగామ జిల్లా | చిల్పూర్, స్టేషన్ ఘన్పూర్, జాఫర్‌గఢ్ | 3 |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.