గుజరాతీ భాష
గుజరాత్ రాష్ట్రంలో మాట్లాడే ఇండో-ఆర్యన్ భాష / From Wikipedia, the free encyclopedia
ఘూర్జరభాష, లేదా ఘూర్జరం, స్థానికంగా గుజరాతీ (ગુજરાતી) ఒక ఇండో-ఆర్య భాష, ఇండో-ఐరోపా భాషాకుటుంబానికి పాక్షికంగా చెందునది. భారతదేశపు గుజరాత్ రాష్ట్రానికిచెందిన ప్రాంతీయ , అధికారికభాష. గుజరాత్‌లోనూ, దాద్రా, నగర్ హవేలి, డామన్, డయ్యులోనూ మాట్లాడే భాష ఇది.
త్వరిత వాస్తవాలు ఘూర్జరం ગુજરાતી గుజరాతీ, అధికారిక స్థాయి ...
ఘూర్జరం ગુજરાતી గుజరాతీ | ||||
---|---|---|---|---|
ఉచ్ఛారణ: | /gudʒ.(ə)'ɾɑ̈t̪i/ | |||
మాట్లాడే దేశాలు: | భారతదేశం, పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికా, ఉగాండా, టాంజానియా, కెన్యా, అమెరికా సంయుక్త రాష్ట్రాలు, సంయుక్త రాజ్యం, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, ఫిజి, కెనడా, జాంబియా, జింబాబ్వే | |||
మాట్లాడేవారి సంఖ్య: | 4.61 కోట్లు[1] | |||
ర్యాంకు: | 26 | |||
భాషా కుటుంబము: | ఇండో-ఐరోపా ఇండో-ఇరానీ ఇండో-ఆర్య పశ్చిమ ఇండో-ఆర్య ఘూర్జరం | |||
వ్రాసే పద్ధతి: | ఘూర్జర లిపి | |||
అధికారిక స్థాయి | ||||
అధికార భాష: | గుజరాత్ (భారతదేశం)[1][2] | |||
నియంత్రణ: | అధికారిక నియంత్రణ లేదు | |||
భాషా సంజ్ఞలు | ||||
ISO 639-1: | gu | |||
ISO 639-2: | guj | |||
ISO 639-3: | guj | |||
|
మూసివేయి
ప్రపంచంలో దాదాపు 4.6కోట్లమంది ఘూర్జరం మాట్లాడేవారుకలరు. ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే 26వ భాష (రోమానీ , సింధీ భాషలతో కలిపి). ఇది పశ్చిమభారతంలో మాట్లాడు నవీన ఇండో-ఆర్య భాష. భారత జాతిపిత మహాత్మాగాంధీ, పాకిస్తాన్ జాతిపిత ముహమ్మద్ అలీ జిన్నా, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయి పటేల్ ల ప్రథమభాష ఘూర్జరం.